అన్వేషించండి

రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత

KTM 390 అడ్వెంచర్ ఇప్పుడు నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్‌, X, R & S వేరియంట్ల ధరలు, ఇంజిన్‌, ఫీచర్లు, సస్పెన్షన్‌, వీల్స్ మధ్య ఉన్న తేడాలను తెలుసుకోండి.

KTM 390 Adventure price and variants: అడ్వెంచర్ బైక్ కొనాలని ఉవ్విళ్లూరే యూత్‌ కోసం KTM ఇప్పుడు మరిన్ని ఆప్షన్లు అందిస్తోంది. ఇటీవల 350cc ఇంజిన్‌తో కొత్త KTM 390 అడ్వెంచర్‌ను లాంచ్‌ చేయడంతో, ప్రస్తుతం మన మార్కెట్లో మొత్తం నాలుగు 390 అడ్వెంచర్ వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. స్టాండర్డ్‌, X, R & S పేర్లతో అందుబాటులో ఉన్న ఈ మోడళ్ల మధ్య ధరలతో పాటు ఫీచర్లు, ఇంజిన్‌, సస్పెన్షన్‌, వీల్స్‌లో కూడా తేడాలు ఉన్నాయి. దీంతో ఏ వేరియంట్ ఎంచుకోవాలనే విషయంలో చాలా మందికి సందిగ్ధత ఏర్పడుతోంది.

ఈ నాలుగు మోడళ్లలో బాడీ డిజైన్‌, ప్రధాన ఫ్రేమ్‌, సబ్‌ఫ్రేమ్‌, స్టైలింగ్ దాదాపు ఒకేలా ఉంటాయి. రంగులు & గ్రాఫిక్స్ మాత్రమే మారతాయి. అయితే ఇంజిన్‌, సస్పెన్షన్‌, వీల్స్ & రైడింగ్ సామర్థ్యం పరంగా ఒక్కో వేరియంట్ ప్రత్యేకతను కలిగి ఉంది.

స్టాండర్డ్ వేరియంట్
ఎంట్రీ లెవల్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.2.87 లక్షలు (ఎక్స్ షోరూమ్‌). ఈ మోడల్‌లో 349cc ఇంజిన్‌ను అందించారు. ఇది గరిష్ఠంగా 41.5hp పవర్‌, 33.5Nm టార్క్‌ను ఇస్తుంది. ముందు భాగంలో 200 mm & వెనుక భాగంలో 205 mm సస్పెన్షన్ ట్రావెల్ లభిస్తుంది. వెనుక సస్పెన్షన్‌లో మాత్రమే ప్రీలోడ్ అడ్జస్ట్ చేసే అవకాశం ఉంటుంది. 19 అంగుళాల ముందు అల్లాయ్ వీల్‌, 17 అంగుళాల వెనుక అల్లాయ్ వీల్‌, TFT డిస్‌ప్లే & ఆధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ మోడల్‌పై 18 శాతం GST మాత్రమే వర్తించడంతో దీని ధర ఇతర వేరియంట్ల కంటే తక్కువగా ఉంది.

ఇది కూడా చదవండి: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి

KTM 390 అడ్వెంచర్ X
KTM 390 అడ్వెంచర్ X ధర రూ.3.50 లక్షలు. ఇందులో పూర్తి స్థాయి 398cc ఇంజిన్‌ను అందించారు. ఇది 46hp పవర్‌, 39Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే డిజైన్‌, చాసిస్‌, ఫీచర్లు దాదాపు ఒకేలా ఉంటాయి. పెయింట్ స్కీమ్‌లో మాత్రమే స్వల్ప మార్పులు ఉన్నాయి. అయితే స్టాండర్డ్ వేరియంట్ కంటే రూ.63 వేలు ఎక్కువ ధర ఉండటం గమనార్హం.

KTM 390 అడ్వెంచర్ R
ఆఫ్ రోడ్ ప్రయాణాలను ఎక్కువగా ఇష్టపడేవాళ్ల కోసం KTM 390 అడ్వెంచర్ R వచ్చింది. దీని ధర రూ.3.86 లక్షలు. ముందు & వెనుక భాగంలో 230 mm లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్‌ అందించారు. దీంతో రఫ్ రోడ్లపై కూడా మెరుగైన పనితీరు లభిస్తుంది. 880 mm సీట్ ఎత్తు & 272 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఇది అత్యంత ఎత్తైన వేరియంట్‌గా నిలుస్తుంది. 21 అంగుళాల ముందు & 18 అంగుళాల వెనుక ట్యూబ్డ్ వైర్ స్పోక్ వీల్స్‌తో పాటు Mitas డ్యూయల్ పర్పస్ టైర్లను ఈ వేరియంట్‌లో అమర్చారు. X వేరియంట్‌ కంటే దీని ధర రూ.36 వేలు ఎక్కువ.

ఇది కూడా చదవండి: రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు

KTM 390 అడ్వెంచర్ S
టాప్ ఎండ్ KTM 390 అడ్వెంచర్ S ధర రూ.4.05 లక్షలు. ఇటీవల ధర పెరగడంతో ఈ మోడల్ రూ.4 లక్షల మార్క్‌ను దాటింది. గతంలో దీని ధర రూ.3.97 లక్షలు ఉండేది. ఇందులో అడ్జస్టబుల్ సస్పెన్షన్‌ అందించారు. ముందు భాగంలో 200 mm & వెనుక భాగంలో 205 mm సస్పెన్షన్ ట్రావెల్ ఉంటుంది. 21 అంగుళాల ముందు & 17 అంగుళాల వెనుక వైర్ స్పోక్ వీల్స్ ఉన్నప్పటికీ, వీటిలో ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగించే అవకాశం ఉంది. 830 mm సీట్ ఎత్తు & 237 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో తారు & సీసీ రోడ్లపై ప్రయాణానికి అనువుగా ఉంటుంది.

ఆఫ్ రోడ్ ప్రయాణాలే ప్రధాన అవసరమైతే R వేరియంట్ సరైన ఎంపిక కావచ్చు. సిటీలో తిరగడం & హైవే ప్రయాణాలకు S మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో అడ్వెంచర్ బైక్ కావాలనుకునేవాళ్లు స్టాండర్డ్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. పూర్తి 398cc ఇంజిన్ ఉండి, అదనపు ఆఫ్ రోడ్ ఫీచర్లు అవసరం లేనివాళ్లకు X వేరియంట్ సరిపోతుంది. ఇలా.. ఒక్కో వేరియంట్‌ను ఒక్కో రకం రైడర్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని KTM రూపొందించింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Embed widget