అన్వేషించండి

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం

Kondagattu Accident | జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో లారీ, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జగిత్యాలలో కొండగట్టు వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి.
  • ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడగా, ఐదుగురి పరిస్థితి విషమం.
  • లారీ డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకోవడంతో స్థానికులు శ్రమించి కాపాడారు.
  • ఘాట్ రోడ్డుపై లారీ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.

Telangana Latest News | జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు ఆలయం వద్ద వేగంగా వచ్చిన ఒక లారీ, RTC బస్సు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయి డ్రైవర్ లోపలే చిక్కుకుపోయాడు. అతనిని బయటకు తీసేందుకు స్థానికులు ఇనుప రాడ్లు, తాళ్లను ఉపయోగిస్తూ 30 నిమిషాలకు పైగా శ్రమించాల్సి వచ్చింది. 

కరీంనగర్ 1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాల వైపు వెళ్తుండగా లారీ ఢీకొనడంతో విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో దాదాపు 60 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన తరువాత బాధితులు సహాయం కోసం కేకలు వేశారు. ఒక ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడుతూ, ‘మేం పెద్ద శబ్ధం రాగానే విని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాం. బస్సు డ్రైవర్ శరీరం నుంచి రక్తం కారుతోంది. బస్సు  లోపల ప్రయాణికులు చిక్కుకుపోయారు’ అని తెలిపారు.

కొండగట్టు హైవేపై రోడ్డు ప్రమాదం

మల్లియల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు గుట్టపై ఉన్న ఆలయానికి వెళ్లే మార్గంలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురు ఢీకొన్న ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. కొన్ని నిమిషాల్లోనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీసేందుకు కిటికీలు పగలగొట్టారు. వీరిలో 20 మందిని చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తరలిస్తున్నారు. క్యాబిన్‌లో చిక్కుకుపోయిన లారీ డ్రైవర్‌ను కొంతసేపు శ్రమించి బయటకు తీయగలిగారు.

Also Read: Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘాట్ రోడ్డు దిగుతున్న సమయంలో లారీ అదుపు తప్పి బస్సు లేన్‌లోకి వచ్చి ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలింది. లారీ వేగం, బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. 

 

Frequently Asked Questions

జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఎక్కడ జరిగింది?

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయం వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లియల్ మండలంలోని కొండగట్టు గుట్టపై ఉన్న ఆలయానికి వెళ్లే మార్గంలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఏ వాహనాలు ఢీకొన్నాయి?

వేగంగా వచ్చిన ఒక లారీ, RTC బస్సు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. కరీంనగర్ 1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాల వైపు వెళ్తుండగా లారీ ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు?

ఈ ప్రమాదంలో కనీసం 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదానికి గల కారణాలు ఏమిటి?

లారీ ఘాట్ రోడ్డు దిగుతున్నప్పుడు అదుపుతప్పి బస్సు లేన్‌లోకి వచ్చి ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలింది. లారీ వేగం, బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగిందా అని పోలీసులు విచారిస్తున్నారు.

లారీ డ్రైవర్ పరిస్థితి ఏమిటి?

లారీ క్యాబిన్ నుజ్జునుజ్జుకావడంతో డ్రైవర్ లోపలే చిక్కుకుపోయాడు. స్థానికులు 30 నిమిషాలకు పైగా శ్రమించి అతన్ని బయటకు తీశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
Chittoor Crime News: సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
Ganja Transport For Lover Birthday Gift: ప్రియురాలి బర్త్ డేకు ఐఫోన్ గిఫ్ట్.. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ ప్రియుడు
ప్రియురాలి బర్త్ డేకు ఐఫోన్ గిఫ్ట్.. గంజాయి రవాణా చేస్తూ దొరికిపోయిన ప్రియుడు
Advertisement

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రోడ్లపై ధర్నాలు వద్దు.. సమస్యలు తీర్చడానికి 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
Singer Jhansi : బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Vijayasai Reddy Politics: విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget