అన్వేషించండి

Driving Licence Renewal: RTO ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు! డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ను ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఇలా చేయండి!

Driving Licence Online Process: డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ను ఆన్‌లైన్‌లో ఎలా చేసుకోవాలి? సారథి పోర్టల్‌లో 12 స్టెప్స్, అవసరమైన డాక్యుమెంట్లు, ఫీజుల వివరాలు తెలుసుకోండి.

Driving Licence Renewal Online: డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగియబోతోందా? అయితే రెన్యూవల్ కోసం RTO ఆఫీస్‌ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొనే ఆన్‌లైన్‌లో లైసెన్స్ రెన్యూవల్ పనిని పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సారథి పరివాహన్ పోర్టల్ ద్వారా ఈ సేవ అందుబాటులో ఉంది. దరఖాస్తు చేయడం నుంచి ఫీజు చెల్లించి రసీదు పొందడం వరకు మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే నిర్వహించవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం ప్రక్రియ, ఫీజుల వివరాలను ఈ కథనంలో సులభంగా తెలుసుకుందాం.

డ్రైవింగ్ లైసెన్స్ గడువు ఎంతకాలం?

ప్రైవేట్ డ్రైవింగ్ లైసెన్స్.. జారీ చేసిన తేదీ నుంచి 20 సంవత్సరాల వరకు లేదా లైసెన్స్ హోల్డర్‌కు 40 ఏళ్లు వచ్చే వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అప్పటి వరకు లైసెన్స్ చెల్లుతుంది.

40 ఏళ్లు దాటిన తర్వాత జారీ చేసే లైసెన్స్ 10 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఐదేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసుకోవాలి. మీ డ్రైవింగ్ లైసెన్స్‌పై దాని గడువు తేదీ వివరాలు ఉంటాయి. గడువు ముగియబోతున్నట్లయితే ఆన్‌లైన్‌లో రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ ఎలా చేయాలి?

సారథి పరివాహన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ 12 స్టెప్స్ అనుసరించాలి.

స్టెప్ 1: ముందుగా https://sarathi.parivahan.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. తర్వాత Online Services విభాగంలో Driving Licence Related Servicesపై క్లిక్ చేయాలి. అనంతరం Apply for DL Renewal ఎంపిక చేసుకోవాలి. దరఖాస్తు సమర్పణకు సంబంధించిన సూచనలు చదివి Continueపై క్లిక్ చేయాలి.

స్టెప్ 2: మీ డ్రైవింగ్ లైసెన్స్ (DL) నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయాలి. దీంతో లైసెన్స్ వివరాలు కనిపిస్తాయి. Proceedపై క్లిక్ చేసి వివరాలను పరిశీలించాలి.

స్టెప్ 3: కనిపించే ఆప్షన్లలో Renewal of DLను ఎంచుకుని Proceedపై క్లిక్ చేయాలి.

స్టెప్ 4: ఫిజికల్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన అప్లికేషన్ కమ్ డిక్లరేషన్ అయిన Form 1Aను ఆన్‌లైన్‌లో నింపాలి.

స్టెప్ 5: అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి Proceedపై క్లిక్ చేయాలి.

స్టెప్ 6: మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను మరోసారి నిర్ధారించుకోవాలి. అనంతరం Submitపై క్లిక్ చేయాలి.

స్టెప్ 7: అప్లికేషన్‌లో నమోదైన వివరాలను పరిశీలించి Okపై క్లిక్ చేయాలి.

స్టెప్ 8: మెడికల్ సర్టిఫికెట్, సెల్ఫ్ ఫొటో, ఈ-సిగ్నేచర్‌ను అప్‌లోడ్ చేయాలి. అనంతరం Save Photo and Signatureపై క్లిక్ చేయాలి.

స్టెప్ 9: స్క్రీన్‌పై కనిపించే క్యాప్చాను నమోదు చేసి Pay Nowపై క్లిక్ చేయాలి.

స్టెప్ 10: తదుపరి పేజీలో Proceed for Payment ఎంపిక చేసుకోవాలి.

స్టెప్ 11: డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఫీజు చెల్లించవచ్చు. చెల్లింపు విధానాన్ని ఎంచుకుని Pay Nowపై క్లిక్ చేయాలి.

స్టెప్ 12: చెల్లింపు విజయవంతమైన తర్వాత రసీదును జనరేట్ చేయాలి. అందులోని వివరాలను సరిచూసుకుని రసీదును ప్రింట్ తీసుకోవాలి.

ఇది కూడా చదవండి: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు

డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ ఫీజు ఎంత?

డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ ఫీజు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. రెన్యూవల్ కోసం రూ.200 వసూలు చేసే అవకాశం ఉంది. స్మార్ట్ కార్డు కోసం అదనంగా రూ.200 చార్జ్ చేయవచ్చు. దీంతో మొత్తం ఖర్చు రూ.400 వరకు ఉండొచ్చు. అయితే మీ ప్రాంతానికి వర్తించే ఖచ్చితమైన ఫీజు అనేది చెల్లింపు సమయంలో పోర్టల్‌లో చూపించే వివరాలపై ఆధారపడి ఉంటుంది.

దరఖాస్తు చేసిన తర్వాత ఏం జరుగుతుంది?

ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించిన తర్వాత సంబంధిత కార్యాలయంలోని డీలింగ్ అసిస్టెంట్ దానిని పరిశీలిస్తారు. అవసరమైన డాక్యుమెంట్లు, ఫొటో, సంతకం సరిగ్గా ఉన్నాయా లేదా అని తనిఖీ చేస్తారు. దరఖాస్తు పూర్తి స్థాయిలో ఉంటే లైసెన్సింగ్ అథారిటీ దానిని ఆమోదిస్తుంది. అనంతరం కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తారు.

ఒకవేళ దరఖాస్తులో ఏదైనా లోపం ఉన్నా లేదా సరైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయకపోయినా దానిని తిరిగి దరఖాస్తుదారుడికి పంపిస్తారు. ఏ డాక్యుమెంట్‌లో లోపం ఉందో, ఏ మార్పు చేయాలో సంబంధిత అధికారి పోర్టల్‌లోని రిమార్క్స్‌లో పేర్కొంటారు. ఆ సూచనల ప్రకారం సరైన డాక్యుమెంట్‌ను మళ్లీ అప్‌లోడ్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: హైయెస్ట్‌ మైలేజీ ఇచ్చే టాప్ 10 CNG కార్లు ఇవే.. కిలో గ్యాస్‌తో ఏకంగా 36.47km! టాప్‌లో Maruti Dzire

ఇలా.. సారథి పరివాహన్ పోర్టల్ ద్వారా ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. RTO కార్యాలయానికి నేరుగా వెళ్లాల్సిన అవసరాన్ని ఈ ఆన్‌లైన్ విధానం తగ్గిస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kia Carens Clavisలో ఏ వేరియంట్‌ ధర ఎంత? మిడ్‌ వేరియంట్‌లో ఏ ఫీచర్లున్నాయి? పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో పూర్తి వివరాలు
Kia Carens Clavis లో 11 వేరియంట్లు.. ధర, ఫీచర్ల పరంగా మీకు ఏది బెస్ట్?
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
AdBlue In Cars: డీజిల్ కారు ఓనర్లు, డ్రైవర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం.. AdBlue ఎప్పుడు నింపాలి? ధర ఎంత?
డీజిల్ కారులో AdBlue అంటే ఏమిటి? ఇది అయిపోతే ఇంజిన్ మళ్లీ స్టార్ట్ కాదా?
Highest Mileage CNG Cars: హైయెస్ట్‌ మైలేజీ ఇచ్చే టాప్ 10 CNG కార్లు ఇవే.. కిలో గ్యాస్‌తో ఏకంగా 36.47km! టాప్‌లో Maruti Dzire
దేశం మొత్తంలో అత్యధిక మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 CNG కార్లు.. కేవలం రూ.4.69 లక్షల నుంచి స్టార్ట్‌
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Atmakur Municipal Vice Chairperson: రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
Seethakka: కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
This Week Movies : శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
Embed widget