IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ విషయంలో ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారేలా కనిపిస్తోంది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి పంపించేసినందుకు బంగ్లాదేశ్ కోపంతో రగిలిపోతోంది. మా ప్లేయర్లనే పంపిచేస్తారా..? అయితే మీ ఐపీఎల్‌ని మా దేశంలో ప్రసారమే కానివ్వం.. అంటూ రెచ్చిపోయి ఏకంగా బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలను నిషేధిస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ విషయంపై జనవరి 5వ తేదీన యూనస్ ప్రభుత్వంలోని సమాచార, ప్రసార శాఖ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే లిటన్ దాస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ జట్టు ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం భారత్‌కు వెళ్లదని బీసీబీ స్పష్టం చేసింది. అలాగే టోర్నీలో భారత్‌లో జరిగే బంగ్లా మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. దీనిపై బీసీసీఐ తీవ్ర వ్యతిరేకత ప్రకటించినా.. ఐసీసీ నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. ఇక ఇప్పుడు ఐపీఎల్ ప్రసారాలను కూడా నిలిపివేయడంతో ఇది బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలకు వందల కోట్ల నష్టం కలిగించబోతోంది.





















