అన్వేషించండి

రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు

Yamaha కంపెనీ R15 V4 & MT-15 MotoGP ఎడిషన్ బైక్‌లను విడుదల చేసింది. FZ-S సిరీస్‌కు కూడా కొత్త రంగులను పరిచయం చేసింది.

Yamaha MotoGP Edition launched: యమహా, తన పాపులర్‌ స్పోర్ట్స్ బైకులైన R15 V4 & MT-15 కు కొత్త MotoGP ఎడిషన్‌ను లాంచ్‌ చేసింది. యూజర్ల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక ఎడిషన్‌ను మళ్లీ తీసుకొచ్చినట్లు ఈ కంపెనీ తెలిపింది. అంతేకాదు... FZ-S Fi Hybrid & FZ-S Fi మోడళ్లకు కూడా కొత్త రంగులను పరిచయం చేసింది. అయినప్పటికీ ఈ రెండు మోడళ్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

కొత్త Yamaha R15 V4 MotoGP ఎడిషన్ ధర రూ.1.76 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. స్టాండర్డ్‌ కలర్స్‌తో అందుబాటులో ఉన్న R15 V4 కంటే ఇది రూ.3,000 వరకు ఎక్కువ. మరోవైపు, MT-15 MotoGP ఎడిషన్ ధర రూ.1.77 లక్షలుగా ఉంది. ఇది స్టాండర్డ్‌ MT-15లోని కొన్ని రంగుల వేరియంట్లతో పోలిస్తే రూ.13,000 వరకు ఎక్కువ.

ఈ రెండు బైక్‌లలో ప్రధాన ఆకర్షణ MotoGP గ్రాఫిక్స్. MotoGP రేసింగ్ బైక్ YZR-M1ను పోలి ఉండే ప్రత్యేక డిజైన్‌ను ఈ బైక్‌లపై అందించారు. గతంలో కూడా ఇదే గ్రాఫిక్స్‌తో వచ్చిన MotoGP ఎడిషన్‌కు మంచి ఆదరణ లభించడంతో మరోసారి మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

అయితే ఈ కొత్త ఎడిషన్‌లో ఇంజిన్‌ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంజిన్, పనితీరు, ఫీచర్లు అన్నీ మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉన్నాయి. కేవలం బాహ్య రూపంలో మాత్రమే మార్పులు చేశారు.

ఇది కూడా చదవండి: కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు

R15 V4 MotoGP ఎడిషన్ & MT-15 MotoGP ఎడిషన్ రెండింటిలోనూ 155cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 18.4 హెచ్‌పీ శక్తి & 14.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మంచి పనితీరు, వేగవంతమైన స్పందనతో ఈ ఇంజిన్ ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకుంది.

R15 V4 MotoGP ఎడిషన్ ధర పెరిగినా, టాప్ వేరియంట్ R15Mతో పోలిస్తే ఇప్పటికీ తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం R15M ధర దాదాపు రూ.2 లక్షలకు చేరువలో ఉంది. దీంతో MotoGP గ్రాఫిక్స్ కావాలనుకునే వారికి ఇది మరింత అందుబాటులో ఉండే ఎంపిక అవుతుంది.

ఇది కూడా చదవండి: రికార్డు సృష్టించిన TVS - వెనుకబడిన Ola.. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ 10 కంపెనీలు ఇవే!

FZ-S సిరీస్‌కు కొత్త రంగులు
ఇక FZ-S శ్రేణిలో కూడా యమహా కొత్త రంగులను తీసుకొచ్చింది. FZ-S Fi Hybridకు కొత్త Ice Storm రంగును పరిచయం చేసింది. ఇప్పటికే ఉన్న Matte Black రంగుకు కూడా కొత్త గ్రాఫిక్స్‌ను జోడించింది. FZ-S Fi మోడల్‌కు కొత్త Metallic Black రంగును అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొత్త రంగులు వచ్చినప్పటికీ FZ-S సిరీస్‌ ధరలను యమహా మార్చలేదు. FZ-S Fi Hybrid ధర రూ.1.39 లక్షలుగానే కొనసాగుతోంది. అలాగే FZ-S Fi ధర రూ.1.29 లక్షలుగానే ఉంది.

ఈ తాజా మార్పులతో, స్టైల్‌కు ప్రాధాన్యం ఇచ్చే యూజర్లను మరింత ఆకట్టుకోవాలని యమహా లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా MotoGP అభిమానులకు రేసింగ్ బైక్‌లను గుర్తు చేసే గ్రాఫిక్స్ ఈ ఎడిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget