హిందూ ధర్మంలో తొలి పూజలు అందుకునే గణేశుడి పండగ అంటేనే ఊరూరా వాడవాడలా సంబరంగా సాగుతుంది. వినాయకుడిని జ్ఞానదాతగా పూజులు చేస్తారు. గజాననుడు, లంబోదరుడు, వినాయకుడు, ఏకదంతుడు వంటి అనేక పేర్లతో ఆయనని స్మరించి కొలుస్తుంటారు. గణేశుడి రూపం ప్రత్యేకమైనది – ఏనుగు తల, పెద్ద బొజ్జ, చిన్ని ఎలుక వాహనం. ఏదైనా శుభకార్యానికి ముందు గణేశుడిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే, ఆయన విఘ్నాలను తొలగించి, కార్యసిద్ధిని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. 2025 సంవత్సరంలో గణేశ చతుర్థి పండుగ ఆగస్టు 27, బుధవారం నాడు జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి తిథిన జరుగుతుంది. చతుర్థి తిథి ఆగస్టు 26 మధ్యాహ్నం 1:54 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27 మధ్యాహ్నం 3:44 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్న గణేశ పూజ ముహూర్తం ఆగస్టు 27 ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:40 వరకు ఉంటుంది.
వినాయక మహోత్సవం 10 రోజుల పాటు కొనసాగుతుంది. అనంత చతుర్దశి రోజున సెప్టెంబర్ 6న నిమజ్జనంతో ముగుస్తుంది. పురాణాల ప్రకారం, గణేశుడు పార్వతీ దేవి సృష్టించిన బాలుడు. ఆమె స్నానం ఆచరించేందుకు ముందు నలుగుపిండితో వినాయకుడిని తయారు చేసి ప్రాణం పోసి ద్వారపాలకుడిగా ఉంచుతుంది. శివుడు లోపలికి రావడానికి ప్రయత్నించినప్పుడు గణేశుడు అడ్డుకోవడంతో యుద్ధం జరుగుతుంది. కోపోద్రిక్తుడైన శివుడు ఆ బాలుడిని శిరసను తొలగిస్తాడు. తర్వాత పార్వతీ దేవి వచ్చి అసలు విషయం చెప్పడంతో శివుడు ఏనుగు తలను అతికించి, ఆయనను తన కుమారుడిగా స్వీకరించాడు. గణేశుడు మధ్యాహ్నం జన్మించాడని పురాణాలు చెబుతాయి, కాబట్టి మధ్యాహ్న సమయం ఆయన పూజకు ఉత్తమమైనది.
గణేశుడి పూజలో మోదకాలు, ఉండ్రాళ్లు, పండ్లు, పూలు ఉంచుతారు. మోదకం గణేశుడికి ఇష్టమైనది, ఇది జ్ఞానానికి చిహ్నం. గణేశ చతుర్థి నాడు చంద్ర దర్శనం అశుభంగా భావిస్తారు. దీని వెనుక కూడా ఓ కథ ఉంది. పురాణాల ప్రకారం, చంద్రుడు గణేశుడిని అవహేళన చేయడంతో పార్వతీ దేవి శపించింది. దీని వల్ల చతుర్థి రోజు చంద్రుడిని చూడటం వల్ల నిందులు భరించాల్సి ఉంటుందని అంటారు. చతుర్థి ప్రారంభ, ముగింపు సమయాన్ని బట్టి రెండు రోజులు (ఆగస్టు 26, 27) చంద్రుణ్ని చూడకూడదని చెబుతున్నారు. అనుకోకుండా చంద్రుడిని చూసినట్లయితే, నీలాపనిందల బారిన పడకుండా ఉండాలంటే ఈ మంత్రాన్ని జపించాలి:
మహారాష్ట్ర
ముంబైలో గణేశ ఉత్సవం గొప్ప వైభవంగా జరుగుతుంది. ఈ సంప్రదాయం మరాఠా సామ్రాజ్యంలో ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజు జాతీయత, ఐక్యత ప్రోత్సహించడానికి ఈ పండుగను ప్రారంభించారు. బ్రిటిష్ కాలంలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఈ ఉత్సవాన్ని స్వాతంత్ర్య పోరాటానికి ప్రజలను ప్రేరేపించే సాధనంగా మార్చారు. ఇది మత, సాంస్కృతిక, సామాజిక ప్రాముఖ్యతను పెంచింది. ముంబైలో గణేశుడిని "లాల్బాగ్ చా రాజా" అని పిలుస్తారు. ఇక్కడ మండపాలను గ్రాండ్‌గా అలంకరిస్తారు. లాల్బాగ్ చా రాజా సంప్రదాయం 1934 నుంచి కొనసాగుతోంది. భక్తులు సంగీతం, నృత్యం, పాటలతో కార్యక్రమాలతో పండుగ జరుపుకుంటారు.
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ -తెలంగాణలో కూడా వినాయక చవితి ఘనంగా జరుపుకుంటారు. 2025లో ఈ పండుగ ఆగస్టు 27న జరుగుతున్నందున రెండు రాష్ట్రాల్లోనూ స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్, ఇతర జిల్లాల్లో స్కూళ్లకు ఆగస్టు 27న సెలవు ఇస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటూ మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలతో సమానంగా సెలవు ఉంటుంది. ఈ సంవత్సరం పండుగ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.
తెలంగాణలో హైదరాబాద్ నగరం గణేశ ఉత్సవానికి ప్రసిద్ధి. ఖైరతాబాద్ గణేశుడు ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాల్లో ఒకటి. 2025లో ఈ విగ్రహం 70 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ హితంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నారు. హుస్సేన్ సాగర్ లేక్‌లో నిమజ్జనం ఘనంగా జరుగుతుంది. భక్తులు మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, నిర్వహిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది.
సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః.
సుకుమారక మారోదీస్తవ హ్యేష స్యమంతకః.
లేదంటే గణపతి పూజ తర్వాత తలపై అక్షింతలు వేసుకుంటే దోషం ఉండదని చెబుతారు.
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో పండుగ ఘనంగా జరుగుతుంది. విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో పెద్ద మండపాలు ఏర్పాటు చేస్తారు. కృష్ణా నదిలో నిమజ్జనం ఘనంగా జరుగుతుంది. విశాఖపట్నంలో బీచ్ రోడ్లో నిమజ్జనం చేపడతారు. నిమజ్జనం రోజున గణేషుడుని సాగనంపేందుకు సాంస్కృతిక ర్యాలీలు నిర్వహిస్తారు. 2025లో ఆంధ్ర ప్రభుత్వం ఎకో-ఫ్రెండ్లీ గణేశ విగ్రహాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో గణేశ పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు ఆగస్టు 27న మూసివేస్తున్నారు.
కొందరు భక్తులు ఇంట్లోనే గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించి, 3, 5 లేదా 9 రోజులు పూజ చేస్తారు. పూజలో గణపతి అథర్వశీర్షం, వినాయక వ్రత కథ చదువుతారు. ఉండ్రాళ్లు, కుడుములు, పూర్ణం బూరెలు నివేదన చేస్తారు. ఇంట్లో పూజల కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు 2025లో రెండు రాష్ట్రాల్లో ఎకో-ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు.
ఇది మన జీవితాల్లో విఘ్నాలను తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించే మహోత్సవం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం పండుగ ఘనంగా జరిగేలా ప్రభుత్వాలు, సమాజిక సంస్థలు కృషి చేస్తున్నాయి. గణేశుడి కృపతో అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటున్నాం
वर्चुअल आरती के लिए ऊपर थाली पर क्लिक करे
హిందూ ధర్మంలో తొలి పూజలు అందుకునే గణేశుడి పండగ అంటేనే ఊరూరా వాడవాడలా సంబరంగా సాగుతుంది. వినాయకుడిని జ్ఞానదాతగా పూజులు చేస్తారు. గజాననుడు, లంబోదరుడు, వినాయకుడు, ఏకదంతుడు వంటి అనేక పేర్లతో ఆయనని స్మరించి కొలుస్తుంటారు. గణేశుడి రూపం ప్రత్యేకమైనది – ఏనుగు తల, పెద్ద బొజ్జ, చిన్ని ఎలుక వాహనం. ఏదైనా శుభకార్యానికి ముందు గణేశుడిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే, ఆయన విఘ్నాలను తొలగించి, కార్యసిద్ధిని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. 2025 సంవత్సరంలో గణేశ చతుర్థి పండుగ ఆగస్టు 27, బుధవారం నాడు జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి తిథిన జరుగుతుంది. చతుర్థి తిథి ఆగస్టు 26 మధ్యాహ్నం 1:54 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27 మధ్యాహ్నం 3:44 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్న గణేశ పూజ ముహూర్తం ఆగస్టు 27 ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:40 వరకు ఉంటుంది.
View more
గణేష్ ఉత్సవం ముహూర్తం 2025
| తేదీ | కార్యక్రమం | ముహూర్తం |
|---|---|---|
| ఆగస్టు 26, 2025, మంగళవారం | చతుర్థి తిథి ప్రారంభం | 1:54 PM |
| ఆగస్టు 27, 2025, బుధవారం | చతుర్థి తిథి ముగుస్తుంది | 3:44 PM |
| ఆగస్టు 27, 2025, బుధవారం | గణేష్ చతుర్థి పూజా సమయం | 11:05 AM to 1:40 PM |
| సెప్టెంబర్ 6, 2025, శనివారం | గణేష్ నిమజ్జనం | రోజంతా ఎప్పుడైనా |












