అన్వేషించండి

Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!

Ayodhya Ram Mandir News: సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా, ఈ కేసులో జూన్ 25న మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో 8 మందితోపాటు ఇతర గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా చేర్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అయోధ్య విరాళాలపై యూపీ హోం శాఖ సిట్ తుది నివేదిక సమర్పించింది.
  • అనిల్ మిశ్రా పేరు తొలగింపు చర్చనీయాంశం; చంపత్ రాయ్ పేరు లేదు.
  • ట్రస్ట్ విజ్ఞప్తితో సిట్ ఏర్పాటు; ఎఫ్ఐఆర్ నమోదు జరిగింది.

Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిర విరాళాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ హోం శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తుది నివేదికను అందజేసింది. భవిష్యత్‌తో ఇలాంటివి జరగకుండా చేపట్టాల్సిన చర్యలతోపాటు ఎవరి పాత్ర ఏంటనే విషయాలపై సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి శ్రీ రామ్ జన్మభూమి టెంపుల్ తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు నివేదికను సమర్పించింది. ప్రాథమిక నివేదికలో చంపత్ రాయ్ పేరు ప్రస్తావించలేదు, అందువల్ల తుది నివేదికలో కూడా అతని పేరు లేదని తెలుస్తోంది.  

ప్రాథమిక నివేదికలో అనిల్ మిశ్రా పేరు చేర్చారు. కానీ తుది నివేదిక నుంచి ఆయన పేరు తొలగించడంపై చర్చ సాగుతోంది. అనిల్ మిశ్రా పేరుకు సంబంధించి ఏమైనా కొత్త ఆధారాలు లభించాయో లేదో ఇంకా నిర్ధారణ కాలేదు. తుది నివేదికను బహిరంగపరిచే వరకు, అందులో అనిల్ మిశ్రా పేరును చేర్చుకోకపోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి ముందే ఏర్పాటు చేసిన సిట్, ఈ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ట్రస్ట్ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 13న ఈ సిట్‌ను ఏర్పాటు చేసింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని ఈ ముగ్గురు సభ్యుల సిట్‌లో ఐజీ రేంజ్ కిరణ్, ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ కుమార్ ఉన్నారు. సిట్ తన ప్రాథమిక నివేదికను జూన్ 23న ప్రభుత్వానికి సమర్పించి, చాలా సిఫార్సులను చేసింది.

మొదటి నివేదికను జూన్ 25న దాఖలు 

సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా, ఈ కేసులో జూన్ 25న మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో ఎనిమిది మంది వ్యక్తులు, ఇతర గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నారు. ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా శ్రీ రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఈ ఎఫ్ఐఆర్ (క్రైమ్ నంబర్ 90/2026)లో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, శ్రీ రామ్ శంకర్ యాదవ్ అలియాస్ తిను, ఇతర గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నారు.

ఈ సెక్షన్ల కింద కేసులు

నిందితులపై సెక్షన్లు 305, 306, 316(5), 317(4), 317(5), 61, 3(5) BNS మరియు 13(1)(a) PC చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Frequently Asked Questions

అయోధ్య రామ మందిర విరాళాల కేసులో తాజా పరిణామం ఏమిటి?

ఉత్తర ప్రదేశ్ హోం శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసులో తన తుది నివేదికను సమర్పించింది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చేపట్టాల్సిన చర్యలను ఇందులో పేర్కొన్నారు.

ఈ కేసును దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఎవరు, ఎప్పుడు ఏర్పాటు చేశారు?

ట్రస్ట్ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 13న ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ దీనికి నేతృత్వం వహించారు.

ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఎంతమందిని నిందితులుగా పేర్కొన్నారు?

ప్రాథమిక సిట్ నివేదిక ఆధారంగా, ఎనిమిది మంది వ్యక్తులను, ఇతర గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొంటూ జూన్ 25న మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కృష్ణమోహన్ అనే ట్రస్ట్ సభ్యుడు ఈ ఫిర్యాదు ఇచ్చారు.

అనిల్ మిశ్రా పేరుకు సంబంధించి ఉన్న చర్చ ఏమిటి?

అనిల్ మిశ్రా పేరు ప్రాథమిక నివేదికలో ఉంది, కానీ తుది నివేదిక నుండి తొలగించడంపై చర్చ జరుగుతోంది. దీనికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Vijay And Chandrababu Meeting: చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
CM Vijay: సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
Delhi Protest: అక్టోబర్ 20 వరకు సాయుధ బలగాలను ఇక్కడే మోహరించండి... కేంద్రానికి ఢిల్లీ పోలీసుల లేఖ
అక్టోబర్ 20 వరకు సాయుధ బలగాలను ఇక్కడే మోహరించండి... కేంద్రానికి ఢిల్లీ పోలీసుల లేఖ
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Embed widget