అన్వేషించండి

Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

Hyderabad Crime News | రామచంద్రాపురం పరిధిలోని ఆలయంలో మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన అర్చకుడ్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన కలకలం రేపింది. స్థానిక ఆలయ ప్రాంగణంలో ఒక మైనర్ బాలికపై అర్చకుడు లైంగిక వేధింపులకు పాల్పడుతూ స్థానికులకు అడ్డంగా దొరికిపోయాడు. దాంతో మైనర్ బాలికపై అర్చకుడి లైంగిక దాడి ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

గర్భగుడిలో బాలికపై అఘాయిత్యం..

స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం,  ఆలయానికి బయట నుంచి తాళం వేసి ఉండటంతో గ్రామస్థులకు అనుమానం వచ్చింది. బయట తాళం వేసి లోపల సాయన్న అనే అర్చకుడు ఓ బాలికతో అత్యంత అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు గమనించారు. వెంటనే స్థానికులు, గ్రామ పెద్దలు క్షణం ఆలస్యం చేయకుండా పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం తలుపులు తెరిచి చూడగా, అక్కడ అర్చకుడిగా పనిచేస్తున్న సాయన్న అనే వృద్ధుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. 

పోలీసులకు స్థానికుల ఫిర్యాదు.. పోక్సో కేసు నమోదు

అగ్రహించిన స్థానికులు వెంటనే నిందితుడిని పట్టుకుని రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోగానే నిందితుడు లేచి ప్యాంట్ వేసుకున్నాడని స్థానికులు తెలిపారు. తనను ఫొటోలు, వీడియోలు తీయవద్దని వేడుకుంటున్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో బాలికను రక్షించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆలయానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి వివరాలు సేకరించి, నిందితుడు సాయన్నపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాధితురాలు మైనర్ కనుక పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

Also Read: Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్

ఇంకా ఏమైనా దారుణాలు జరిగాయా... 

ఆ ఆలయ ప్రాంగణం కేంద్రంగా అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదుల ఆధారంగా ఆలయ పరిసరాల్లో జరుగుతున్న ఇతర అక్రమాలపై కూడా సమగ్ర విచారణ జరుపుతున్నామని, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

 

Frequently Asked Questions

రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఏమిటి?

మైనర్ బాలికపై ఆలయ అర్చకుడు సాయన్న లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానిక ఆలయ ప్రాంగణంలో జరిగింది.

ఈ కేసులో నిందితుడు ఎవరు?

సాయన్న అనే అర్చకుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. స్థానికులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పోలీసులు నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

పోలీసులు నిందితుడు సాయన్నను అరెస్ట్ చేశారు. బాధితురాలు మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది?

ఆలయానికి బయట నుంచి తాళం వేసి ఉండటంతో గ్రామస్థులకు అనుమానం వచ్చింది. లోపల అర్చకుడు బాలికతో అనుచితంగా ప్రవర్తిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Hyderabad ORR Accident: ఔటర్ పై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. టైర్ పేలడంతో పల్టీలు కొట్టిన ఆటో
Hyderabad ORR Accident: ఔటర్ పై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. టైర్ పేలడంతో పల్టీలు కొట్టిన ఆటో
Hyderabad Crime: కేర్ టేకరే అసలు దొంగ.. నల్లగుంట చోరీ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
కేర్ టేకరే అసలు దొంగ.. నల్లగుంట చోరీ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
Tragedy at Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో విషాదం.. పోలీసుల అత్యుత్సాహంతో భక్తుడు మృతి!
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో విషాదం.. పోలీసుల అత్యుత్సాహంతో భక్తుడు మృతి!
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Bank Strike 2026: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
Mobile Prepaid 30 Days: మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
Embed widget