అన్వేషించండి

Tamil Nadu Assembly Elections 2026 : ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?

TVK Vijay: టీవీకే విజయ్ తమిళనాడు ఎన్నికల పోరాటంలో రాను రాను ఆత్మవిశ్వాసం కోల్పోతున్నట్లుగా కనిపిస్తోంది. ఒక్క చాన్స్ అని అడగడంతో పాటు ఉచిత పథకాలను భారీగా ప్రకటించారు.

Is Vijay using all weapons to win in Tamil Nadu :   తమిళ రాజకీయాల్లో అగ్రనటుడు విజయ్ స్థాపించిన  తమిళగ వెట్రి కళగం ప్రస్థానం ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. సినిమా ఇమేజ్‌తో  హీరోయిక్ రాజకీయాలు చేస్తారని భావించిన వారందరికీ భిన్నంగా, విజయ్ ఇప్పుడు సానుభూతి' కార్డును ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది.   విజయ్ కు ఒక్క చాన్స్ ఇస్తారా అంటూ..  అడగడం ప్రారంభించారు. ఇతర పార్టీలకు తీసి పోకుండా ఉచిత పథకాల మేనిఫెస్టో ప్రకటించారు. రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చారు.  ఇది ఆయనలో తగ్గిపోతున్న ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  
 
హీరోయిజం నుంచి సానుభూతి వైపు.. 

ప్రారంభంలో అధికార పీఠమే లక్ష్యంగా గర్జించిన విజయ్, ఇప్పుడు తన ప్రసంగాల్లో రక్షణ ధోరణిని ప్రదర్శిస్తున్నారు. అధికార డీఎంకే తనను లక్ష్యంగా చేసుకుందని, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని ఆయన పదేపదే పేర్కొంటున్నారు. ముఖ్యంగా, సభల నిర్వహణలో ఎదురవుతున్న అడ్డంకులు, కరెంట్ కోతలు, సమయ పరిమితులను ప్రస్తావిస్తూ.. నన్ను భయపెట్టాలని చూస్తున్నారా.. ఈ విజయ్ భయపడడు అంటూనే, ప్రజల వద్దకు వెళ్లకుండా తనను అడ్డుకుంటున్నారనే సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు.

ఒక్క ఛాన్స్ నినాదం.. తగ్గుతున్న ఆత్మవిశ్వాసమా?

విజయ్ తన ప్రసంగాల్లో "నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అర్థించడం తమిళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా బలమైన కేడర్, స్పష్టమైన సిద్ధాంతం ఉన్న నాయకులు అధికారాన్ని డిమాండ్ చేస్తారు. కానీ విజయ్ ఒక అభ్యర్థిలా ఒక్క ఛాన్స్ అని అడగడం ఆయనలో కనిపిస్తున్న రాజకీయ అభద్రతకు చిహ్నమని విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకును చీల్చడం అంత సులభం కాదని గ్రహించిన విజయ్, ఇప్పుడు భావోద్వేగాల ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నారు.

పథకాల ప్రవాహం - ఉచితాల మేనిఫెస్టో

డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి పార్టీలు ఉచిత పథకాలతోనే దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి. వాటిని తలదన్నేలా విజయ్ తన మేనిఫెస్టోలో భారీ హామీలను ప్రకటించారు. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ , మహిళలకు ఆర్థిక సాయం వంటి ఉచిత పథకాలకు పెద్దపీట వేశారు. సిద్ధాంతాల కంటే ఉచితాలనే నమ్ముకోవడం చూస్తుంటే, ఆయన ఇతర ప్రధాన పార్టీల బాటలోనే నడుస్తున్నారని, తనకంటూ ఒక ప్రత్యేకమైన విజన్  చూపించడంలో తడబడుతున్నారని తమిళ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  తనపై జరుగుతున్న కుట్రలను ప్రజలకు వివరించడం ద్వారా, విజయ్ తనను తాను ఒక  బాధిత  నాయకుడిగా  చిత్రించుకుంటున్నారు. తన పార్టీ గుర్తు  విజిల్  వినిపిస్తుంటేనే అధికార పార్టీకి వణుకు పుడుతోందని, అందుకే డీఎంకే తన పథకాలను కాపీ కొడుతోందని ఆరోపిస్తున్నారు. ఈ కుట్రల వెనుక ఉన్న ఉద్దేశ్యం ప్రజల్లో విజయ్ పట్ల సానుభూతిని పెంచి, యువతను భావోద్వేగంగా కనెక్ట్ చేయడమేనని స్పష్టమవుతోంది.

 క్లిష్టతరమైన 2026 సమరం 

2026 అసెంబ్లీ ఎన్నికలను డీఎంకే వర్సెస్ టీవీకేగా మార్చాలని విజయ్ ప్రయత్నిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అన్నాడీఎంకే బలమైన ప్రతిపక్షంగా ఉండటం, బీజేపీ తన ఉనికిని చాటుకోవాలని చూడటం విజయ్‌కు సవాలుగా మారాయి. అందుకే  హీరో ఇమేజ్ కంటే ఒక్క ఛాన్స్  కోరే సాధారణ వ్యక్తిగా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా మధ్యతరగతి, అణగారిన వర్గాల ఓట్లను కొల్లగొట్టాలనేది ఆయన అసలు ప్లాన్ అనుకోవచ్చు. కానీ రాజకీయాల్లో ఏ సమీకరణాలు వర్కవుట్ అవుతాయో చెప్పడం కష్టం.  

టాప్ హెడ్ లైన్స్

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget