Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన టెస్ట్ కెరీర్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌పై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా వర్షం వల్ల గేమ్ నిలిచిపోయిన సమయంలో బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడుతూ జడేజా తన నిరాశను పంచుకున్నాడు.
రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ వంటి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 60కి పైగా అవరేజ్ తో నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్ చేశానని జడేజా గుర్తుచేసుకున్నాడు. ఆ అనుభవంతో తన బ్యాటింగ్ సామర్థ్యంపై నమ్మకం ఉండేదని, అయితే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాక జట్టు మానేజ్మెంట్ తనను నంబర్ 8 లేదా 9 స్థానాలకు పరిమితం చేయడం తీవ్రంగా నిరాశపరిచిందని తెలిపాడు.
ముఖ్యంగా కొన్నిసార్లు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ల కంటే దిగువన బ్యాటింగ్‌కు పంపడం తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. "డ్రెస్సింగ్ రూమ్‌లో ప్యాడ్లు వేసుకుని కూర్చున్నప్పుడు నా పక్కనే ఉన్న ఫాస్ట్ బౌలర్ నాకంటే ముందు బ్యాటింగ్‌కు వెళ్తుంటే నా మనోధైర్యం దెబ్బతినేది. నా బ్యాటింగ్ సామర్థ్యంపై మేనేజ్‌మెంట్‌కు నమ్మకం లేదా అనే సందేహం కలిగేది" అని జడేజా పేర్కొన్నాడు.
ట్రెండింగ్ వార్తలు






















