Adilabad Ganesh Nimajjanam: ఆదిలాబాద్‌లో గణేష్ నిమజ్జనాలకు పటిష్ట పోలీస్ బందోబస్తు.. సీసీటీవీ కెమెరాలతో, డ్రోన్ కెమెరాతో నిఘా
Ganesh nimajjanam 2025 | ఆదిలాబాద్ లో శనివారం జరగనున్న రెండు నిమజ్జన ప్రదేశాలలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 600 మంది పోలీసు సిబ్బంది, ప్రజలకు అందుబాటులో పట్టణంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.

Adilabad Ganesh Immersion 2025 | ఆదిలాబాద్ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుని నిమర్జన కార్యక్రమానికి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతో ఉంటూ పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టిందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలో 600 మంది పోలీసు సిబ్బందితో నిమర్జనోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా 350 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో 23 పికెట్స్ ఏర్పాటు
పట్టణంలో 8 క్లస్టర్లు ఎనిమిది సెక్టార్లుగా విభజించిన సిబ్బందిని అడుగడుగునా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో గణపతి ఉత్సవాలను పూర్తి చేసుకొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పట్టణంలో ముఖ్యమైన ప్రదేశాల నందు సమస్యత్మక ప్రాంతాల నందు 23 పికెట్స్ ను ఏర్పాటు చేసి శాశ్వతంగా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా సిఐ స్థాయి అధికారిని ఏర్పాటు చేసి రెండు స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేసి 15 మంది పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క దారిలో సెక్టర్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తారన్నారు. ప్రధానమైన రోడ్ల నందు రూఫ్ టాప్ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.
ఆదిలాబాద్ కేంద్రంలో 15 మంది కెమెరా సిబ్బందిలను ఏర్పాటు చేసి సమస్యల సృష్టించే వారిని వీడియోగ్రఫీ ద్వారా గుర్తించడం జరుగుతుందన్నారు, డ్రోన్ కెమెరాతో పట్టణంలోని పరిస్థితిని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ప్రత్యేకంగా రెండు బృందాల సిబ్బందిని మఫ్టీ లో ఉంచి ఆకతాయిల మరియు ప్రజలను రెచ్చగొట్టే వారి పై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా 20 మంది స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పట్టణంలో విధులను నిర్వర్తిస్తున్నారన్నారు. ప్రజలు తెలియజేసినటువంటి సూచనలు పాటించాలని తెలిపారు. నిమర్జనం ఉత్సవాలలో డీజే లకు అనుమతి లేదని, కనులకు హాని చేసే లేజర్ లైట్లకు, పేపర్ సెల్ లో యంత్రాలకు అనుమతులు లేవని తెలిపారు. ఓపిక తో ఉంటూ ప్రజలతో ప్రశాంతంగా వ్యవహరిస్తూ ముందుకు సాగించాలని సూచించారు. పట్టణంలో 15 మంది సీఐలు, నలుగురు డిఎస్పీలో,ఇద్దరు అడిషనల్ ఎస్పీ లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ పర్యవేక్షిస్తూ బందోబస్తు కొనసాగించడం జరుగుతుందన్నారు.
పోలీసులు అప్రమత్తం.. కంట్రోల్ రూములు ఏర్పాటు
చివరి గణపతి నిమర్జనం పూర్తి అయ్యేంతవరకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తతోనే వ్యవహరిస్తుందని శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సిబ్బందికి సూచనలు చేసినట్లు తెలిపారు. పట్టణంలో ప్రజలకు సమాచారం తెలిపేందుకు రెండు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి సమాచారం అందించబడుతుందన్నారు. అదేవిధంగా రెండు నిమర్జనం ప్రదేశాలు పెన్ గంగా, చాంద టి నందు మహిళా సిబ్బందితో కలిపి బందోబస్తు ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించమని సూచించారు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా రెండు వేల గణపతి విగ్రహాలను ప్రదర్శించినట్లు ఇప్పటివరకు దాదాపు జిల్లా వ్యాప్తంగా పదిహేను వందల గణపతుల నిమర్జనాలు విజయవంతంగా పూర్తి చేసుకుని, రేపటి కి 450 గణపతి విగ్రహాల నిమర్జనం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





















