Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
మీ పిల్లాడు 10-5 జాబ్ చేసుకుని నెలకు ఓ యాభైవేలో..లక్షో సంపాదిస్తే గొప్ప. అదే పిల్లాడు ఓ క్రికెటర్ అయ్యి తనను తను ప్రూవ్ చేసుకుని ఏడాదికి 7కోట్ల జీతం అందుకుంటే గొప్పా. ఈ 25ఏళ్లలో భారత్ క్రికెట్ ఎదిగిన తీరుకు ఉదాహరణ ఈ జీతం. ప్రస్తుతం టీమిండియా లో A+ లో ఉండే సెంట్రల్ కాంట్రాక్టు స్లాట్ ఖరీదు ఏడాదికి 7కోట్లు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రాలాంటి వాళ్లు సంపాదిస్తున్న జీతం. ఇది కాకుండా మ్యాచ్ ఫీజులంటా ఆడే ప్రతీ మ్యాచ్ కు అదనంగా డబ్బులు ఇస్తోంది బీసీసీఐ. ఒక్క టెస్ట్ ఆడితే 15 లక్షలు సంపాదించుకోవచ్చు...వన్డే మ్యాచ్ ఆరు లక్షలు, టీ20 ఆడితే మూడు లక్షలు వస్తాయి. యాడ్స్, ఎండార్స్మెంట్స్ కి కోట్ల రూపాయలు వీటికి అదనం. 1983 కపిల్ దేవ్ వాళ్లు వరల్డ్ కప్ ఆడే టైమ్ కి వాళ్లకు మ్యాచ్ ఆడితే 1500 రూపాయలు ఫీజు మాత్రమే ఇచ్చేది బీసీసీఐ. 200 రూపాయలు టీఏ డీఏలు ఇచ్చేవాళ్లు రోజుకు. అలాంటి 2000 సంవత్సరం బీసీసీఐ వెనక్కి తిరిగి చూసుకోలేనంత ఉన్నత స్థాయికి ఎదిగిపోయింది. జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శశాంక్ మనోహర్, శ్రీనివాసన్, సౌరవ్ గంగూలీ, ఇప్పుడు ఐసీసీ ఛైర్మన్ గా ఉన్న జైషా...పర్సన్స్ మారారు కానీ పాతికేళ్ల వీళ్లందరికి ఉన్న బిజినెస్ మైండ్ సెట్ ఆటను ముందుకు తీసుకెళ్తూనే కంప్లీట్ కమర్షియల్ గానూ గేమ్ ను మార్చి క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకునే వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. అబ్బాయి లేదా అమ్మాయి మంచి ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటే చాలు అనుకునే స్టేజ్ నుంచి టాలెంట్ ఉండాలే కానీ 14ఏళ్ల వయస్సుకే కోట్లు కొల్లగొడుతున్న వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్ల వరకూ పేరేంట్స్ మైండ్ సెట్ మారుతోంది. క్రికెట్ ఆడితే కడుపు నిండుతుందా అని ఒకప్పుడు తల్లితండ్రులు అన్న మాటలు ఈ పాతికేళ్ల కాలంలో పూర్తిగా చెల్లిపోయాయి. టాలెంట్ ఉండాలి టైమ్ కలిసొచ్చి ప్రూవ్ చేసుకోవాలే కానీ కోట్లు సంపాదించటానికి కావాల్సినంత పుష్కలమైన అవకాశాలు ఇప్పుడు భారత్ లో క్రికెట్ రూపంలో ఉన్నాయి. అందుకే ఈ పాతికేళ్లలో జరిగిన మార్పులే ప్రత్యక్ష ఉదాహరణ.





















