అన్వేషించండి

Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!

Lucknow Crime News: లక్నోలోని గోమతి నగర్‌లో ఎస్బీఐ ఉద్యోగి తన భార్యను చంపేశాడు. తర్వాత తన సోదరిని హత్య చేసిన సూసైడ్ సుకున్నాడు. కుటుంబ కలహాలనే కారణమని తెలుస్తోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • లక్నోలో బ్యాంకు వద్ద భర్త భార్యను కాల్చిచంపి పరారయ్యాడు.
  • అనంతరం మానస్ తన సోదరిని చంపి, తుపాకీతో ఆత్మహత్య చేసుకున్నాడు.
  • భార్యాభర్తల వివాదాలు, విడాకులు, అనుమానమే ఈ ఘోరానికి కారణం.
  • నిందితుడు వాట్సాప్ స్టేటస్‌లో నేరాన్ని అంగీకరించాడు, దర్యాప్తు కొనసాగుతోంది.

Lucknow Crime News: ఉత్తర్‌ప్రదేశ్‌ లక్నోలోని గోమతి నగర్‌ గురువారం పట్టపగలు ఒక ఘోరమైన ఘటన జరిగింది. ఒక ప్రైవేటు బ్యాంకులో ఉన్నతాధికారిగా పని చేస్తున్న తన భార్యను బ్యాంకు ఎదుటే కాల్చి చంపిన భర్త, ఆపై కొద్ది నిమిషాల్లోనే తన సోదరిని హతమార్చి, తాను తుపాకీతో కాల్చుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అత్యంత సంచలనాత్మక డబుల్ మర్డర్, ఆత్మహత్య ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 

ఎస్బీఐలో పని చేస్తున్న 38 ఏళ్ల మానస్‌ వాజ్‌పేయి, గోమతి నగర్‌లోని ఐసీసీఈ బ్యాంక్‌ వెలుపల తన భార్య దివ్య మిశ్రాపై గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన దివ్యను స్థానిక లోహియా ఆసుపత్రికి తరలించగా , ఆమె అప్పటికే  మరణిమచినట్టు  వైద్యులు ప్రకటించారు. దాడి అనంతరం తన నివాసానికి పారిపోయిన మానస్‌, అక్కడ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తన 28 ఏళ్ల సోదరి శివ వాజ్‌పేయిని కాల్చి చంపి, ఆపై తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ప్రాథమిక సమాచారం మేరకు, భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న వివాదాలు, విడాకుల పిటిషన్, అనుమానమే ఈ ఘోరానికి మూలకారణమని పోలీసులు వెల్లడించారు. 

Image

ఐసీఐసీఐ బ్యాంకు ఎదుట ఏం జరిగింది?

ఈ దారుణ హత్య లక్నోలోని వివేక్ ఖండ్‌ ప్రాంతంలో గల ఐసీఐసీఐ బ్యాంక్‌ శాఖ ముందు జరిగింది. దివ్య మిశ్రా ఈ ఐసీఐసీఐ బ్యాంక్ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఘటన జరిగిన రోజు ఆమె ఒక క్లయింట్‌ సమావేశాన్ని ముగించుకొని బ్యాంకుకు తిరిగి వచ్చిన వెంటనే ఈ ఘటన జరిగింది. లక్నో అడిషనల్‌ డీసీపీ అమోల్‌ ముర్కుట్‌ తెలిపిన వివరాల ప్రకారం, " దివ్య క్లయింట్‌ మీటింగ్‌ ముగించుకొని బ్యాంక్‌కు చేరుకోగానే ఆమె భర్త మానస్ ఆమెను బయటకు పిలిచి మాట్లాడాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వీరిద్ధరూ బ్యాంకు వెలుపల కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఆ సంభాషణ జరిగిన కొద్దిసేపటికే తీవ్ర ఆగ్రహాన్ని గురైన మానస్, తన వద్ద ఉన్న తుపాకీతో దివ్యపై కాల్పులు జరిపి ఘటన స్థలం నుంచి పరారయ్యాడు. కాల్పుల శబ్ధంతో ఒక్కసారిగా బ్యాంక్ పరిసర ప్రాంతాలు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన దివ్యను వెంటనే సమీపంలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుప్రతికి తరలించారు. అయితే ఆమె ఆసుపత్రికి చేరుకునే సరికి మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. 

Image

ఇంటికి చేరుకుని హనుమాన్ చాలీసా ప్లే చేసిన నిందితుడు 

బ్యాంకు వద్ద భార్యను కాల్చి చంపిన అనంతరం మానస్‌ వాజ్‌పేయి నేరుగా తన ఇంటికి చేరుకున్నాడు. మానస్‌ ఇంటి సమీపంలోని ఒక దుకాణదారుడు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో మానస్ చాలా హడావుడిగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అతను విపరీతంగా చెమటలు కక్కుతూ తీవ్ర ఆందోళనతో కనిపించాడు.. ఇంటి లోపలికి వెళ్లిన అతను ఎక్కువ సౌండ్ పెట్టుకొని హనుమాన్ చాలీసా ప్లే చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతని నివాసం నుంచి తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. పక్కింటి వారు అతని వాట్సాప్ స్టేటస్‌ చూసి ఆందోళన చెంది లోపలికి వెళ్లి చూడగా మానస్‌ తన గదిలో శవమై పడి ఉన్నాడు. లోపల మానస్‌ మృతదేహంతోపాటు అతని సోది శివ వాజ్‌పేయి కూడా మరణించి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. 

Image

సోదరిని ఎందుకు హత్య చేసినట్టు?

మానస్ తన భార్యనే కాకుండా తనతోపాటు ఒకే ఇంట్లో నివసిస్తున్న 28 ఏళ్ల సోదరి శివ వాజ్‌పేయిని కూడా ఎందుకు చంపాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శివ వాజ్‌పేయి గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలో బాధపడుతోంది. భార్యను చంపిన తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న మానస్‌, తాను లేకపోతే మానసి రోగి అయిన తన సోదిరిని చూసుకునే వారు ఎవరూ ఉండరనే భావనతోనే కాల్చి చంపినట్టు తెలుస్తోంది. ఈ ఘోరానికి పాల్పడటానికి ముందు అతను రాసినట్టు భావిస్తున్నట్టు వాట్సాప్ స్టేటస్‌ కూడా ఈ విషయాన్ని బలపరుస్తోంది. 

ఇంతకీ స్టేటస్‌లో ఏం ఉంది?

ఈ దారుణానికి ఒడిగట్టడానికి కొద్ది నిమిషాల ముందే మానస్‌ వాజ్‌పేయి తన మొబైల్‌ ఫోన్‌లో షాకింగ్ వాట్సాప్ స్టేటస్ పోస్టు చేశాడు. ఆ స్టేట్ చదివిన వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అందులో అతను ఇలా రాశాడు." ఈ రోజు నన్ను మోసం చేసిన నా భార్యను చంపేశాను. ఇప్పుడు నేను సూసైడ్ చేసుకోవాలి. నా సోదిరిని, ఆమె సోదరి ప్రజ్ఞను, ప్రతి ఒక్కర్నీ చంపేయాలి' ఈ వివాదంలో దివ్య సోదరి ప్రజ్ఞ మిశ్రా పేరును కూడా మానస్ తన వాట్సాప్ స్టేటస్‌లో ప్రస్తావించాడు. ఈ వాట్సాప్ స్టేటస్ చూసిన పక్కింటి వారు పోలీసులకు, బంధువులకు సమాచారం అందేశారు. 

Image

భార్యాభర్తల మధ్య వివాదం

పోలీసుల సమాచారం ప్రకారం మానస్‌, దివ్యల వివాహ బంధంలో గత కొంతకాలంగా తీవ్ర విభేదాలు ఉన్నట్టు వెల్లడైంది. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ఏడాది కాలంగా వీరిద్దరూ ఒకరినొకరు దూరంగా విడివిడిగా ఉంటున్నారు. విడాకుల కోసం దివ్య కోర్టులో పిటిషన్ వేసింది. అయితే మానస్‌ తన భార్య దివ్యకు వేసే రిలేషన్స్ ఉన్నాయని ఆమె తనను మోసం చేసిందని ఆరోపించేవాడని తెలుస్తోంది. ఈ అనుమానం పెరిగి హింసకు దారి తీసింది. 

సోషల్ మీడియాలో దివ్య సోదరి ప్రజ్ఞ మెసేజ్

దివ్యపై కాల్పులు జరిగిన వెంటనే ఆమె సోదరి ప్రజ్ఞా మిశ్రా సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్టు పెట్టింది. " నా సోదరిపై ఎవరో కాల్పులు జరిపారని నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆమెను లోహియా ఆసుపత్రికి తరలించారు. దయచేసి అందరూ ప్రార్థించండి" అంటూ మె ఎక్స్‌ వేదికగా వేడుకుంది. 

ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు 

ఈ ఘోర ఉదంతం జరిగిన వెంటనే లక్నో పోలీసులు, క్రైమ్‌ బ్రాంచ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. డీసీపీ డాక్టర్‌ దీక్షా శర్మ మీడియాతో మాట్లాడుతూ...' ఐసీఐసీఐ బ్యాంక్ వెలుపల మహిళను భర్త కాల్చి చంపినట్టు సమాచారం అందింది. మేము అక్కడకు చేరుకునే లోపు మరో ప్రాంతంలో   ఒక వ్యక్తి తన సోదిరిని చంపి తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వార్త వచ్చింది. దర్యాప్తు చేయగా, ఈ రెండు ఘటనలకు పాల్పడింది ఒక్కడేనని తేలింది. ఆ వ్యక్తినే మానస్ వాజ్‌పేయిగా గుర్తించాం. అతని ఫోన్‌లో సమాచారం ఆధారంగా వివరాలు తెలిశాయి. అతని ఇంటి నుంచి పోలీసులు మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు' అని వివరించారు. పోలీసులు ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఆయుధాల మూలాలను విచారిస్తున్నారు. లైసెన్స్‌ లేని ఆయుధాలు మానస్ వద్దకు ఎలా వచ్చాయనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget