రాయల్ ఎన్‌ఫీల్డ్ 500కి పోటీగా Honda CB500.. మూడు వేరియంట్లు, 501cc ఇంజిన్, 28hp పవర్
Honda CB500 భారత్‌లో రూ.2.75 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయింది. 501cc ఇంజిన్, 28hp పవర్, 43.3Nm టార్క్‌తో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Honda CB500 launched: 500cc బైక్‌పై రైడ్ చేయాలనే ఆసక్తి ఉన్నవారికి హోండా గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న Honda CB500 మోటార్‌సైకిల్‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బండి ప్రారంభ ధర రూ.2.75 లక్షలు (ఎక్స్‌షోరూమ్). మూడు వేరియంట్లలో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. అలాయ్ వీల్స్ & స్పోక్ వీల్స్ ఆప్షన్లతో పాటు ప్రత్యేక గ్రాఫిక్స్ ఉన్న టాప్ వేరియంట్‌ను కూడా కంపెనీ తీసుకొచ్చింది.
గత జులైలో భారత మార్కెట్ కోసం హోండా ప్రదర్శించిన మోడళ్లలో CB500 కూడా ఒకటి. ముఖ్యంగా, ఎక్కువ కెపాసిటీ కలిగిన ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో ఈ బైక్ ప్రత్యేకతను సంపాదించింది. ఈ తరహా ఇంజిన్ ఆప్షన్ చాలా కాలంగా దేశీయ మార్కెట్లో అందుబాటులో లేదు.
501cc ఇంజిన్.. 43.3Nm టార్క్
హోండా CB500లో సరికొత్త 501cc సింగిల్ సిలిండర్ ఎయిర్ & ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 5,250rpm వద్ద 28hp పవర్, 3,750rpm వద్ద 43.3Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో హోండా అందిస్తున్న అతి పెద్ద ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ మోటార్‌సైకిల్ ఇదే.
ఈ ఇంజిన్‌ను 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. స్లిప్ & అసిస్ట్ క్లచ్ కూడా అందించారు. ముందు 19 అంగుళాల వీల్, వెనుక 17 అంగుళాల వీల్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం రెండు వైపులా డిస్క్ బ్రేకులు, డ్యూయల్-ఛానల్ ABS ఇచ్చారు.
సస్పెన్షన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ గ్యాస్-ఛార్జ్‌డ్ ట్విన్ షాక్స్ ఉన్నాయి. ఈ బైక్ కెర్బ్ వెయిట్ 189 కిలోలు.
Honda CB350 బరువు 181 కిలోలు కాగా, Royal Enfield Classic 350 బరువు 195 కిలోలు. CB500 గ్రౌండ్ క్లియరెన్స్ 168mm.
ఇది కూడా చదవండి: RCలో 30 రోజుల్లో అడ్రస్ మార్చుకోకపోతే జరిమానా.. కావాల్సిన డాక్యుమెంట్లు, ఫీజు వివరాలు
మూడు వేరియంట్లు.. ధరలు ఇవే
హోండా CB500ను మూడు వేరియంట్లలో విక్రయించనుంది.
1. Alloy: ఇది బేస్ వేరియంట్, దీని ధర రూ.2.75 లక్షలు. Pearl Igneous Black, Pearl Deep Ground Gray రంగుల్లో లభిస్తుంది.
2. Spoke: ఇది మిడ్-స్పెక్ వేరియంట్, దీని ధర రూ.3 లక్షలు. ఇందులో క్రాస్-స్పోక్ ట్యూబ్‌లెస్ రిమ్స్ అందించారు. Rebel Red Metallic, Matt Steel Silver Metallic రంగుల ఆప్షన్లు ఉన్నాయి.
3. Spoke with Stripe: ఇది టాప్ వేరియంట్, దీని ధర రూ.3.02 లక్షలు. స్పోక్ వీల్స్‌తో పాటు ప్రత్యేక రంగు & గ్రాఫిక్స్ ఇందులో అదనపు ఆకర్షణ. Pearl Igneous Black రంగులో స్ట్రైప్స్‌తో లభిస్తుంది.
మూడు వేరియంట్లలోనూ ఒకే తరహా స్టాండర్డ్ ఫీచర్లు ఉన్నాయి. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) పేరుతో ట్రాక్షన్ కంట్రోల్, అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హోండా సింక్ కనెక్టివిటీ అందించారు.
భారత్‌లో తయారీ.. ధరలో పోటీ
CB500ను హోండా భారత్‌లోనే తయారు చేస్తోంది. 350cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లపై 40 శాతం GST ఉన్నప్పటికీ, స్థానిక తయారీ కారణంగా పోటీ ధరలో తీసుకురావడానికి అవకాశం కలిగింది.
ధరల పరంగా చూస్తే, Royal Enfield 650 Twins కంటే CB500 ధర తక్కువే. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్ల ప్రారంభ ధర రూ.3.38 లక్షలు. రాయల్ ఎన్‌ఫీల్డ్ 2020లో తన 500cc UCE మోడళ్లను నిలిపివేసిన తర్వాత ఈ విభాగంలో ఏర్పడిన ఖాళీని CB500 భర్తీ చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: రూ.62,000 వరకు తక్కువకే Honda క్రూయిజర్ బైక్.. Rebel 500 ధర, ఇంజిన్, ఫీచర్లు, కలర్స్ వివరాలు
బుకింగ్స్ ప్రారంభం.. డెలివరీలు ఎప్పటి నుంచి?
హోండా CB500 కోసం ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం, 2026 చివరి నాటికి డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉంది.
ఇటీవలే, Honda Rebel 300 Standard & E-Clutch వేరియంట్ల డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఇండియా మేడ్ Honda Rebel 500ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు Honda CB500 లాంచ్‌తో తన మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది.
గమనిక: కథనంలో పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ధరలు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















