TVS స్కూటర్ల ధరలు పెంపు.. పాపులర్ మోడళ్ల రేట్లు ఏకంగా రూ.11,000 వరకు హైక్, ఇదిగో లిస్ట్
TVS, తన పాపులర్ స్కూటర్ల ధరలను పెంచింది. iQube, Orbiter, Jupiter 110, Jupiter 125 & Ntorq 125 మోడళ్ల ధరలు రూ.11,000 వరకు పెరిగాయి. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందో తెలుసుకోండి.

TVS Scooters New Rates 2026: TVS మోటార్ కంపెనీ, తన పాపులర్ స్కూటర్ల ధరలను మరోసారి పెంచింది. గత కొన్ని నెలలుగా విడతల వారీగా రేట్లు పెంచుతూ వచ్చిన ఈ టూవీలర్ కంపెనీ, మళ్లీ కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈసారి.. ఎలక్ట్రిక్ స్కూటర్లైన iQube & Orbiter మోడళ్లపై అత్యధిక ప్రభావం కనిపించింది. పెట్రోల్ స్కూటర్లలో Jupiter 110, Jupiter 125 & Ntorq 125 మోడళ్ల ధరలు కూడా పెరిగాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో, iQube సిరీస్‌లోని దాదాపు అన్ని వేరియంట్ల ధరలు మారాయి. ముఖ్యంగా 3.5kWh బ్యాటరీ వేరియంట్ రేటు రూ.9,000 పెరిగింది. అయితే 3.1kWh వేరియంట్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
Orbiter సిరీస్‌లోనే ధరల పెంపు మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా Orbiter V1 ధర ఏకంగా రూ.11,000 వరకు పెరిగింది. ప్రస్తుతం TVS స్కూటర్ సిరీస్‌లో ఇదే అత్యధిక ధరల పెంపు.
అయితే ఈ ధరల పెంపును ఒకేసారి చేసిన పెంపుగా భావించకూడదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని నెలలుగా విడతల వారీగా చేసిన ధరల సవరణలన్నీ ఇప్పుడు అమల్లో ఉన్న ధరల్లో ప్రతిబింబిస్తున్నాయని చెబుతున్నాయి.
| మోడల్ | పాత ధర | కొత్త ధర | వ్యత్యాసం |
| Jupiter 110 | రూ. 73,400-రూ. 86,900 | రూ. 73,975-రూ. 88,850 | రూ. 575-రూ. 1,950 |
| Jupiter 125 | రూ. 78,700-రూ. 89,060 | రూ. 81,110-రూ. 89,935 | రూ. 875-రూ. 2,410 |
| Ntorq 125 Disc | రూ. 82,500 | రూ. 83,350 | రూ. 850 |
| Ntorq 125 Race Edition | రూ. 87,950 | రూ. 88,800 | రూ. 850 |
| iQube 2.2kWh | రూ. 1.11 lakh | రూ. 1.16 lakh | రూ. 5,000 |
| iQube 3.1kWh | రూ. 1.33 lakh | రూ. 1.33 lakh | No change |
| iQube 3.5kWh | రూ. 1.33 lakh | రూ. 1.42 lakh | రూ. 9,000 |
| iQube S 4.7kWh | రూ. 1.55 lakh | రూ. 1.61 lakh | రూ. 6,000 |
| iQube ST 5.3kWh | రూ. 1.72 lakh | రూ. 1.75 lakh | రూ. 3,000 |
| Orbiter V1 | రూ. 88,250 | రూ. 99,250 | రూ. 11,000 |
| Orbiter V2 | రూ. 1.05 lakh | రూ. 1.14 lakh | రూ. 9,000 |
ఏప్రిల్ నెలలో Orbiter V1 ధర రూ.88,250గా ఉండేది. Orbiter V2 ధర రూ.1.05 లక్షలుగా ఉండేది. అదే సమయంలో iQube 2.2kWh బేస్ వేరియంట్ ధర రూ.1.11 లక్షలుగా ఉండగా, టాప్ వేరియంట్ iQube ST ధర రూ.1.72 లక్షలుగా ఉండేది. ప్రస్తుతం వాటి ధరలు అంతకంటే ఎక్కువగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: కొత్త ఎలక్ట్రిక్ కారు కొనబోతున్నారా? Tata EVల్లో చాలా మోడళ్లపై కచ్చితమైన బెనిఫిట్స్!, ఈ నెల మాత్రమే
పెట్రోల్ స్కూటర్లలో కూడా ధరలు పెరిగాయి. యువత బాగా ఇష్టపడే Ntorq 125 Disc రేటు రూ.850 పెరిగింది. గత నెల కొత్త రంగులతో విడుదల చేసినప్పుడు ఈ స్కూటర్ ధర రూ.82,500గా ఉండేది. ఇప్పుడు అది రూ.83,350కు చేరింది.
Ntorq 125 Race Edition ధర కూడా రూ.850 పెరిగింది. ప్రస్తుతం ఈ వేరియంట్ ధర రూ.88,800గా ఉంది.
కుటుంబ వినియోగదారుల్లో మంచి ఆదరణ పొందిన Jupiter 110 సిరీస్‌లోని అన్ని వేరియంట్లపై ధరల వాత కనిపించింది. వేరియంట్‌ను బట్టి రూ.575 నుంచి రూ.1,950 వరకు పెంచారు. ప్రస్తుతం Jupiter 110 ధరలు రూ.73,975 నుంచి రూ.88,850 వరకు ఉన్నాయి.
Jupiter 125 సిరీస్‌లోనూ ఎక్కువ పెంపు కనిపించింది. కొన్ని వేరియంట్లపై రూ.2,410 వరకు ధర పెరిగింది. ప్రస్తుతం ఈ స్కూటర్ ధర రూ.81,110 నుంచి ప్రారంభమై రూ.89,935 వరకు ఉంది.
ఇది కూడా చదవండి: Tata Curvv EVలో ప్లస్ పాయింట్లతో పాటు కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి! కొనే ముందు ఓసారి ఆలోచించండి
ధరలు పెరిగినా TVS స్కూటర్లకు మార్కెట్‌లో డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో iQube మంచి అమ్మకాలు నమోదు చేస్తోంది. మరోవైపు Jupiter కుటుంబ వినియోగదారులకు, Ntorq యువతకు ఇప్పటికీ ఇష్టమైన ఎంపికలుగా ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. పైగా ఇందులో PM E Drive సబ్సిడీని పరిగణనలోకి తీసుకోలేదు. కాబట్టి, రాష్ట్రాన్ని బట్టి ఆన్‌రోడ్ ధరలు మారే అవకాశం ఉంది. అలాగే రిజిస్ట్రేషన్, బీమా, ఇతర ఛార్జీల కారణంగా తుది ధరలో కూడా తేడా ఉండొచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















