అన్వేషించండి

జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..

Jio Market Listing: ముందస్తు అంచనాలు నిజం చేస్తూ.. జియో జాక్‌పాట్ కొట్టింది. మార్కెట్‌లో లిస్ట్ అయిన మొదటి రోజే.. దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా నిలిచింది. తొలిరోజు జియో షేర్‌ ఏకంగా 27శాతం పెరిగింది. 

Jio Share Price: 
దేశీయ స్టాక్ మార్కెట్లో జియో ప్లాట్‌ఫామ్స్ (Jio Platforms) సంచలనం సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఈ డిజిటల్ సేవల సంస్థ బుధవారం (అక్టోబర్ 28) స్టాక్ ఎక్స్ఛేంజీల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తొలిరోజే దూకుడు చూపించింది. NSE, BSE  రెండింట్లోనూ జియో షేర్‌లు భారీగా పెరగడంతో కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ 13లక్షల కోట్లకు చేరింది. రత స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత రెండో అత్యంత విలువైన కంపెనీగా జియో నిలిచింది.

 జియో షేరు తొలి రోజు ట్రెండ్ ఎలా ఉంది? Jio Market Listing

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓలో ఒక్కో షేరు ధరను రూ.1,119గా నిర్ణయించారు. అయితే, స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయినప్పుడు బీఎస్ఈ (BSE), ఎన్ఎస్ఈ (NSE) రెండింటిలోనూ రూ.1,358 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది ఐపీఓ ధర కంటే 21.36 శాతం ఎక్కువ.ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత షేరు మరింత పెరిగింది. బీఎస్ఈలో రూ.1,375 స్థాయిని తాకింది. రోజంతా కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో కొనసాగిన షేరు చివరకు రూ.1,419 వద్ద ముగిసింది.

ఐపీఓ ధర రూ.1,119తో పోలిస్తే ముగింపు ధర రూ.300 ఎక్కువ. అంటే తొలి రోజే 26.81 శాతం లాభం నమోదైంది.


రూ.13.05 లక్షల కోట్లకు చేరిన మార్కెట్ క్యాపిటలైజేషన్

జియో షేర్ల భారీ పెరుగుదలతో కంపెనీ మార్కెట్ విలువ కూడా బాగా పెరిగింది. ఐపీఓ ధర వద్ద సుమారు రూ.10.30 లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్, తొలి రోజు పెరిగిన 27శాతంతో ఏకంగా 13.05 లక్షల కోట్లకు చేరింది. అంటే ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.2.75 లక్షల కోట్లు పెరిగింది.ఈ భారీ పెరుగుదలతో  జియో ప్లాట్‌ఫామ్స్ భారత స్టాక్ మార్కెట్లో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. మొదటి స్థానం జియో పేరెంట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌దే. ఇప్పుడు 13లక్షల కోట్ల మార్కెట్ వాల్యూతో JIO...  భారతీ ఎయిర్‌టెల్‌ను అధిగమించింది.


జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..

లిస్టింగ్‌కు వచ్చిన అంబానీ ఫ్యామిలీ

జియో ఇవాళ మార్కెట్‌లో లిస్టింగ్‌కు రావడంతో ఈ కంపెనీ ప్రమోటర్లు, దేశంలోనే అతిపెద్ద బిజినెస్‌ ఫ్యామిలీల్లో ఒకటైన అంబానీ పరివారం.. మొత్తం తరలివచ్చింది. కుటుంబ సభ్యులంతా NSEకి వచ్చారు. RIL ఛైర్మన్ ముఖేష్, నీతా అంబానీ, JIO ఎండీ  ఆకాష్ అంబానీ.. డైరక్టర్లు  ఈషా అంబానీ.. అనంత్‌అంబానీ.. ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అనంత్‌ అంబానీ భావోద్వేగంగా మాట్లాడటంతో ముఖేష్ కంటతడి కూడా పెట్టుకున్నారు. 

IPO ఇన్వెస్టర్లకు ఎంత లాభం?

జియో ఐపీఓలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లకు తొలి రోజే మంచి లాభం లభించింది. ఒక్కో షేరును రూ.1,119కు కొనుగోలు చేసిన వారికి, రూ.1,419 ముగింపు ధర ప్రకారం ఒక్కో షేరుపై రూ.300 లాభం వచ్చింది. ఐపీఓలో ఒక లాట్‌లో 12 షేర్లు ఉన్నందున, ఒక లాట్ పొందిన ఇన్వెస్టర్‌కు ముగింపు ధర ఆధారంగా సుమారు రూ.3,600 లాభం వచ్చినట్లు లెక్క. జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు రూ.30,213 కోట్లు సమీకరించింది. మొత్తం 27 కోట్ల కొత్త షేర్లను ఈ ఐపీఓలో జారీ చేశారు. అక్టోబర్ 21 నుంచి 23 వరకు జరిగిన ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 22.19 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ముఖ్యంగా బలమైన డిమాండ్ కనిపించింది. ఐపీఓ ప్రారంభమైన 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ కావడం కూడా ఈ ఇష్యూ ప్రత్యేకతగా నిలిచింది.

మార్కెట్‌ డల్‌గా ఉన్నా జియో ఏమాత్రం తగ్గలేదు. బుధవారం సెన్సెక్స్ 353 పాయింట్లు తగ్గగా, నిఫ్టీ 50 కూడా నష్టాల్లో ముగిసింది. అయినప్పటికీ జియో షేరు మాత్రం  27శాతం పైకి ఎగిసింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CII Summit First Day MoUs: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. 35 ఒప్పందాల ద్వారా రూ.1.57 లక్షల కోట్ల పెట్టుబడులు.. 52,956 మందికి ఉపాధి అవకాశాలు
ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. 35 ఒప్పందాల ద్వారా రూ.1.57 లక్షల కోట్ల పెట్టుబడులు.. 52,956 మందికి ఉపాధి అవకాశాలు
Visakha CII Summit: విశాఖలో ఘనంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు.. ప్రగతి, సంప్రదాయాల సమ్మేళనంగా ఆంధ్రా వేదిక
విశాఖలో ఘనంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు.. ప్రగతి, సంప్రదాయాల సమ్మేళనంగా ఆంధ్రా వేదిక
పాత ఆభరణాలు మార్చి కొత్త బంగారం కొనడం శుభమా కాదా? బంగారం మార్పిడి నియమాలు తెలుసుకోండి!
పాత ఆభరణాలు మార్చి కొత్త బంగారం కొనడం శుభమా కాదా? బంగారం మార్పిడి నియమాలు తెలుసుకోండి!
Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget