పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయరెడ్డితో కలిసి రాజమండ్రి బ్రిడ్జిపై గోదావరిలో దూకారు. ఈ ఘటనలో నూకరాజు మృతదేహం లభ్యం కాగా, భార్య, కుమార్తె ఆచూకీ లభించలేదు.
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకిన ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కోచ్ సాధిక్ ఖాన్ వేధింపులు, ఆస్తుల కబ్జా, మర్డర్ చేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.

- కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది.
- కుమార్తె సౌజన్య లేఖలతో సాధిక్ ఖాన్ వేధింపులు బయటపడ్డాయి.
- సాధిక్, సౌజన్య భర్తను చంపి మతమార్పిడికి ఒత్తిడి చేసాడు.
- నిందితుడు షేక్ సాధిక్ ఖాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ జిల్లాలో పెను సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది. కేవలం వేధింపుల వల్ల జరిగిన ఆత్మహత్యగా భావించిన ఈ ఘటన వెనుక, ఒక క్రూరమైన వ్యక్తి పకడ్బందీ కుట్ర, హత్య ఆరోపణలు ఉన్నాయని తేలింది. షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ అనే వ్యక్తి ఒక పచ్చని కుటుంబాన్ని ఎలా పీడించి, చివరకు వారి ప్రాణాలు తీసుకునే చేశాడనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఆదివారం రాత్రి రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై ఒక విషాద ఘటన జరిగింది. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈగా పని చేస్తున్న టీ. నూకరాజు తన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయరెడ్డితో కలిసి బ్రిడ్జిపై 88వ నంబర్ పిల్లర్ వద్ద కారు ఆపి గోదావరిలో దూకేశారు. ఈ ఘటనలో నూకరాజు మృతదేహం సోమవారం రాత్రి లభ్యమైంది. ఆయన భార్య, కుమార్తె ఆచూకీ ఇంకా లభించలేదు. పదేళ్ల బాలుడు కార్తికేయ రెడ్డి ఈత రావడంతో బయటపడ్డాడు.

కేసును మలుపు తిప్పిన సౌజన్య లెటర్స్!
పోలీసుల విచారణలో నూకరాజు కుమార్తె సౌజన్య తన స్కూటర్ డిక్కీలో దాచిన లేఖలు లభ్యమయ్యాయి. ఈ లేఖలు చదివిన పోలీసు అధికారులు సైతం విస్తుపోయారు. ఆ లేఖలో సాధిక్ ఖాన్ తన కుటుంబాన్ని ఏ విధంగా నరకప్రాయం చేశాడో సౌజన్య వివరించారు. జులై 2న నూకరాజు అల్లుడు జగదీశ్వర్‌రెడ్డి అనారోగ్యంతో మరణించారని అందరూ భావించారు. కానీ సాధిక్ ఖాన్ తన భర్తకు విషపదార్థం ఇచ్చి చంపేశాడని సౌజన్య తన లేఖలో పేరకొన్నారు. సౌజన్యకు సంబంధించిన ప్రైవేటు ఫొటోలను అడ్డుపెట్టుకొని సాధిక్ ఆమెను వేధించేవాడని, ఆమో ఫొన్ ట్రాప్ చేశాడని లేఖలో వెల్లడైంది.
నూకరాజు కుటుంబానికి సంబంధించిన బ్యాంక్ ఏటీఎం కార్డు, ఎస్‌బీఐ లాకర్ కీలు, తండ్రి ఆస్తి పత్రాలు, భర్త సెల్‌ఫోన్ కూడా సాధిక్ తన వద్దే ఉంచుకున్నాడని సౌజన్య ఆవేదన వ్యక్తం చేశారు. సౌజన్యను ఇస్లాం మతంలోకి మారాలని రోజూ ఇస్లాం పుస్తకాలు చదివి నోట్స్ రాయాలని సాధిక్ తీవ్రంగా ఒత్తిడి చేసేవాడని, ఆమె ప్రాణభయంతో చెప్పినట్టు చేసేదని సమాచారం.
ఎవరీ సాధిక్ ఖాన్
షేక్ సాధిక్ ఖాన్ కాకినాడలో రైఫిల్ షూటింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. షూటింగ్ నేర్చుకోవడానికి వచ్చిన కార్తికేయ ద్వారా ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. సహాయం చేసే వ్యక్తిలా నటించి, మెల్లగా ఆ కుటుంబం వ్యవహారాలన్నీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. సాధిక్ దృష్టి కేవలం మహిళలు, యువతులపైనే ఉండేదని, శిక్షణ పేరుతో వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని స్థానికంగా ఉండే విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అకాడమీలో ఎవరూ లేని సమయంలోనే కొంతమందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవాడని సమాచారం.
పకడ్బందీగా ఆత్మహత్య ప్లాన్
సాధిక్ వేధింపులు భరించలేక, పరువు పోతుందన్న భయంతో నూకరాజు కుటుంబం చనిపోవాలని ముందే నిర్ణయించుకుంది. ఆదివారం మధ్యాహ్నం నూకరాజు తన డ్రైవర్ రాజును పిలిపించి, ఆస్తి పత్రాలన్నీ ఒక బంధువుకు అందజేయామని పంపించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి చేరుకొని రైల్వే స్టేషన్‌లో టిఫిన్ చేసి, కొవ్వూరు బ్రిడ్జి వద్దకు వెళ్లి నదిలో దూకేశారు.
సౌజన్య మామ భాస్కరరెడ్డి ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు సాధిక్ ఖాన్‌పై హత్య కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్లు 103(1)(హత్య), 308(5), 127(1), 351(3), 108, 299 కింద కేసులు నమోదు అయ్యాయి. నిందితుడు సాధిక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన కోసం 8 బృందాలు ప్రత్యేంగా గాలిస్తున్నాయి. సాధిక్ తన ఫోన్‌ను ఇంట్లోనే వదిలిపెట్టి పారిపోగా, రైల్లో వెళ్లూ వేరే వారి ఫోన్‌ల ద్వారా న్యాయవాదులను సంప్రదించినట్టు తెలుస్తోంది.
నూకరాజు ఒక సౌమ్యుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో ఒక కుమారుడిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయారు. ఇప్పుడు సాధిక్ ఖాన్ అనే క్రిమినల్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడింది. ప్రాణాలతో బయటపడిన చిన్నారి కార్తీకేయ రెడ్డి ఒక్కడే సాక్షిగా మిగిలిపోయాడు. ఈ చిన్నారి చెప్పిన విషయాలను, తల్లి రాసిన లేఖలే ఇప్పుడు ఈ కేసులో కీలక ఆధారాలుగా మారాయి.
Before You Go
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Frequently Asked Questions
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన ఘటన ఏమిటి?
ఈ కేసులో నిందితుడు ఎవరు? అతనిపై ఉన్న ప్రధాన ఆరోపణలు ఏమిటి?
నిందితుడు షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్. అతను కుటుంబాన్ని వేధించి, ఆస్తులు స్వాధీనం చేసుకుని, సౌజన్య భర్తను చంపేశాడని, ఆమెను మతం మారమని ఒత్తిడి చేశాడని ఆరోపణలున్నాయి.
కేసు విచారణలో కీలక మలుపు తిప్పిన ఆధారాలు ఏమిటి?
నూకరాజు కుమార్తె సౌజన్య స్కూటర్ డిక్కీలో దొరికిన లేఖలు కేసును మలుపు తిప్పాయి. ఈ లేఖల్లో సాధిక్ ఖాన్ వేధింపులు, తన భర్త హత్య వివరాలు ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు





















