అన్వేషించండి

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం SIR ముసాయిదాను విడుదల చేసింది. మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో 78.30శాతం మంది వివరాలను డిజిటలైజ్‌ చేయగా, 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ ఓటర్ల జాబితా సవరణ ముసాయిదా విడుదల; 2.64 కోట్ల డిజిటలైజ్.
  • లక్షల ఓటర్ల వివరాల్లో తప్పులు; 92 లక్షల మందికి నోటీసులు.
  • సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాల గడువు; అక్టోబర్ 19న తుది జాబితా.

Telangana Voter List 2026: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం నాడు ఎస్‌ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేశారు. ఓటర్ల జాబితాలో పారదర్శకతను పెంచడం, తప్పులను సరిదిద్దడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను చేపట్టినట్టు ఆయన వెల్లడించారు.  

ముసాయిదా లెక్కలు ఇవే

రాష్ట్ర ఎన్నికల సంగం వెల్లడించిన వివరాల ప్రకారం, తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు మొత్తం ఓటర్ల సంఖ్య 3, 38, 26, 448గా ఉంది. తాజా ముసాయిదా రూపకల్పనలో భాగంగా ఇప్పటి వరకు 2, 64, 87, 213 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇది మొత్తం ఓటర్లలో 7. 30 శాతానికి సమానం. 

మిగిలిన ఓటర్ల వివరాల్లో వివిధ రకాల వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించారు. సుమారు 60, 50, 918 మంది ఓటర్లు వివరాల్లో తప్పులు లేదా అసంపూర్ణ సమాచారం ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 32,36, 659 మంది ఓటర్లకు సంబంధించి ప్రాపర్ మ్యాపింగ్ లేదనని అధికారులు నిర్దారించారు. అబ్సెంట్‌, షిఫ్టెడ్, డెడ్‌, డూప్లికేట్, విభాగాల్లో మొత్తం 73, 39,235 మంది ఓటర్లు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. 

92 లక్షల మందికి నోటీసులు ఎందుకు?

ఓటర్ల జాబితాలో డూప్లికేట్‌ ఓట్లను తొలగించం, చిరునామాలు మారిన వారి వివరాలను సరిదిద్దడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నోటీసులను బూత్ లెవల్‌ ఆఫీసర్స్ ద్వారా నేరుగా లేదా పోస్టు ద్వారా ఓటర్లు చేరవేస్తారు. 

నోటీసులు అందుకున్న వారు ఏం చేయాలి?

నోటీసులు అందిన ఓటర్లు తమ వివరాల ధృవీకరణ కోసం అవసరమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ ఓటరు చనిపోయినా, శాశ్వతంగా వేరే ప్రాంతానికి వలస వెళ్లినా, ఆ వివరాలను విచారణలో భాగంగా నిర్దారిస్తారు ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఒక మోడల్‌ నోటీసు సిద్ధం చేసింది. అందులో ఓటరు పేరు, గుర్తింపు కార్డు సంఖ్య, సంబంధిత పోలింగ్ కేంద్రం వివరాలు పొందుపరిచారు. 

ముఖ్యమైన గడువులు 

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం టైమ్‌లైన్ ప్రకటించింది. నోటీసులు అందుకున్న వారు తమ సమాధానాలను లేదా అభ్యంతరాలను సెప్టెంబర్‌ 16 వరకు సమర్పించవచ్చు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు అందిన దరఖాస్తులను, అభ్యంతరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత అక్టోబర్‌ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. 

జిల్లాల వారీగా స్థితిగతులు 

ఎన్నికల సంఘం విడుదల చేసిన 33 జిల్లాల నివేదిక పరిశీలిస్తే, గ్రామీణ జిల్లాల్లో డిజిటలైజేషన్ వేగంగా సాగగా, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సవాల్లు ఎదురవుతున్నాయి. 

కుమరం భీం ఆసిఫాబాద్‌లో డిజిటలైజేషన్ ప్రక్రియ 89 శాతానికిపైగా పూర్తి అయ్యింది. అత్యంత క్లిష్టమైన హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు గాను డిజిటలైజేషన్ శాతం కేవలం 59. 01శాతం మాత్రమే ఉంది. ఇక్కడ మాత్రం సుమారు 19.41 మంది ASDD ఓటర్లు ఉన్నట్టు నివేదిక స్పష్టం చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలో డిజిటలైజేషన్ 65. 21 శాతం నమోదైంది. ఎల్బీనగర్, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాల్లో భారీగా ఓటర్ల వివరాల సవరణ అవసకం ఉంది.  

అధికారులు ఏం చెబుతున్నారు?

ఈ ప్రక్రియలో 2 వేల మందికిపైగా అధికారులు పాల్గొంటున్నారని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటరు జాబితాలో తన పేరు లేదని ఎవరైనా గుర్తిస్తే, వారు ఫామ్‌ 6A ద్వారా కొత్తా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. 

ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకునే డైరెక్ట్ లింక్ ఇదే

Frequently Asked Questions

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ లక్ష్యం ఏమిటి?

ఓటర్ల జాబితాలో పారదర్శకతను పెంచడం, తప్పులను సరిదిద్దడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యం.

ముసాయిదా ఓటర్ల జాబితాను ఎవరు విడుదల చేశారు మరియు ఎప్పుడు?

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం నాడు ఎస్‌ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేశారు.

92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఎందుకు జారీ చేస్తున్నారు?

డూప్లికేట్ ఓట్లను తొలగించడానికి మరియు చిరునామాలు మారిన వారి వివరాలను సరిదిద్దడానికి ఎన్నికల సంఘం ఈ నోటీసులను జారీ చేస్తోంది. ఈ నోటీసులు బూత్ లెవల్ ఆఫీసర్స్ ద్వారా అందజేస్తారు.

నోటీసులు అందుకున్న ఓటర్లు ఏమి చేయాలి?

నోటీసులు అందిన ఓటర్లు తమ వివరాల ధృవీకరణ కోసం అవసరమైన ఆధారాలను సమర్పించాలి. చనిపోయినా లేదా వలస వెళ్ళినా, ఆ వివరాలను విచారణలో భాగంగా నిర్దారిస్తారు.

తుది ఓటర్ల జాబితా ఎప్పుడు విడుదల అవుతుంది?

అన్ని సవరణలు మరియు పరిశీలనలు పూర్తయిన తర్వాత, అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget