అన్వేషించండి

టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!

టాటా నెక్సాన్ కామో ఎడిషన్ రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది. ప్రత్యేక రంగులు, కామో డిజైన్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.

Tata Nexon Camo Edition Price And Features Telugu: కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా? టాటా కంపెనీ.. నెక్సాన్‌లో "కామో ఎడిషన్‌"ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక ఎడిషన్ ప్రారంభ ధర రూ.9.99 లక్షలు ‍(ఎక్స్-షోరూమ్), ఇది పరిమిత కాల ఆఫర్‌.

సాధారణ నెక్సాన్‌తో పోలిస్తే కామో ఎడిషన్‌లో కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. కొత్త రంగులు, ప్రత్యేక డిజైన్ అంశాలు, పెద్ద టచ్‌స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌క్యామ్ కొత్త ఎడిషన్‌లో ఉన్నాయి. నెక్సాన్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్ & సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లు కూడా 'కామో'లో కొనసాగుతాయి.

ధర ఎంత?
టాటా నెక్సాన్ కామో ఎడిషన్ ధర రూ.9.99 లక్షల నుంచి రూ.13.94 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. పవర్‌ట్రెయిన్‌ను బట్టి Creative, Creative+S, Creative+PS, Fearless+PS & Fearless+ A PS వేరియంట్లలో ఈ ప్రత్యేక ఎడిషన్ అందుబాటులో ఉంది.

కొత్త రంగులు
కామో ఎడిషన్‌లో రెండు ప్రత్యేక ఎక్స్‌టీరియర్ రంగులను పరిచయం చేశారు. మున్నార్ మిస్ట్ & కూర్గ్ క్లౌడ్ పేర్లతో ఈ రంగులు అందుబాటులో ఉంటాయి. ముందు ఫెండర్లపై కామో బ్యాడ్జింగ్ ఉంటుంది. ముందు సీట్ల హెడ్‌రెస్ట్‌లపై ‘కామో’ డిజైన్‌తో ప్రత్యేక పెర్ఫొరేషన్ కూడా ఇచ్చారు.

ఇది కూడా చదవండి: మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్

పెద్ద టచ్‌స్క్రీన్
కామో ఎడిషన్‌లో చేసిన ప్రధాన మార్పుల్లో కొత్త టచ్‌స్క్రీన్ ఒకటి. ఇందులో 12.3 అంగుళాల హర్మన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. సాధారణ నెక్సాన్‌లో సంబంధిత వేరియంట్లకు ఉన్న 10.25 అంగుళాల యూనిట్ స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. అయితే, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మాత్రం కొనసాగుతుంది. మరో ముఖ్యమైన ఫీచర్‌గా ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌క్యామ్‌ను ఇచ్చారు. ఇది 360 డిగ్రీ కెమెరా వ్యవస్థతో కలిసి పనిచేస్తుంది.

ఫీచర్లు అదుర్స్
కామో ఎడిషన్‌లో ఇప్పటికే ఉన్న చాలా ప్రీమియం ఫీచర్లు కూడా కొనసాగుతాయి. పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, జేబీఎల్ 9 స్పీకర్ ఆడియో సిస్టమ్ ఇందులో ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ కూడా లభిస్తుంది. వైర్‌లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి ADAS ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

ఇది కూడా చదవండి: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!

ఇంజిన్‌లో మార్పులు లేవు
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌ ఇంజిన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ & 1.2 లీటర్ టర్బో పెట్రోల్ సీఎన్‌జీ ఇంజిన్లు కొనసాగుతాయి.

పెట్రోల్ ఇంజిన్ 120 హెచ్‌పీ శక్తి & 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 115 హెచ్‌పీ శక్తి & 260 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. సీఎన్‌జీ వెర్షన్ 100 హెచ్‌పీ శక్తి & 170 ఎన్ఎం టార్క్‌ ఇస్తుంది.

గేర్‌బాక్స్ విషయానికి వస్తే.. ఇంజిన్ & వేరియంట్‌ను బట్టి 6 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ & 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ కామో ఎడిషన్.. Maruti Brezza, Hyundai Venue, Kia Sonet, Mahindra XUV 3XO, Skoda Kylaq & Kia Syros వంటి మోడళ్లకు పోటీ ఇస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. 204cc ఇంజిన్‌, 26.5hp పవర్‌.. Yamaha R2 రేటెంతో తెలుసా?
సూపర్‌స్పోర్ట్‌ బైక్‌ Yamaha R2 మార్కెట్‌లోకి వచ్చేసింది - 204cc ఇంజిన్‌తో రచ్చ రచ్చ
యమహా R15 V4 బైక్ లోన్ ఆఫర్లు: ఎంత డౌన్‌పేమెంట్ కడితే నెలకు ఎంత EMI పడుతుంది? పూర్తి క్యాలిక్యులేషన్‌!
Yamaha R15 V4 EMI Plan: కేవలం రూ.3,189 EMI & తక్కువ డౌన్‌పేమెంట్.. వివరాలు ఇవిగో!
TATA Cars: టాటా మోటార్స్, TATA.CARSగా మారనుందా? పూర్తి వివరాలు ఇవే!
టాటా మోటార్స్, TATA.CARSగా మారనుందా? పూర్తి వివరాలు ఇవే!
పాత కారు అమ్మి కొత్తది కొనాలా? లేక, పాత కారును కొత్త కారుతో ఎక్సేంజ్‌ చేయాలా? స్పిన్నీలో చాలా ఆప్షన్లు
సెకండ్‌హ్యాండ్‌ కారు అమ్మేవాళ్లకు, కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌.. స్పిన్నీలో మరిన్ని ఆప్షన్లు!
Advertisement

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bopparaju Venkateswarlu: ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
Nikitha Godishala Murder Case: అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
NTA New Director: NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
PM Modi Rakhi Celebrations: పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
Petrol, LPG Price Hike:పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయి! భారీగా పెరిగిన చమురు దిగుమతి ఖర్చు!
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయి! భారీగా పెరిగిన చమురు దిగుమతి ఖర్చు!
Nepal Earth Quake: నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
Praggnanandhaa Record: ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 
ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 
NCLT: ఎన్‌సిఎల్‌టి అంటే ఏమిటి? సుభాష్ చంద్రకు చెందిన రూ. 22,000 కోట్ల అప్పు వివాదాన్ని ఎలా పరిష్కరించింది?
ఎన్‌సిఎల్‌టి అంటే ఏమిటి? సుభాష్ చంద్రకు చెందిన రూ. 22,000 కోట్ల అప్పు వివాదాన్ని ఎలా పరిష్కరించింది?
Embed widget