మంత్రి నారా లోకేష్ అక్టోబర్‌లో 3000 పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఇది పాఠశాలల్లో ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది.
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. 3000 పోస్టులతో ఇ ఏడాది అక్టోబర్‌లో నోటిఫికేషన్ వేస్తున్నట్టు ప్రకటించారు.

- లోకేష్ అక్టోబర్‌లో 3000 డీఎస్సీ పోస్టుల నోటిఫికేషన్ ప్రకటించారు.
- ప్రభుత్వం ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తుంది, పారదర్శకతకు హామీ.
- ఉగాది నాటికి నియామక పత్రాలు, ఉపాధ్యాయులకు అంతర్జాతీయ శిక్షణ.
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది మంత్రి నారా లోకేష్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఎప్పుడు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో చెబుతూ క్యాలెండర్ ప్రకటించారు. దాని ప్రకారం అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 3000 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రాబోతోందని ఆయన తెలిపారు.
అసెంబ్లీ వేదికగా లోకేష్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ నియామకాలపై స్పష్టమైన రోడ్డు మ్యాప్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా రాబోయే అక్టోబర్ నెలలో 3000 పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుందని ప్రకటించారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయ- విద్యార్థి నిష్పత్తిని మెరుగుపరచడం ద్వారా విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేది ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
ప్రతి ఏటా డీఎస్సీ
ఈ ప్రకటనలో అత్యంత కీలకమైన మరో అంశం యాన్యువల్ డీఎస్సీ, ఇప్పటివరకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక అభ్యర్థులు పడే మానసిక ఒత్తిడిని తొలగించడానికి, ప్రతి సంవత్సరం నిర్ధిష్ట సమయంలో నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీని వల్ల అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించుకోడానికి వీలు అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియలో ముందంజలో ఉన్నట్టు అసెంబ్లీలో వెల్లడించింది.
నియామకాల్లో పారదర్శకత
నియామక ప్రక్రియలో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా వంద శాతం పారదర్శకత పాటిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు, రిటైర్మెంట్‌లు, పదోన్నతలు ఆధారంగా నోటిఫికేషన్ డిజైన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గతంలో ఎదురైన న్యాయపరమైన ఆటంకాలను, దాదాపు 336 కోర్టు కేసులను అధిగమించి గత ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీని 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో పూర్తి చేసినట్టు గుర్తు చేశారు.
ఉపాధ్యాయులకు అంతర్జాతీయ శిక్షణ
ఉపాధ్యాయులకు కేవలం పాఠశాలలకు పరిమితం కాకుండా, వారికి అత్యాధునిక బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఏపీ ఉపాధ్యాయులను సింగపూర్, ఫిన్‌లాండ్ వంటి దేశాలకు పంపి అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ కల్పించనున్నారు. అక్టోబ్‌లో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి ఉగాది పండుగ నాటికి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వీరందరూ విధుల్లో చేరనున్నారు.
Frequently Asked Questions
ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి కొత్త ప్రకటన ఏమిటి?
డీఎస్సీ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం విడుదల అవుతుందా?
అవును, అభ్యర్థుల మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ప్రతి సంవత్సరం నిర్దిష్ట సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది?
నియామక ప్రక్రియలో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా వంద శాతం పారదర్శకత పాటిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఎప్పటిలోగా అందిస్తారు?
అక్టోబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి ఉగాది పండుగ నాటికి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వీరందరూ విధుల్లో చేరనున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















