అన్వేషించండి

ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!

Maruti Fronx భారత్‌లో 6,03,463 యూనిట్ల అమ్మకాలను దాటింది. ధర రూ.6.90 లక్షల నుంచి ప్రారంభం. ఇంజిన్ ఆప్షన్లు, అమ్మకాల వివరాలు తెలుసుకోండి.

Maruti Fronx Price, Features Telugu: భారత కార్ల మార్కెట్లో Maruti Suzuki Fronx మరో కీలక మైలురాయిని చేరుకుంది. 2023 ఏప్రిల్‌లో లాంచ్‌ అయిన ఈ కాంపాక్ట్ SUV.. ఇప్పటివరకు ‍‌(43 నెలలు) దేశీయ మార్కెట్లో 6 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడైంది. Nexa షోరూమ్‌ల్లో విక్రయించే SUVల్లో ఈ ఘనత సాధించిన తొలి మోడల్‌గా రికార్డ్‌ సృష్టించింది.

ప్రస్తుతం, 2026-27 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2026 నుంచి అక్టోబర్ 2026 వరకు), Nexa లైనప్‌లో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా Fronx నిలిచింది. ఈ విషయంలో Maruti Baleno హ్యాచ్‌బ్యాక్‌ను కూడా వెనక్కి నెట్టింది. ఆకర్షణీయమైన డిజైన్, పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్లు ఈ కారు సేల్స్‌ను హై స్పీడ్‌లో నడిపిస్తున్నాయి.

1. ఇప్పటివరకు 6,03,463 కార్ల అమ్మకాలు

Maruti Fronx 2026 అక్టోబర్ నాటికి మొత్తం 6,03,463 యూనిట్ల దేశీయ హోల్‌సేల్ అమ్మకాలను నమోదు చేసింది. ఫ్యాక్టరీ నుంచి డీలర్లకు పంపిన కార్ల సంఖ్య ఆధారంగా ఈ లెక్కలు రూపొందించారు.

ఆర్థిక సంవత్సరాల వారీగా అమ్మకాలు:

ఆర్థిక సంవత్సరం కాలం అమ్మకాలు
FY2024 ఏప్రిల్ 2023 - మార్చి 2024 1,34,735
FY2025 ఏప్రిల్ 2024 - మార్చి 2025 1,66,216
FY2026 ఏప్రిల్ 2025 - మార్చి 2026 1,72,363
FY2027 ఏప్రిల్ - అక్టోబర్ 2026 1,30,149
మొత్తం ఏప్రిల్ 2023 - అక్టోబర్ 2026 6,03,463

Fronx విడుదలైన తొలి 10 నెలల్లోనే లక్ష యూనిట్ల అమ్మకాలను దాటింది. 17 నెలల్లో 2 లక్షలు, 23 నెలలకు 3 లక్షలు, 33 నెలల్లో 4 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది మే ప్రారంభంలో 5 లక్షల మార్కును దాటింది. ఆ తర్వాత మరో లక్ష కార్లను కేవలం ఐదు నెలల సమయంలో విక్రయించింది.

ఇది కూడా చదవండి: 17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!

 2. Balenoను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్

2026-27 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఏడు నెలల్లో Fronx 1,30,149 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన 93,808 యూనిట్లతో పోలిస్తే ఇది 39 శాతం వృద్ధి. దీంతో, Nexaలో మరో పాపులర్‌ మోడల్ అయిన Balenoను Fronx అధిగమించింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో Maruti Baleno అమ్మకాలు 1,29,488 యూనిట్లు కాగా, Fronx మరో 661 యూనిట్ల ఆధిక్యంతో Nexaలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా నిలిచింది. అయితే, గత ఆర్థిక సంవత్సరం FY26లో Baleno 1,72,560 యూనిట్లతో Nexaలో మొదటి స్థానంలో ఉండగా... Fronx 1,72,363 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. అప్పుడు ఈ రెండు మోడళ్ల మధ్య వ్యత్యాసం కేవలం 197 యూనిట్లు మాత్రమే.

Maruti SUVల మొత్తం అమ్మకాల్లోనూ Fronx వాటా పెరిగింది. FY27లో అక్టోబర్ వరకు కంపెనీ విక్రయించిన 5,53,479 SUVల్లో Fronx వాటా 24 శాతంగా తేలింది. 2023 ఏప్రిల్‌లో లాంచ్ అయినప్పటి నుంచి ఇదే అత్యధిక వాటా.

 3. ఒక్క నెలలో 20,000 కార్ల అమ్మకాలు

2026 అక్టోబర్‌లో Fronx 20,014 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఒక నెలలో 20 వేల అమ్మకాల మైలురాయిని దాటడం ఇది నాలుగోసారి. 

గతంలో.. డిసెంబర్ 2025లో 20,706 యూనిట్లు, ఫిబ్రవరి 2025లో 21,461 యూనిట్లు, మే 2026లో 20,686 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ప్రస్తుత అమ్మకాల వేగం ఇలాగే కొనసాగితే, FY27 ముగిసే (మార్చి 2027) నాటికి Fronx వార్షిక అమ్మకాలు 2 లక్షల మార్కును దాటవచ్చని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 2.25 లక్షల యూనిట్ల సేల్స్‌ సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

 4. విదేశాలకు కూడా భారీగా ఎగుమతులు

Fronxకు భారత్‌లోనే కాకుండా విదేశీ మార్కెట్లలోనూ ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు 2.20 లక్షలకు పైగా Fronx కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. దేశీయ అమ్మకాలతో పాటు ఎగుమతులు కూడా ఈ మోడల్ విజయానికి తోడ్పడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు

 5. ధర, ఇంజిన్ ఆప్షన్లు

ప్రస్తుతం Maruti Fronx ఐదు వేరియంట్లలో లభిస్తోంది. అవి Sigma, Delta, Delta+, Zeta, Alpha. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు రూ.6.90 లక్షల నుంచి రూ.11.89 లక్షల వరకు ఉన్నాయి.

ఇందులో మూడు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

- 1.2 లీటర్ పెట్రోల్: 4 సిలిండర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్. గరిష్ఠంగా 90hp పవర్ ఉత్పత్తి చేస్తుంది.
- 1.2 లీటర్ CNG: 77.5hp పవర్ అందిస్తుంది. ఈ ఆప్షన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.
- 1.0 లీటర్ టర్బో పెట్రోల్: 3 సిలిండర్ల ఇంజిన్. 100hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

 2027లో ఫేస్‌లిఫ్ట్ వచ్చే అవకాశం

Maruti Fronx ప్రస్తుతం Renault Kiger, Nissan Magnite, Hyundai Venue, Mahindra XUV 3XO, Kia Sonet, Kia Syros, Skoda Kylaq, Maruti Brezza వంటి మోడళ్లతో పోటీ పడుతోంది.

మారుతి కంపెనీ Fronx ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఇప్పటికే పరీక్షిస్తోంది. ఈ అప్‌డేటెడ్ మోడల్ 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త వెర్షన్‌లో ఎలాంటి మార్పులు ఉంటాయనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Xiaomi 18 Pro Max vs iPhone 18 Pro Max : షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
రూ.62,000 వరకు తక్కువకే Honda క్రూయిజర్ బైక్.. Rebel 500 ధర, ఇంజిన్, ఫీచర్లు, కలర్స్ వివరాలు
లో-స్లంగ్ క్రూయిజర్ Honda Rebel 500.. యూత్‌ తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు
Scrappage Benefits: CODని చూపిస్తే కొత్త కారుపై గ్యారెంటీ బెనిఫిట్స్! తెలంగాణలో రోడ్ ట్యాక్స్ రాయితీ ఎంతంటే?
పాత కారును స్క్రాప్ చేస్తే కొత్త కారు కొనడం చవక! COD బెనిఫిట్స్‌ను ఎలా క్లెయిమ్‌ చేయాలంటే?
Certificate of Deposit: పాత కారు ఇచ్చి కొత్త కారు కొంటున్నారా? ఈ ఒక్క సర్టిఫికెట్‌తో రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించుకోవచ్చు!
పాత కారును స్క్రాప్ చేస్తే కొత్త కారుపై భారీ ఆదా.. దాదాపు రూ.30.000 వరకు రాయితీ!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
Xiaomi 18 Pro Max vs iPhone 18 Pro Max : షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
Kiran Abbavaram Record : కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
Embed widget