అన్వేషించండి

Tata Curvv EVలో ప్లస్‌ పాయింట్లతో పాటు కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి! కొనే ముందు ఓసారి ఆలోచించండి

Tata Curvv EV కొనాలనుకుంటున్నారా? దీని బలాలు, బలహీనతలు ఏమిటి? పనితీరు, రేంజ్, ఫీచర్లు, సౌకర్యం & లోపాలపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

Tata Curvv EV Pros & Cons: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి ప్రత్యేకమైన డిజైన్‌తో అడుగుపెట్టిన మోడళ్లలో టాటా కర్వ్‌ EV ఒకటి. కూపే SUV స్టైల్‌తో వచ్చిన ఈ కారు.. పెద్ద బ్యాటరీ, ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. అయితే ప్రతి వాహనానికి ఉన్నట్లే దీనికీ కొన్ని బలాలు, కొన్ని బలహీనతలు ఉన్నాయి. Tata Curvv EV కొనేముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే.

కొనడానికి కారణాలు

మొదటి కారణం.. పనితీరు & రేంజ్. టాటా కర్వ్‌ EVలో 55kWh భారీ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. FWD ఎలక్ట్రిక్ మోటార్ 167 హెచ్‌పీ శక్తిని & 215Nm టార్క్‌ను ఇస్తుంది. ఇందులో Eco, City & Sport అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. Sport మోడ్‌లో పూర్తి టార్క్ అందుబాటులో ఉండటంతో వేగంగా స్పందిస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ మోడ్‌లో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది. వాస్తవ పరీక్షల్లో ఇదే యాక్సిలరేషన్‌కు 9.25 సెకన్లు పట్టింది. Eco మోడ్‌లో కూడా 11.6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది. అంటే, ఈ మోడ్‌.. వేగం & సామర్థ్యం రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తుంది. నిజ జీవిత వినియోగంలో, ప్రతి kWhకు 6.64 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ లెక్క ప్రకారం, ఫుల్‌ ఛార్జ్‌తో సుమారు 365 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది.

రెండో కారణం.. ఫీచర్లు. Tata Curvv EVలో ప్రీమియం కార్లలో కనిపించే చాలా సౌకర్యాలు ఉన్నాయి. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, నావిగేషన్ సపోర్ట్ అందుబాటులో ఉన్నాయి. Arcade.ev యాప్‌ల ద్వారా వీడియో స్ట్రీమింగ్ & గేమ్స్ కూడా ఉపయోగించవచ్చు. పానోరమిక్ సన్‌రూఫ్, అంబియెంట్ లైటింగ్, జెశ్చర్ కంట్రోల్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, 9 స్పీకర్ల JBL ఆడియో సిస్టమ్, కూలింగ్ వెంట్స్‌తో వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పవర్డ్ & వెంటిలేటెడ్ ముందు సీట్లు, Level 2 ADAS వంటి ఫీచర్లు ఈ కారును హైరేంజ్‌లో చూపిస్తాయి.

ఇది కూడా చదవండి: కొత్త ఎలక్ట్రిక్‌ కారు కొనబోతున్నారా? Tata EVల్లో చాలా మోడళ్లపై కచ్చితమైన బెనిఫిట్స్‌!, ఈ నెల మాత్రమే

మూడో కారణం... ధరకు తగ్గ విలువ. Tata Curvv EV ధర రూ.16.99 లక్షల నుంచి రూ.19.49 లక్షల మధ్య ఉంటుంది. ఈ ధరలో స్టైలిష్ కూపే SUV డిజైన్, విశాలమైన క్యాబిన్, పెద్ద బ్యాటరీ, శక్తిమంతమైన మోటార్ & ఆధునిక ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. Hyundai Creta Electric, Mahindra BE 6 వంటి ప్రత్యర్థి కార్లతో పోలిస్తే, మీ డబ్బుకు మంచి విలువను అందించే మోడల్‌గా టాటా కర్వ్‌ EV నిలుస్తుంది.

కొనడానికి ఆలోచించాల్సిన కారణాలు

మొదటి కారణం.. వెనుక సీటు హెడ్‌రూమ్. కూపే SUV డిజైన్ కారణంగా వెనుక భాగంలో పైకప్పు కొంచెం దిగువకు వంగి ఉంటుంది. దీంతో ఆరు అడుగులకు పైగా ఎత్తు ఉన్న ప్రయాణికులకు తలకు సరిపడా స్థలం ఉండకపోవచ్చు. బ్యాటరీ నేల కింద ఉండటంతో మోకాళ్లు కొద్దిగా పైకి ఉండే భంగిమలో కూర్చోవాల్సి వస్తుంది. అయితే కాళ్లకు సరిపడా స్థలం మాత్రం ఉంటుంది.

ఇది కూడా చదవండి: మీ కారు పక్కనున్న వాహనాలతో మాట్లాడుతుంది.. V2V టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్!

రెండో కారణం.. క్యాబిన్ వినియోగ సౌలభ్యం. ముందు సీట్లకు ప్రత్యేక కప్ హోల్డర్లు లేకపోవడం ఒక లోపంగా చెప్పవచ్చు. కంపెనీ ఇచ్చిన కప్ హోల్డర్లు గ్లోవ్‌బాక్స్‌లో ఉండటంతో ప్రయాణ సమయంలో ఉపయోగించడం అంత సౌకర్యంగా ఉండదు. ఫోన్ ఛార్జింగ్ పోర్టులు కూడా డ్రైవ్ సెలెక్టర్ ముందు భాగంలో ఉండటంతో సులభంగా అందుకోలేము. ముందు ఆర్మ్‌రెస్ట్ కింద స్టోరేజ్‌ స్పేస్‌ కూడా చిన్నగానే ఉంటుంది. అయినప్పటికీ, క్యాబిన్ నాణ్యత & ఫినిషింగ్ మాత్రం ధరకు తగ్గట్టుగా బాగానే ఉన్నాయి.

మొత్తం చూస్తే.. Tata Curvv EV ఒక స్టైలిష్ డిజైన్, మంచి పెర్ఫార్మెన్స్‌, ఆధునిక ఫీచర్లు & ధరకు తగ్గ విలువను అందించే కారు. అయితే మీ కుటుంబంలో పొడవైన ప్రయాణికులు ఉంటే, లేదా క్యాబిన్ సౌలభ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే కొనుగోలు చేసే ముందు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget