అన్వేషించండి

లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు

బెంగళూరుకు చెందిన E3 Electric.AI ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.1 లక్ష ప్రారంభ ధరతో లాంచ్‌ చేసింది. మూడు వేరియంట్లు, 165 కి.మీ. రేంజ్, AI ఫీచర్లతో ఇది ఆకట్టుకుంటోంది.

E3 Trion electric scooter Price, Range And Features Telugu: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నవాళ్లకు మరో కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ ఈ3 ఎలక్ట్రిక్.ఏఐ ‍(E3 Electric.AI),‌ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ట్రయాన్ పేరుతో ఈ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర లక్ష రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.

E3 Electric.AI.. ట్రయాన్‌ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది, అవి - C1, C1x, C2. AI ఆధారిత ఫీచర్లు, మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌ను ఈ స్కూటర్‌లో ప్రధాన ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది.

బ్యాటరీ, రేంజ్ ఎలా ఉన్నాయి?

E3 Trion C1లో.. రిమూవబుల్‌ 2.3kWh LFP బ్యాటరీని ఇచ్చారు. C1x & C2 వేరియంట్లలో 3kWh LFP బ్యాటరీలు ఉన్నాయి, ఇవి మాత్రం నాన్‌-రిమూవబుల్‌.

మూడు వేరియంట్లలోనూ PMSM హబ్ మోటార్‌ను ఉపయోగించారు. అయితే మోటార్ శక్తికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

C1x వేరియంట్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే, IDC ప్రకారం, 165 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. C1 రేంజ్ వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

టాప్ వేరియంట్ C2 గరిష్టంగా గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 6 సెకన్లలో అందుకుంటుంది.

C1 & C1x వేరియంట్లలో ఎకో & పవర్ రైడింగ్ మోడ్స్‌ ఉన్నాయి. C2లో స్పోర్ట్ మోడ్ కూడా లభిస్తుంది.

ఇది కూడా చదవండి: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!

14 అంగుళాల చక్రాలు

ట్రయాన్‌లో 14 అంగుళాల చక్రాలను ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఇవి పెద్ద చక్రాలు.

స్టోరేజ్ విషయంలో కూడా స్కూటర్ ఆకట్టుకుంటుంది. సీటు కింద ఉండే స్థలం, ఫ్లోర్‌బోర్డ్ & గ్లోవ్‌బాక్స్‌ను కలిపి 52 లీటర్ల వరకు స్టోరేజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే సీటు కింద మాత్రమే ఎంత స్టోరేజ్ ఉంటుందో వెల్లడించలేదు.

AI ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణ

ఈ3 ట్రయాన్‌ను భారతదేశపు తొలి AI ఆధారిత ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కంపెనీ అభివర్ణిస్తోంది. ఇందులో ఈ3 కమాండ్‌ సెంటర్ అనే వ్యవస్థ ఉంది. ఇది స్కూటర్ నుంచి వచ్చే డేటా & క్లౌడ్ డేటాను ఉపయోగించి వాహన పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. అవసరమైనప్పుడు ముందస్తుగానే సమస్యలు గుర్తిస్తుంది, హెచ్చరికలు పంపుతుంది & సర్వీస్ అలర్ట్‌లు కూడా అందిస్తుంది.

ట్రయాన్‌ స్కూటర్‌లో 5 అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. కంపెనీ ట్రిప్‌సెన్స్ వ్యవస్థ ద్వారా కనెక్టెడ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో రైడర్ స్మార్ట్‌ఫోన్‌ను అదనపు డిస్‌ప్లేగా ఉపయోగించుకోవచ్చు.

నావిగేషన్, ట్రిప్ ప్లానర్, ఛార్జింగ్ కేంద్రాల వివరాలు, రిమోట్ బ్యాటరీ మానిటరింగ్, వాహన నియంత్రణ, జియోఫెన్సింగ్ & ఎస్‌ఓఎస్ సహాయం వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యాష్‌క్యామ్ కూడా అందుబాటులో ఉంది.

AI హెల్త్‌స్కాన్ అనే ఫీచర్ కేవలం 10 సెకన్లలో వాహన డయాగ్నస్టిక్స్ చేయగలదని కంపెనీ చెబుతోంది.

ఇది కూడా చదవండి: రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత

బ్యాటరీ కోసం ప్రత్యేక AI వ్యవస్థ

బ్యాటరీ వ్యవస్థలో AI డిజిటల్ ట్విన్ అనే సాంకేతికతను ఉపయోగించారు. ఇది బ్యాటరీ పరిస్థితిని రియల్‌టైమ్‌లో పరిశీలించి ముందస్తు సమాచారం అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. రెండు బ్యాటరీలలోనూ LFP కెమిస్ట్రీని ఉపయోగించారు.

ఇతర ఫీచర్లు - డ్యూయల్ ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లు ఉన్నాయి. ఐపీ67 స్థాయి వాటర్ & డస్ట్ ప్రొటెక్షన్ కూడా ఉంది.

ధర ఎంత?

E3 Trion C1 ధరను రూ.99,999గా నిర్ణయించారు. Trion C1x ధరను రూ.1.10 లక్షలు. టాప్ వేరియంట్ Trion C2 ధర రూ.1.20 లక్షలు. ఇవన్నీ బెంగళూరు ఎక్స్-షోరూమ్ ధరలు.

రంగులు

ఈ స్కూటర్‌ను సోలార్ రెడ్, మిస్టీ గ్రీన్, గ్రాఫైట్ గ్రే, నోవా బ్లూ, టీల బ్లూ & లూనా వైట్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

బ్యాక్‌రెస్ట్, హెల్మెట్, ఫోన్ హోల్డర్ & పిలియన్ ఫుట్‌రెస్ట్ వంటి యాక్సెసరీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం బెంగళూరులో ప్రి-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. త్వరలో ఇతర మార్కెట్లకు కూడా తీసుకెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎనిమిదేళ్లు లేదా 1 లక్ష కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా E3 కంపెనీ అందిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget