అన్వేషించండి

Engine Layout: మీ కారు ఇంజిన్ ఎక్కడుంది? ముందు, వెనుక లేదా మధ్యలో.. ప్లేస్‌మెంట్‌ను బట్టి మారనున్న డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌!

Car Engine Layout: కార్లలో ఫ్రంట్, మిడ్, రియర్ ఇంజిన్ లేఅవుట్ల మధ్య తేడాలు, FWD, RWD, AWD పనితీరు, హ్యాండ్లింగ్ & క్యాబిన్ స్పేస్‌పై వాటి ప్రభావం తెలుసుకోండి.

Car Engine Layout Differences: కారులో ఇంజిన్ ఎక్కడ అమర్చారనే విషయం చిన్నదిగా అనిపించవచ్చు. కానీ దాని ప్రభావం కారు పనితీరుపై చాలా ఉంటుంది. క్యాబిన్‌లో ఎంత స్థలం ఉంటుంది? కారు ఎలా మలుపులు తిరుగుతుంది? వేగంగా వెళ్లేటప్పుడు నియంత్రణ ఎలా ఉంటుంది? వంటి అంశాలను ఇంజిన్ ప్లేస్‌మెంట్ ప్రభావితం చేస్తుంది.

ఇంజిన్‌తో పాటు దానికి సంబంధించిన ఇతర భాగాలు కూడా కారు చాసిస్‌లో ఎక్కువ బరువు కలిగిన భాగాలే. అందుకే ఇంజిన్‌ను ముందు, మధ్య లేదా వెనుక ఎక్కడ అమర్చారనే దానితో పాటు, అది ఏ దిశలో అమర్చారనే అంశం కూడా కీలకం. కార్లలో ప్రధానంగా కనిపించే ఇంజిన్ లేఅవుట్లు, వాటి ప్రయోజనాలు, పరిమితులు తెలుసుకుందాం.

 1. ఫ్రంట్ ఇంజిన్ లేఅవుట్: FWD, RWD మధ్య తేడా

కార్లలో అత్యంత సాధారణమైనది ఫ్రంట్ ఇంజిన్ లేఅవుట్. అంటే, ఇంజిన్ ముందు భాగంలో ఉంటుంది. అయితే ముందు ఇంజిన్ ఉన్న కార్లలో కూడా రెండు రకాల డ్రైవ్ లేఅవుట్లు ఉంటాయి, అవి.. ఫ్రంట్ ఇంజిన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FF లేదా FWD) & ఫ్రంట్ ఇంజిన్, రియర్ వీల్ డ్రైవ్ (FR లేదా RWD).

ఫ్రంట్ ఇంజిన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FF లేదా FWD)

ఈ విధానంలో, ఇంజిన్‌.. ఫ్రంట్ యాక్సిల్‌కు ముందు ఉంటుంది. ఇంజిన్ ఉత్పత్తి చేసే శక్తి ట్రాన్స్‌మిషన్, ఫ్రంట్ యాక్సిల్ ద్వారా ముందు చక్రాలకు చేరుతుంది. అంటే ముందు చక్రాలే కారును ముందుకు నడిపించడంతో పాటు స్టీరింగ్ బాధ్యతను కూడా నిర్వహిస్తాయి.

వెనుక చక్రాలకు శక్తిని పంపే డ్రైవ్‌షాఫ్ట్ అవసరం ఉండదు. దీంతో క్యాబిన్ ఫ్లోర్ మధ్యలో పెద్ద టన్నెల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రయాణికులకు, లగేజీకి ఎక్కువ స్థలం లభిస్తుంది. సాధారణంగా ఈ కార్లలో ఇంజిన్‌ను అడ్డంగా, అంటే ట్రాన్స్‌వర్స్‌గా అమర్చుతారు. దీనివల్ల మొత్తం సెటప్ కాంపాక్ట్‌గా ఉంటుంది.

ముందు చక్రాలపై ఇంజిన్ బరువు ఉండటం వల్ల ట్రాక్షన్‌కు కూడా సహాయపడుతుంది. అయితే ఈ లేఅవుట్‌లో కొన్ని పరిమితులు ఉన్నాయి. కారు ముందు భాగంపై ఎక్కువ బరువు ఉండటంతో వేగంగా మలుపులు తీసుకునేటప్పుడు అండర్‌స్టీర్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, పవర్‌ఫుల్‌ ఇంజిన్ ఉన్నప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా కనిపించవచ్చు.

అలాగే, ఇంజిన్ శక్తిని అందించే చక్రాలే స్టీరింగ్ కూడా చేస్తాయి. వేగంగా యాక్సిలరేట్ చేసినప్పుడు స్టీరింగ్ వీల్ ఒకవైపు లాగినట్లు అనిపించవచ్చు. దీన్నే టార్క్ స్టీర్ అంటారు.

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ వెర్నాకు భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్.. పెద్దలతో పాటు పిల్లల భద్రతలోనూ 5 స్టార్లు

ఫ్రంట్ ఇంజిన్, రియర్ వీల్ డ్రైవ్ (FR లేదా RWD)

ఈ లేఅవుట్ 20వ శతాబ్దంలో చాలాకాలం పాటు కార్లలో సంప్రదాయ విధానంగా కొనసాగింది. ఇప్పటికీ RWD కార్లు, ట్రక్కులు, పికప్ ట్రక్కులు, బస్సుల్లో ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో.. ఇంజిన్ సాధారణంగా కారు పొడవుకు సమాంతరంగా, అంటే లాంగిట్యూడినల్‌గా అమర్చుతారు. ఇంజిన్ నుంచి వచ్చే శక్తి డ్రైవ్‌షాఫ్ట్ ద్వారా వెనుక యాక్సిల్‌లోని డిఫరెన్షియల్‌కు చేరుతుంది. అక్కడి నుంచి వెనుక చక్రాలకు శక్తి అందుతుంది.

FWDతో పోలిస్తే ఈ సెటప్ కొంత ఎక్కువ బరువుగా ఉంటుంది. డ్రైవ్‌షాఫ్ట్ కోసం క్యాబిన్ మధ్యలో టన్నెల్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దీంతో లోపలి స్థలం కొంత తగ్గుతుంది. అయితే పెద్ద ఇంజిన్లను అమర్చడానికి వీలుంటుంది. ముందు, వెనుక యాక్సిళ్ల మధ్య బరువు మరింత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది.

ఇక్కడ ముందు చక్రాలు స్టీరింగ్ బాధ్యతను, వెనుక చక్రాలు కారును ముందుకు నడిపించే బాధ్యతను నిర్వహిస్తాయి. ఈ విభజన వల్ల హ్యాండ్లింగ్ మరింత సమతుల్యంగా ఉంటుంది. అందుకే డ్రైవింగ్‌ను ఇష్టపడేవారు, ఆటోమొబైల్ ఔత్సాహికులు FR లేఅవుట్‌ను ఎక్కువగా ఇష్టపడతారు.

 2. మిడ్ ఇంజిన్ లేఅవుట్: బరువు సమతుల్యతకు ప్రాధాన్యం

మిడ్ ఇంజిన్ కార్లలో ఇంజిన్.. ముందు, వెనుక యాక్సిళ్ల మధ్యభాగంలో ఉంటుంది. సాధారణంగా సూపర్‌కార్ల గురించి మాట్లాడేటప్పుడు ఈ లేఅవుట్ గుర్తుకు వస్తుంది. Lamborghini Temerario వంటి కార్లలో ఇంజిన్.. ప్రయాణికులు కూర్చునే భాగానికి వెనుక వైపున, రియర్ యాక్సిల్‌కు ముందు ఉంటుంది. దీన్ని రియర్ మిడ్ ఇంజిన్ లేఅవుట్ అంటారు.

మరికొన్ని కార్లలో ఇంజిన్.. ముందు యాక్సిల్‌కు వెనుక, ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు ముందు ఉంటుంది. Aston Martin DB12 ఇందుకు ఉదాహరణ. దీన్ని ఫ్రంట్ మిడ్ ఇంజిన్ లేఅవుట్ అంటారు.

ఈ రెండు విధానాల ప్రధాన లక్ష్యం బరువును కారు మధ్య భాగానికి దగ్గరగా ఉంచడం. దీనివల్ల ముందు, వెనుక టైర్ల మధ్య బరువు మెరుగ్గా పంపిణీ అవుతుంది. రెండు వైపులా ట్రాక్షన్ సమంగా ఉండేలా ఇది సహాయపడుతుంది.

అయితే మధ్యభాగంలో ఇంజిన్ ఉండటం వల్ల క్యాబిన్ స్థలం తగ్గుతుంది. అంతేకాకుండా ఇంజిన్‌కు సర్వీస్ చేయడం కూడా కొంత కష్టంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!

 3. రియర్ ఇంజిన్ లేఅవుట్: వెనుక చక్రాలపై ఎక్కువ బరువు

ఈ విధానంలో, ఇంజిన్.. వెనుక యాక్సిల్‌కు వెనుక భాగంలో ఉంటుంది. సాధారణంగా ఇలాంటి కార్లలో వెనుక చక్రాలకే శక్తి అందుతుంది. అయితే Porsche 911 Turbo వంటి కొన్ని మోడళ్లలో AWD సిస్టమ్ కూడా ఉంటుంది. Volkswagen Beetle, Porsche 356, Porsche 911 వంటి ప్రసిద్ధ కార్లు రియర్ ఇంజిన్ లేఅవుట్‌కు ఉదాహరణలు. 

ఈ లేఅవుట్‌లో ట్రాన్స్‌మిషన్ కోసం క్యాబిన్ మధ్యలో పెద్ద టన్నెల్ అవసరం ఉండదు. దీంతో ఫ్లోర్‌ను ఫ్లాట్‌గా రూపొందించవచ్చు. ఇంజిన్ బరువు వెనుక చక్రాలపై ఉండటం వల్ల వాటికి మంచి ట్రాక్షన్ లభిస్తుంది. మట్టి రోడ్లు, మంచు నిండిన రోడ్లపై ఇది ఉపయోగపడుతుంది.

అయితే హ్యాండ్లింగ్ విషయంలో కొన్ని సవాళ్లు ఉంటాయి. వెనుక చక్రాలపై ఎక్కువ బరువు ఉండటంతో ఓవర్‌స్టీర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఓవర్‌స్టీర్ అకస్మాత్తుగా రావచ్చు. దీంతో కారు నియంత్రణ కోల్పోయి స్పిన్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

ఇది కూడా చదవండి: పొల్యూషన్‌ సర్టిఫికెట్ రూల్స్‌లో కీలక మార్పులు.. కొత్త BS6 వాహనాలకు మూడేళ్లకోసారి PUC సర్టిఫికెట్

 4. ట్రాన్స్‌వర్స్, లాంగిట్యూడినల్ ఇంజిన్ అంటే ఏమిటి?

ఇంజిన్ ఎక్కడ ఉందన్నదే కాకుండా, అది ఏ దిశలో అమర్చారన్నది కూడా ముఖ్యమే.

ట్రాన్స్‌వర్స్ ఇంజిన్: ఇంజిన్ క్రాంక్‌షాఫ్ట్ కారు వెడల్పు దిశలో ఉంటుంది. అంటే ఇంజిన్‌ను అడ్డంగా అమర్చినట్లు ఉంటుంది. ఆధునిక కార్లలో ఈ విధానం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా FWD కార్లలో ట్రాన్స్‌మిషన్, డిఫరెన్షియల్, యాక్సిల్‌ను ఒకే కాంపాక్ట్ యూనిట్‌గా ఏర్పాటు చేయడం సులభం.

దీనివల్ల క్యాబిన్ స్థలం పెరుగుతుంది, తయారీ ఖర్చు తగ్గుతుంది. అయితే, పెద్ద ఇంజిన్లను అమర్చడంలో ఇబ్బందులు ఉంటాయి. FWD కార్లలో టార్క్ స్టీర్ సమస్య కూడా తలెత్తవచ్చు.

లాంగిట్యూడినల్ ఇంజిన్: ఇందులో క్రాంక్‌షాఫ్ట్ కారు పొడవు దిశలో ఉంటుంది. ఈ విధానం పెద్ద డిస్‌ప్లేస్‌మెంట్ ఇంజిన్లకు అనుకూలంగా ఉంటుంది. ముందు, వెనుక చక్రాల మధ్య బరువును సమంగా పంపిణీ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.

ఈ సెటప్ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. క్యాబిన్‌లోకి కూడా కొంత భాగం చొచ్చుకొచ్చే అవకాశం ఉంటుంది. 8 కంటే ఎక్కువ సిలిండర్లు ఉన్న ఇంజిన్లను సాధారణంగా లాంగిట్యూడినల్‌గా అమర్చుతారు. మిడ్ ఇంజిన్, రియర్ ఇంజిన్ కార్లలోనూ సాధారణంగా లాంగిట్యూడినల్ సెటప్ కనిపిస్తుంది. 

మొత్తంగా చూస్తే.. కారు ఇంజిన్ ప్లేస్‌మెంట్ అనేది కేవలం డిజైన్‌కు సంబంధించిన విషయం కాదు. అది కారు బరువు పంపిణీ, హ్యాండ్లింగ్, ట్రాక్షన్, క్యాబిన్ స్థలం, డ్రైవింగ్ అనుభవాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే సాధారణ ప్రయాణానికి ఉపయోగించే కార్లలో FWD ఎక్కువగా కనిపిస్తే... స్పోర్ట్స్ కార్లు, సూపర్‌కార్లలో RWD, మిడ్ ఇంజిన్, రియర్ ఇంజిన్ వంటి విభిన్న లేఅవుట్లను ఉపయోగిస్తారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Car Tyre Pressure: కారు టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ చిన్న తప్పు వల్ల మైలేజీ తగ్గడమే కాదు, ప్రమాదం పెరుగుతుంది!
టైర్ ప్రెజర్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా? మైలేజీ, బ్రేకింగ్, టైర్ లైఫ్‌ మీద ఎంత ప్రభావమో తెలుసా?
Moto Guzzi The Trip: 457cc ఇంజిన్‌, 47.6hp పవర్‌తో కొత్త రెట్రో రెట్రో రోడ్‌స్టర్.. ఫీచర్లు, కలర్ ఆప్షన్లు
బైక్‌ పేరు Moto Guzzi The Trip.. 457cc ఇంజిన్‌తో వస్తున్న కొత్త ఇటలీ మోటార్‌సైకిల్‌
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
Pollution Certificate Rules: పొల్యూషన్‌ సర్టిఫికెట్ రూల్స్‌లో కీలక మార్పులు.. కొత్త BS6 వాహనాలకు మూడేళ్లకోసారి PUC సర్టిఫికెట్
వెహికల్‌ ఓనర్లకు భారీ ఊరట.. ఇక ఏటా కాదు, మూడేళ్లకు ఒకసారి పొల్యూషన్‌ సర్టిఫికెట్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget