అన్వేషించండి

Baba Fasiuddin: హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్య కుట్ర భగ్నం.. ఐదుగురి అరెస్ట్

మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్య కుట్రను బోరబండ పోలీసులు భగ్నం చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ.20- 25 లక్షల సుపారీ కుట్రపై దర్యాప్తు కొనసాగుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకుట్ర భగ్నం.
  • ఈ కుట్రకు రూ.25 లక్షల సుపారీ, రూ.5 లక్షల అడ్వాన్స్.
  • పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి కత్తులు స్వాధీనం.
  • మరో నిందితుడు సయ్యద్ హాదీ కోసం గాలింపు కొనసాగుతోంది.

Former Hyderabad Deputy Mayor Baba Fasiuddin | హైదరాబాద్‌ నగర మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ మాజీ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేసేందుకు జరిగిన కుట్రను బోరబండ పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో వేగంగా స్పందించిన బోరబండ పోలీసులు గంటల వ్యవధిలోనే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, మాజీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకు రూ.20 నుంచి 25 లక్షల వరకు సుపారీ ఇచ్చేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుట్ర అమలు కోసం ముందస్తుగా రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

స్వరాజ్ నగర్‌కు చెందిన ఇమ్రాన్ ఖాన్, తన సోదరుడు ఫయాజ్ ఖాన్‌తో కలిసి సుమారు నెల రోజుల క్రితం మిస్బాను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు కొందరు వ్యక్తులు మారణాయుధాలతో బాబా ఫసియుద్దీన్ నివాసం పరిసరాల్లో రెక్కీ నిర్వహిస్తూ, ఆయన కదలికలపై నిఘా పెట్టినట్లు ఫిర్యాదు అందింది. దీంతో బోరబండ పోలీసులు క్రైమ్ నంబర్ 817/2026 కింద బీఎన్ఎస్, ఆయుధాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


Baba Fasiuddin: హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్య కుట్ర భగ్నం.. ఐదుగురి అరెస్ట్

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు వేగవంతం చేశారు. బాబా ఫసియుద్దీన్‌కు ప్రాణహాని ఉన్న క్రమంలో పోలీసులు భద్రతా చర్యలు కూడా చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి రావడంతో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు సయ్యద్ హాదీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

Also Read: MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..

ఈ కేసులో నిందితుల నుంచి రెండు కత్తులు, 5 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించే ప్రక్రియ చేపట్టారు. కాగా, ఈ కేసులో అరెస్టయిన వారిలో ఇమ్రాన్ ఖాన్, ఫయాజ్ ఖాన్, దేవర రాజా, మహ్మద్ కాషిఫ్ మిస్బా, షేక్ నవాజ్ ఉన్నారు. మరో నిందితుడు సయ్యద్ హాదీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మొత్తంగా మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుట్రను పోలీసులు ముందుగానే ఛేదించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. హైదరాబాద్ పోలీసుల వేగవంతమైన దర్యాప్తుతో ఈ కుట్ర వెలుగులోకి రావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

Frequently Asked Questions

మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌కు ఏమైంది?

హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేసేందుకు కుట్ర జరిగింది. బోరబండ పోలీసులు ఈ కుట్రను భగ్నం చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

బాబా ఫసియుద్దీన్ హత్య కుట్రలో ఎంత మంది నిందితులు ఉన్నారు?

ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఇమ్రాన్ ఖాన్, ఫయాజ్ ఖాన్, దేవర రాజా, మహ్మద్ కాషిఫ్ మిస్బా, షేక్ నవాజ్ ఉన్నారు.

బాబా ఫసియుద్దీన్ హత్యకు ఎంత సుపారీ ఇచ్చేందుకు కుట్ర పన్నారు?

మాజీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకు రూ.20 నుంచి 25 లక్షల వరకు సుపారీ ఇచ్చేందుకు కుట్ర జరిగింది. ముందస్తుగా రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులు నిందితుల నుంచి ఏమి స్వాధీనం చేసుకున్నారు?

నిందితుల నుంచి రెండు కత్తులు మరియు ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సయ్యద్ హాదీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
BRS Support Delimitation Bill: బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు!
బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు!
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
India Hat Trick Asian Champions Trophy Title: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
Hanuman Ansh OTT : ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
J-Series ఇంజిన్‌తో Royal Enfield Classic 350 హైవేపై, సిటీలో నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తుందో తెలుసా?
E20 పెట్రోల్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ Classic 350 నిజమైన మైలేజ్‌ ఇదే.. ఆన్‌రోడ్‌ ధర ఎంతంటే?
Amadalavalasa Elections: ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం
ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం
Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
Embed widget