అన్వేషించండి

Lower Back Pain : ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!

Back Pain Causes : ప్రపంచవ్యాప్తంగా నడుము నొప్పి కేసులు పెరుగుతున్నాయి. దీనిని తగ్గించుకోవడానికి బిలియన్ల కొద్దీ ఖర్చు చేసినా నివారణ లేదు అని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రపంచవ్యాప్తంగా 619 మిలియన్ల మంది నడుము నొప్పితో బాధపడుతున్నారు.
  • ఎక్కువసేపు కూర్చోవడం, వైకల్యానికి నడుమునొప్పి ప్రధాన కారణం.
  • నొప్పి మెదడులో ఉత్పన్నమవుతుంది, చికిత్సకు భారీ వ్యయం.
  • ఆసియాలో పెరిగి, యువతను సైతం నడుమునొప్పి బాధిస్తోంది.

Global Back Pain Cases Are Rising : ప్రపంచవ్యాప్తంగా నడుము నొప్పితో బాధపడేవారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. 2023లో 'ది లాన్సెట్ రుమటాలజీ'లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 619 మిలియన్ల మంది నడుము నొప్పితో బాధపడుతున్నారు. 1990తో పోలిస్తే ఈ సంఖ్య సుమారు 60 శాతం పెరిగింది. ఈ అధ్యయనం అంచనా ప్రకారం.. 2050 నాటికి నడుము నొప్పితో బాధపడేవారి సంఖ్య 843 మిలియన్లకు చేరుకోవచ్చు. ఈ సంఖ్య ఐరోపా మొత్తం జనాభా కంటే ఎక్కువగా ఉంటుంది.

వెన్నునొప్పికి ప్రధాన కారణం

ది స్పైన్ జర్నల్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా వైకల్యానికి ప్రధాన కారణాలలో నడుము నొప్పి ఒకటి. మైగ్రేన్ తర్వాత ఇదే తర్వాతి స్థానంలో ఉంది. ది స్పైన్ జర్నల్ ఎడిటర్-ఇన్-చీఫ్ అయిన క్రిస్టోఫర్ బోనో ప్రకారం.. మనిషి ఎక్కువకాలం కూర్చోవడం వల్ల నడుము కింది భాగంపై చాలా ఒత్తిడిని పెరుగుతుంది. వెన్నెముక కింది భాగంలోని L4, L5 ఎముకలపై పడే ఈ ఒత్తిడి, కాలక్రమేణా ఈ ప్రాంతం క్షీణతకు గురయ్యే అవకాశాన్ని పెంచుతుంది.

Also Read : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!

ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో పెరుగుతోన్న కేసులు

ఇటీవలి కాలంలో.. లాటిన్ అమెరికా నుంచి ఆసియా, ఆఫ్రికా వరకు ఉన్న ప్రాంతాలలో నడుము నొప్పి కేసులు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రాంతాలలోని సామాజిక సహాయ వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు ఇప్పటికే వనరుల కొరతతో సతమతమవుతున్నాయని.. అధిక భారాన్ని మోస్తున్నాయని.. నాణ్యమైన వైద్య సంరక్షణ అందుబాటులో లేని వారిపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉందని లాన్సెట్ నివేదిక పేర్కొంది.

వయసు పెరగడం వల్ల వస్తోందా?

నడుము నొప్పి తరచుగా వృద్ధాప్యంతో ముడిపడి ఉండేది. కానీ దానితో బాధపడేది కేవలం వృద్ధులు మాత్రమే కాదు. 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల అమెరికన్లలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ మంది నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఎక్కువ సేపు డెస్క్ వద్ద కూర్చోవడం కూడా నడుము నొప్పికి ప్రధాన కారణం కావచ్చు. నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ ప్రకారం.. దాదాపు 80 శాతం మంది పెద్దలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము కింది భాగంలో నొప్పిని అనుభవిస్తారు.

Also Read : నడుము నొప్పి తగ్గించే సులభమైన మార్గాలివే.. కూర్చునే విధానం నుంచి వ్యాయామాల వరకు

నడుమునొప్పికి మెదుడుకు లింక్? 

కొత్త పరిశోధన ప్రకారం.. నడుము నొప్పిని అర్థం చేసుకోవడానికి జీవశాస్త్రం, జన్యుశాస్త్రం బలమైన ఆధారాలు కావచ్చు. నొప్పిపై జరిగిన పరిశోధనలో నొప్పి అనుభూతి మెదడులో ఏర్పడుతుందని కూడా వెల్లడైంది. పెయిన్ ఎక్స్పర్ట్, అనస్థీషియాలజిస్ట్ అయిన జేన్ బ్యాలంటైన్ ప్రకారం.. వాపు లేదా స్నాయువు చిరగడం వంటి స్పష్టమైన సమస్య లేని ప్రాంతాలకు కూడా మెదడు కొన్నిసార్లు నొప్పి సంకేతాలను పంపగలదు.

నడుము నొప్పి ఎముకల సమస్య మాత్రమే కాదు..

ఒకప్పుడు నడుము నొప్పిని కేవలం ఒక యాంత్రిక సమస్యగా మాత్రమే పరిగణించేవారు. సమస్య వెన్నెముకలోని ఎముకలు లేదా డిస్కులలో ఉందని వైద్యులు నమ్మేవారు. దీంతో చికిత్స ఆ ప్రాంతంపైనే చేసేవారు. ఈ ఆలోచనా విధానం 1996 నుంచి 2004 మధ్య యునైటెడ్ స్టేట్స్‌లో డిసెక్టమీల సంఖ్య 14 శాతం పెరగడానికి దారితీసింది. అదే సమయంలో 1990 నుంచి 2001 మధ్య లంబార్ ఫ్యూజన్ శస్త్రచికిత్సల రేటు 220 శాతం పెరిగింది. ఆ తర్వాత నడుము నొప్పిని చూసే విధానం మారింది. 

Also Read : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు

అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, అమెరికన్ పెయిన్ సొసైటీ 2007లో నడుము నొప్పి చికిత్స కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేశాయి. ఈ మార్గదర్శకాలు నడుమును కేవలం ఎముకలకే పరిమితం చేయలేదు. కండరాలు, స్నాయువులు, లిగమెంట్లు, ఫాసియా, నరాలను కూడా చేర్చాయి.

100 బిలియన్ డాలర్లు ఖర్చు

అమెరికాలో నడుము నొప్పి చికిత్స చాలా ఖరీదైనదిగా మారుతోంది. నడుము నొప్పికి సంబంధించిన వివిధ చికిత్సల కోసం ఏటా దాదాపు 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. క్యాన్సర్‌తో సహా మరే ఇతర వ్యాధి ఖరీదు కంటే ఇది తక్కువ కాదు. ఈ ఖర్చులో నడుమునొప్పి వల్ల ఉద్యోగం కోల్పోవడం, వైకల్య చెల్లింపులు, ఇతర ఎంపికల ఖర్చులు చేర్చనేలేదు. నడుము నొప్పిపై ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నప్పటికీ.. దాని వల్ల కలిగే ప్రయోజనాలు చాలా తక్కువని స్టాన్‌ఫోర్డ్ పరిశోధకులు నివేదిస్తున్నారు. 

నడుము అనేది సంక్లిష్టమైన నిర్మాణం. దాని కండరాలు, స్నాయువులు, నరాల మధ్య ఉండే పరస్పర అనుసంధానం వల్ల చికిత్స చేసినా కోలుకోవడం ఆలస్యం జరుగుతుందట. నడుము నొప్పిని శాశ్వతంగా తొలగించే చికిత్సను ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని.. కానీ అలాంటి అద్భుతమైన నివారణ ఇప్పట్లో రాదని క్రిస్టోఫర్ బోనో అంటున్నారు.

Also Read : నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Colorectal Cancer in Men : 50 ఏళ్లలోపు పురుషుల్లోనూ కొలొరెక్టల్ క్యాన్సర్.. మల విసర్జనలో ఈ మార్పులు కనిపిస్తే జాగ్రత్త అంటోన్న వైద్యులు
50 ఏళ్లలోపు పురుషుల్లోనూ కొలొరెక్టల్ క్యాన్సర్.. మల విసర్జనలో ఈ మార్పులు కనిపిస్తే జాగ్రత్త అంటోన్న వైద్యులు
Hair Care Tips : జుట్టు రాలిపోతుందా? పలుచబడుతోందా? హెల్తీగా ఉండాలంటే రోజూ ఈ 5 తప్పులు చేయకండి
జుట్టు రాలిపోతుందా? పలుచబడుతోందా? హెల్తీగా ఉండాలంటే రోజూ ఈ 5 తప్పులు చేయకండి
Infertility With STIs : లైంగిక వ్యాధులకు చికిత్స తీసుకోకుంటే పురుషులు, మహిళల్లో సంతానలేమి సమస్య వస్తుందా? డాక్టర్ ఏమంటున్నారంటే..
లైంగిక వ్యాధులకు చికిత్స తీసుకోకుంటే పురుషులు, మహిళల్లో సంతానలేమి సమస్య వస్తుందా? డాక్టర్ ఏమంటున్నారంటే..
Chikkudukaya Curry : చిక్కుడుకాయ ఇగురు కూరను ఇలా ఈజీగా చేసుకోండి.. అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు, రెసిపీ ఇదే
చిక్కుడుకాయ ఇగురు కూరను ఇలా ఈజీగా చేసుకోండి.. అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు, రెసిపీ ఇదే
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
Embed widget