అన్వేషించండి

Scrappage Benefits: CODని చూపిస్తే కొత్త కారుపై గ్యారెంటీ బెనిఫిట్స్! తెలంగాణలో రోడ్ ట్యాక్స్ రాయితీ ఎంతంటే?

Certificate Of Deposit: పాత కారును స్క్రాప్ చేసి COD ఎలా పొందాలి? కొత్త కారు కొనుగోలుపై రోడ్ ట్యాక్స్ రాయితీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు, కంపెనీ డిస్కౌంట్లు ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకోండి.

How to claim scrappage benefits: పాత కారును 'గుర్తింపు పొందిన స్క్రాపింగ్ కేంద్రానికి' అప్పగించి సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ (Certificate of Deposit) ఎలా పొందాలో "ABP దేశం" గత కథనంలో తెలుసుకున్నాం. ఈ ఒక్క సర్టిఫికెట్‌తో, కొత్త కారు కొనుగోలు సమయంలో రోడ్ ట్యాక్స్‌పై రాయితీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపుతో పాటు కార్ల కంపెనీల నుంచి ప్రత్యేక డిస్కౌంట్లు కూడా పొందవచ్చు. కొత్త కారు కొనేటప్పుడు ఈ ప్రయోజనాలను ఎలా క్లెయిమ్ చేయాలి? కొత్త కారు కొనకుండానే CODని మరొకరికి అమ్ముకోవచ్చా? ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈ ప్రయోజనాలను ఎలా క్లెయిమ్ చేయాలి?

కొత్త కారు కొనుగోలు సమయంలో, మీ పాత కారు CODని డీలర్‌కు లేదా RTOకు సమర్పించాలి. వారు VAHAN పోర్టల్‌లో డిజిటల్‌గా సర్టిఫికెట్ వివరాలను ధ్రువీకరిస్తారు. ఒకసారి ఉపయోగించిన తర్వాత ఆ CODని 'Cancelled'గా గుర్తిస్తారు. మీకు జారీ అయిన CODలను ప్రభుత్వ VScrap పోర్టల్‌లో చూడవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రభుత్వానికి చెందిన లేదా స్వాధీనం చేసుకున్న వాహనాల స్క్రాపింగ్ ద్వారా జారీ అయిన CODలకు ఈ ప్రయోజనాలు వర్తించవు.

పాత కారుకు COD ఎలా పొందాలి?

మీ వాహనాన్ని గుర్తింపు పొందిన RVSF లేదా దాని అనుబంధ కలెక్షన్ కేంద్రానికి తీసుకెళ్లాలి. ఒక రాష్ట్రంలోని RVSF మరో రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో రిజిస్టర్ అయిన వాహనాన్ని కూడా అంగీకరిస్తుంది. ఈ ప్రక్రియ VAHAN ఆన్‌లైన్ పోర్టల్‌తో అనుసంధానమై ఉంటుంది. 2026 నవంబర్ 19 నాటికి MoRTHకు చెందిన VScrap పోర్టల్‌లో మొత్తం 241 RVSF కేంద్రాలు నమోదై ఉన్నాయి.

మరో మార్గం కూడా ఉంది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ MSTC నిర్వహించే End-of-Life Vehicle (ELV) పోర్టల్‌లో మీ పాత కారును నమోదు చేయవచ్చు. KYC వివరాలు, కారు సమాచారం అందించిన తర్వాత RVSF కేంద్రాలు మిమ్మల్ని సంప్రదిస్తాయి. అప్పుడు ధర, ఇతర షరతులపై ఒప్పందం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: 180 టన్నుల విమానాన్ని కేవలం రెండు టైర్లపైనే లాగిన SUV.. Denza Bao 5 సరికొత్త రికార్డు!

స్క్రాపింగ్ ప్రక్రియ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

స్క్రాపింగ్ ప్రక్రియ కోసం, వాహన యజమాని VAHAN పోర్టల్‌లో Form-2 ద్వారా దరఖాస్తు చేయాలి. మీరు కారును అప్పగించబోయే RVSF లేదా కలెక్షన్ కేంద్రం పేరుతో ఈ దరఖాస్తు ఉంటుంది. అవసరమైతే కేంద్రం సిబ్బంది కూడా ఫారం నింపడంలో సహాయం చేస్తారు.

దరఖాస్తులో PAN, బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలి. అలాగే పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు, చిరునామా రుజువులను అప్‌లోడ్ చేయాలి. మీ తరఫున మరొకరు కారును అప్పగిస్తుంటే, స్టాంప్ పేపర్‌పై అధికార పత్రంతో పాటు ఆ వ్యక్తి గుర్తింపు, చిరునామా రుజువులు కూడా అవసరం.

కారును అప్పగించే సమయంలో ఒరిజినల్ RC తీసుకెళ్లాలి. వాహనం ఎలాంటి నేర కార్యకలాపాలు లేదా న్యాయ వివాదాల్లో లేదని, పెండింగ్ బకాయిలు లేవని, RCపై ఉన్న రుణం, లీజ్ లేదా హైపోథికేషన్ పూర్తిగా క్లియర్ అయ్యాయని డిజిటల్ అండర్‌టేకింగ్ ఇవ్వాలి.

ఆ తర్వాత RVSF అధికారులు VAHANలో వాహన రికార్డులను తనిఖీ చేస్తారు. అన్ని తనిఖీలు పూర్తయ్యాక, ఒప్పుకున్న మొత్తాన్ని డిజిటల్ చెల్లింపు లేదా అకౌంట్ పే చెక్ ద్వారా మీకు అందిస్తారు. మీ సమక్షంలోనే RCపై రంధ్రం చేయడం లేదా దానిని పనికిరాకుండా గుర్తు పెట్టడం జరుగుతుంది. అనంతరం VAHAN ద్వారా డిజిటల్ సంతకం ఉన్న COD జారీ చేస్తారు.

COD గడువు ఎంత?

COD జారీ చేసిన తేదీ నుంచి మూడు సంవత్సరాల వరకు కొత్త వాహనం కొనుగోలుపై ప్రయోజనాలు పొందడానికి దానిని ఉపయోగించుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలు రోడ్ ట్యాక్స్ రాయితీకి ప్రత్యేక గడువులు విధించాయి. ఉదాహరణకు.. మహారాష్ట్రలో ఈ పథకం మూడేళ్లకు పరిమితం కాగా, కేరళలో COD జారీ అయిన తర్వాత ఏడాది లోపే రాయితీ పొందాలి.

ఇది కూడా చదవండి: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!

కొత్త కారు కొనకపోతే COD అమ్ముకోవచ్చా?

అవును. 2022 సెప్టెంబర్‌లో చేసిన సవరణ ప్రకారం, CODలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే, అమ్మే అవకాశం కల్పించారు. ఇందుకోసం MoRTHకు చెందిన VScrap పోర్టల్ సూచించిన DigiELV వేదికను ఉపయోగించాలి. 

ముందుగా VScrap పోర్టల్‌లో మీ CODను గుర్తించి 'Trade' ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత DigiELVలో రిజిస్టర్ చేసుకుని KYC పూర్తి చేయాలి. మీకు నచ్చిన ధరకు CODను అమ్మకానికి పెట్టవచ్చు. వచ్చిన బిడ్లలో నచ్చినదానిని అంగీకరించవచ్చు. లేదంటే అప్పటి మార్కెట్ ధరకు వెంటనే విక్రయించే ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వ లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న కార్లకు జారీ చేసిన CODలను అమ్మడం సాధ్యం కాదు.

NITI Aayog గణాంకాల ప్రకారం, 2025 సెప్టెంబర్ 1 నాటికి DigiELVలో మొత్తం 71,196 CODలు ట్రేడ్ అయ్యాయి. వీటిలో 69,390 ప్రైవేట్ కార్లతో సహా రవాణా అవసరాలకు ఉపయోగించని తేలికపాటి మోటారు వాహనాలకు సంబంధించినవి. వీటి సగటు విక్రయ ధర రూ.10,814గా నమోదైంది.

తెలంగాణలో రోడ్ ట్యాక్స్ రాయితీ ఎంత?

Rule 51Aలో గరిష్ఠ రాయితీ పరిమితిని మాత్రమే కేంద్రం నిర్దేశించింది. వాస్తవంగా ఎంత రాయితీ ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలి. తెలంగాణలో కొత్త కారు ఎక్స్-షోరూమ్ ధర ఆధారంగా స్థిరమైన మొత్తంలో రాయితీ ఇస్తారు. రూ.5 లక్షల వరకు ధర ఉన్న కార్లకు ఇది రూ.10,000తో ప్రారంభమవుతుంది. ప్రతి అదనపు రూ.5 లక్షలకు రాయితీ మరో రూ.10,000 పెరుగుతుంది. రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న కార్లకు గరిష్ఠంగా రూ.50,000 రాయితీ లభిస్తుంది.

తెలంగాణలో మరో ముఖ్యమైన షరతు ఉంది. స్క్రాప్ చేసిన వాహనం, కొత్తగా కొనుగోలు చేసే వాహనం ఒకే కేటగిరీకి చెందినవై ఉండాలి. అంటే ప్రైవేట్ కారును స్క్రాప్ చేస్తే మరో ప్రైవేట్ కారునే కొనాలి. టాక్సీని స్క్రాప్ చేస్తే కొత్తగా కొనేది కూడా రవాణా వాహనమే అయి ఉండాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Driving Licence Renewal: RTO ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు! డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ను ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఇలా చేయండి!
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగుస్తోందా? ఇంట్లోనే ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోండి.. కేవలం 12 స్టెప్స్‌లో!
Kia Carens Clavisలో ఏ వేరియంట్‌ ధర ఎంత? మిడ్‌ వేరియంట్‌లో ఏ ఫీచర్లున్నాయి? పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో పూర్తి వివరాలు
Kia Carens Clavis లో 11 వేరియంట్లు.. ధర, ఫీచర్ల పరంగా మీకు ఏది బెస్ట్?
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
AdBlue In Cars: డీజిల్ కారు ఓనర్లు, డ్రైవర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం.. AdBlue ఎప్పుడు నింపాలి? ధర ఎంత?
డీజిల్ కారులో AdBlue అంటే ఏమిటి? ఇది అయిపోతే ఇంజిన్ మళ్లీ స్టార్ట్ కాదా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget