మూడో బిడ్డకు ప్రసూతి సెలవును 12 వారాల నుండి 365 రోజులకు (ఒక సంవత్సరానికి) పెంచారు. ఈ కొత్త విధానం తమిళనాడు రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు వర్తిస్తుంది.
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
తమిళనాడులో జనాభాను పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు లేదా అంతకంటే తక్కువ మంది పిల్లలు ఉన్న వివాహిత ప్రభుత్వ మహిళా ఉద్యోగులు 365 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ప్రకటించింది.

- తమిళనాడు ప్రభుత్వం మూడో బిడ్డకు ప్రసూతి సెలవు పెంచింది.
- మహిళా ఉద్యోగులకు ఇకపై ఏడాది సెలవు లభిస్తుంది.
- గతంలో మూడో బిడ్డకు 12 వారాల సెలవు మాత్రమే.
Tamil Nadu CM Vijay: ఇప్పటి వరకు ఇద్దరే ముద్దు అని ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని ప్రోత్సహిస్తున్నాయి. మూడో బిడ్డ పుడితే నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పుడు అదే బాటలో వెళ్తున్న తమిళనాడు సీఎం విజయ్ కీలక ప్రకటన చేశారు. తమిళనాడు విజయ ప్రభుత్వం, మూడో బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 365 రోజులకు అంటే ఒక ఏడాదికి పెంచింది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కల్పించింది. అసెంబ్లీలో శాఖాపరమైన డిమాండ్లపై జరిగిన చర్చ సందర్భంగా మంగళవారం (ఆగస్టు 18, 2026) తమిళనాడు మంత్రి డి. శరత్‌కుమార్ ఈ ప్రకటన చేశారు. ఇప్పటివరకు మొదటి ఇద్దరు పిల్లలకు మాత్రమే 365 రోజుల సెలవు ఇచ్చేవారని, మూడో బిడ్డకు ఈ పరిమితి 12 వారాలుగా ఉండేదని, ఇప్పుడు రెండింటినీ సమానం చేశామని ఆయన తెలిపారు.
విద్యార్థులకు కూడా విజయ్ ప్రభుత్వం భారీ ప్రకటన
తమిళనాడు అసెంబ్లీలో ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, ప్రభుత్వం సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఒక మంత్రి తెలిపారు. త్వరలో అధికారిక ప్రభుత్వ ఉత్తర్వు జారీ అవుతాయి. SSC, RRB, IBPS, TNPSC వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం "వెట్రి పాథై" యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కూడా మంత్రి ప్రకటించారు.
గతంలో, కేవలం 12 వారాల సెలవు మాత్రమే ఉండేది
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలు ఉన్న సాధారణ మహిళా ఉద్యోగులు మాత్రమే 365 రోజుల ప్రసూతి సెలవుకు అర్హులు. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రసూతి సెలవు కాలాన్ని క్రమంగా పెంచుతూ వచ్చింది. ప్రారంభంలో ఉన్న 90 రోజుల సెలవును 2011లో ఆరు నెలలకు, ఆ తర్వాత 2016లో తొమ్మిది నెలలకు, జూలై 2021లో పూర్తి 365 రోజులకు (ఒక సంవత్సరం) పెంచారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు,రాష్ట్ర ప్రభుత్వ సవరణల ప్రకారం, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న మహిళా ఉద్యోగులకు కేవలం 12 వారాల (84 రోజుల) పూర్తి వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మాత్రమే లభించేది. ఇప్పుడు విజయ్ ప్రభుత్వం, మూడో బిడ్డకు కూడా వర్తించే విధంగా ఒక సంవత్సరం ప్రసూతి సెలవును ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న స్కీమ్ ఏంటీ?
ఆంధ్రప్రదేశ్ చాలా కాలం నుంచి అనురిస్తున్న జనాభా నియంత్రణ విధానాన్ని భిన్నంగా చంద్రబాబు గతంలోనే వరాలు ప్రకటించారు. జనాభా నియంత్రణ వల్ల భవిష్యత్‌లో దేశం అనేక సమస్యలను ఎదుర్కోబోతోందని అందుకే జనాభా అవసరమని చెప్పుకొస్తున్నారు. పిల్లలను భారంగా కాకుండా సంపదగా భావించాలని సూచించారు. అందుకే ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ పిలుపునిచ్చారు. దీని కోసం ప్రభుత్వమే ఆర్థిక సాయం చేస్తుందని వెల్లడించారు. మూడో బిడ్డను కంటే 30వేలు నాల్గో బిడ్డను కంటే 40వేలు తల్లుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తల్లి ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయని, కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, వారి పోషకాహారం, చదువు బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. సమగ్రమైన స్కీమ్‌ను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.
Frequently Asked Questions
తమిళనాడు ప్రభుత్వం మూడో బిడ్డకు ప్రసూతి సెలవును ఎంత కాలానికి పెంచింది?
ఈ కొత్త ప్రసూతి సెలవు విధానం వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది?
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఈ విధానం ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా మూడో బిడ్డకు కూడా ఒక సంవత్సరం సెలవు పొందే అవకాశం లభించింది.
మూడో బిడ్డకు ప్రసూతి సెలవుపై గతంలో ఉన్న నిబంధనలు ఏమిటి?
గతంలో, మూడో బిడ్డకు కేవలం 12 వారాల (84 రోజులు) పూర్తి వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మాత్రమే లభించేది. మొదటి ఇద్దరు పిల్లలకు 365 రోజుల సెలవు ఉండేది.
ఈ ప్రసూతి సెలవు పెంపుదల ప్రకటనను తమిళనాడు ప్రభుత్వం ఎప్పుడు చేసింది?
తమిళనాడు మంత్రి డి. శరత్‌కుమార్ ఈ ప్రకటనను మంగళవారం (ఆగస్టు 18, 2026) అసెంబ్లీలో చేశారు. త్వరలో దీనిపై అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అవుతాయి.
ట్రెండింగ్ వార్తలు





















