అన్వేషించండి

Xiaomi 18 Pro Max vs iPhone 18 Pro Max : షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?

Xiaomi 18 Pro Max vs iPhone 18 Pro Max : షామీ 18 ప్రో మ్యాక్స్, ఐఫోన 18 ప్రో మ్యాక్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ రెండు ఫోన్ల ఫీచర్లు, ఏది బెస్ట్ ఆప్షనో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షామీ, ఐఫోన్ మధ్య తీవ్రమైన పోటీ.
  • రెండు 6.9-అంగుళాల డిస్‌ప్లేలు, కొత్త 2nm ప్రాసెసర్‌లు కలిగివున్నాయి.
  • షావోమికి 200MP కెమెరా, ఐఫోన్‌కు వేరియబుల్ అపర్చర్ ప్రత్యేకత.
  • షావోమి బ్యాటరీ ఆధిక్యం; ఐఫోన్ ధర రూ.1.79 లక్షల నుండి.

Xiaomi 18 Pro Max vs iPhone 18 Pro Max : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షామీ 18 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. షామీ ఇటీవలే తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయగా, యాపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఇప్పటికే భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. సరికొత్త 2nm ప్రాసెసర్లు, భారీ డిస్‌ప్లేలు, లేటెస్ట్ కెమెరా ఫీచర్లతో వచ్చిన ఈ రెండు ఫోన్లలో ఏది ఏ విభాగంలో ముందుందో ఇప్పుడు తెలుసుకుందాం.

డిస్‌ప్లే, డిజైన్ 

రెండు స్మార్ట్‌ఫోన్‌లు 6.9-అంగుళాల భారీ స్క్రీన్‌లతో వస్తున్నాయి. షామీ 18 ప్రో మ్యాక్స్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఫుల్ HD+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. మరోవైపు, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రోమోషన్ టెక్నాలజీతో 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లేతో పాటు మరింత చిన్నదిగా డైనమిక్ ఐలాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

కెమెరా కెపాసిటీ 

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం షామీ 18 ప్రో మ్యాక్స్‌లో లైకా ట్యూన్ చేసిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో OIS సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా మరియు 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా మెయిన్ అట్రాక్షన్. దీనికి పోటీగా, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో వేరియబుల్ అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరాతో పాటు, 48MP అల్ట్రావైడ్, 48MP టెలిఫొటో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెగాపిక్సెల్స్ పరంగా షామీ ముందున్నప్పటికీ, వేరియబుల్ అపర్చర్ యాపిల్‌కు అదనపు బలాన్నిస్తుంది.

ప్రాసెసర్, పనితీరు 

పనితీరు విషయంలో ఈ రెండు ఫోన్లు లేటెస్ట్ 2nm టెక్నాలజీపై ఆధారపడ్డాయి. షామీ 18 ప్రో మ్యాక్స్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది మ్యాగ్జిమం 5.01GHz క్లాక్ స్పీడ్‌తో అద్భుతమైన వేగాన్ని ఇస్తుంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో యాపిల్ సరికొత్త A20 ప్రో చిప్‌సెట్ ఉంది. ఇందులో రెండు కొత్త సూపర్ కోర్లు, నాలుగు ఎఫిషియెన్సీ కోర్లతో 6 కోర్ CPU బెస్ట్ పనితీరును అందిస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ 

బ్యాటరీ కెపాసిటీ, ఛార్జింగ్ వేగంలో షామీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇందులో భారీ 7,050mAh బ్యాటరీతో పాటు 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ బ్యాటరీ కెపాసిటీ యాపిల్ వెల్లడించనప్పటికీ, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ లేదా 30 గంటల వరకు సాధారణ బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుందని పేర్కొంది.

Also Read: రూ.62,000 వరకు తక్కువకే Honda క్రూయిజర్ బైక్.. Rebel 500 ధర, ఇంజిన్, ఫీచర్లు, కలర్స్ వివరాలు

ధర, లభ్యత 

దేశంలో షామీ 18 ప్రో మ్యాక్స్ ధర ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే యూరోపియన్ మార్కెట్లో దీని 12GB RAM + 256GB బేస్ వేరియంట్ ధర 1,599 యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ.1.64 లక్షలు) గా ఉంది. ఇది బ్లాక్, కాస్మిక్ బ్లూ, వెల్వెట్ రెడ్, వైట్ రంగులలో లభిస్తుంది. మరోవైపు, భారత మార్కెట్లో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256GB బేస్ వేరియంట్ ధర రూ.1,79,900 నుండి ప్రారంభమవుతుంది. దీని టాప్-ఎండ్ 2TB స్టోరేజ్ మోడల్ ధర రూ.3,29,900 గా ఉంది. ఈ ఫోన్ బ్లాక్, బర్గుండి, గ్లేసియర్, సిల్వర్ రంగులలో అందుబాటులో ఉంది. 

Also Read:  CODని చూపిస్తే కొత్త కారుపై గ్యారెంటీ బెనిఫిట్స్! తెలంగాణలో రోడ్ ట్యాక్స్ రాయితీ ఎంతంటే?

Frequently Asked Questions

డిస్‌ప్లే పరంగా షామీ 18 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మధ్య తేడా ఏమిటి?

షామీలో 120Hz అమొలెడ్ డిస్‌ప్లే, 4,000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండగా, ఐఫోన్‌లో ప్రోమోషన్ టెక్నాలజీతో సూపర్ రెటినా XDR OLED స్క్రీన్, డైనమిక్ ఐలాండ్ ఉన్నాయి.

ఈ ఫోన్లలో ఎలాంటి ప్రాసెసర్లు ఉపయోగించారు?

షామీ 18 ప్రో మ్యాక్స్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్ ఉంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ యాపిల్ సరికొత్త A20 ప్రో చిప్‌సెట్‌తో వస్తుంది. రెండూ 2nm టెక్నాలజీపై ఆధారపడ్డాయి.

బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా ఏ ఫోన్ మెరుగైనది?

షామీ 18 ప్రో మ్యాక్స్ 7,050mAh బ్యాటరీతో పాటు 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 45 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది.

భారత మార్కెట్లో ఈ ఫోన్ల ధరలు ఎలా ఉన్నాయి?

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ బేస్ వేరియంట్ ధర రూ.1,79,900 నుండి మొదలవుతుంది. షామీ 18 ప్రో మ్యాక్స్ ధర యూరోపియన్ మార్కెట్లో సుమారు రూ.1.64 లక్షలు (భారత్‌లో ఇంకా ప్రకటించలేదు).

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.62,000 వరకు తక్కువకే Honda క్రూయిజర్ బైక్.. Rebel 500 ధర, ఇంజిన్, ఫీచర్లు, కలర్స్ వివరాలు
లో-స్లంగ్ క్రూయిజర్ Honda Rebel 500.. యూత్‌ తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు
Scrappage Benefits: CODని చూపిస్తే కొత్త కారుపై గ్యారెంటీ బెనిఫిట్స్! తెలంగాణలో రోడ్ ట్యాక్స్ రాయితీ ఎంతంటే?
పాత కారును స్క్రాప్ చేస్తే కొత్త కారు కొనడం చవక! COD బెనిఫిట్స్‌ను ఎలా క్లెయిమ్‌ చేయాలంటే?
Certificate of Deposit: పాత కారు ఇచ్చి కొత్త కారు కొంటున్నారా? ఈ ఒక్క సర్టిఫికెట్‌తో రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించుకోవచ్చు!
పాత కారును స్క్రాప్ చేస్తే కొత్త కారుపై భారీ ఆదా.. దాదాపు రూ.30.000 వరకు రాయితీ!
Maruti Cars Price Hike: కొత్త కారు కొనేవాళ్లకు షాక్.. నాలుగోసారి రేట్లు పెంచిన మారుతి సుజుకి
మారుతి సుజుకి కార్ల ధరలు పెంపు.. ఆల్రెడీ అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
Adilabad Crime News: మంత్రాలకు డబ్బులు రెట్టింపు అంటూ మోసాలు.. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
మంత్రాలకు డబ్బులు రెట్టింపు అంటూ మోసాలు.. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
రూ.62,000 వరకు తక్కువకే Honda క్రూయిజర్ బైక్.. Rebel 500 ధర, ఇంజిన్, ఫీచర్లు, కలర్స్ వివరాలు
లో-స్లంగ్ క్రూయిజర్ Honda Rebel 500.. యూత్‌ తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు
Kiran Abbavaram Record : కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
IND VS NZ 1st Test Result: తొలిటెస్టులో ఇండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లిన కివీస్ బ్యాటర్లు.. మారథాన్ ఇన్సింగ్స్ తో  డారిల్ , ఫిలిప్స్ అద్భుత పోరాటం
తొలిటెస్టులో ఇండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లిన కివీస్ బ్యాటర్లు.. మారథాన్ ఇన్సింగ్స్ తో  డారిల్ , ఫిలిప్స్ అద్భుత పోరాటం, డ్రాగా ముగిసిన మ్యాచ్
Vijayawada Mayor Oath Taking: విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా ప్రమాణ స్వీకారం.. ఏపీలో కొత్త మేయర్లు, చైర్మన్లు ప్రమాణం
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా ప్రమాణ స్వీకారం.. ఏపీలో కొత్త మేయర్లు, చైర్మన్లు ప్రమాణం
Embed widget