అన్వేషించండి

Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 

Andhra Pradesh and Telangana BJP: బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటన ఏపీ నేతల్లో నిరాశ నింపగా, ఒక్క పదవి కూడా రాకపోయనా తెలంగాణ నేతలు మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటులేదు, ఏపీలో నిరాశ.
  • పురంధేశ్వరి జాతీయ కార్యవర్గంలోకి, ఏపీ మంత్రి పదవి ఆశలు సన్నగిల్లాయి.
  • జాతీయ కార్యవర్గంలో చోటులేమి, తెలంగాణ నేతల మంత్రిత్వ ఆశలు రేకెత్తించింది.

Andhra Pradesh and Telangana BJP: సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని అధిష్ఠానం ప్రకటించింది. నితిన్ జట్టులోకి తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఇద్దరికే చోటు దక్కింది. ఆ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే. రామ్‌మాధవ్‌కు చోటు దక్కినా ఆయన ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటు లభించలేదు. అంతేకాకుండా మొన్నటి వరకు జాతీయ కార్యవర్గంలో ఉన్న డీకే అరుణకు కూడా చోటు కల్పించలేదు. అయితే ఈ మార్పులు చేర్పులపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలు కాస్త నిరాశ చెందుతుంటే, తెలంగాణకు చెందిన నేతలు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫుల్‌ ఖుష్ అవుతున్నారు. పదవులు రాని వారందరూ ఎందుకు ఆనందపడుతున్నారో చూద్దాం.  

ఏపీలో అన్‌హ్యాపీ- తెలంగాణలో హ్యాపీ

మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఏవైనా సరే ఒక లీడర్‌కు బూస్ట్ ఇస్తాయి. తన ప్రాంతంలో పెట్టు మరింత పెంచుకోవడానికి సహకరిస్తాయి. అందుకే పదవుల కోసం గ్రామస్థాయి లీడర్ నుంచి జాతీయ స్థాయి నాయకుడి వరకు పోటీ పడుతుంటారు. లాబీయింగ్ చేస్తుంటారు. పదవులు రాని వారు మాత్రం విమర్శలు చేస్తారు. ఆలిగి కూర్చుంటారు. మరికొందరు తిరుగుబాటు చేస్తారు. బీజేపీ నేతల ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. త్వరలోనే జరిగే మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అందుకే తమను జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదని సంబరపడిపోతున్నారు. అదే తెలంగాణ నేతల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తే, ఆంధ్రప్రదేశ్ నేతల్లో నిరాశ నింపుతోంది. 

ఏపీ బీజేపీ నేతలకు ఆమాత్యయోగం లేనట్టే!

పార్టీలు ఏ పని చేసినా దాని వెనుక రాజకీయ వ్యూహం కచ్చితంగా ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అదే ఆలోచనతో పావులు కదుపుతోంది. వివిధ స్థాయి పదవులకు నాయకులను ఎంపిక చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి వచ్చే బలం బలగం బీజేపీకి లేదు. అందుకే కూటమితో ప్రయాణం సాగిస్తోంది. అందుకే సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తూనే కూటమిని కూడా కాపాడుకోవాలని ఆలోచనతో వెళ్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కు ఒక మంత్రి పదవి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మంత్రి పదవి ఇచ్చే క్రమంలో లెక్కలు పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పటికే మూడు మంత్రిపదవులు ఆ రాష్ట్రం నుంచే ఉన్నాయి. ఇందులో టీడీపీ లీడర్లు ఇద్దరు అయితే, మూడో వ్యక్తి బీజేపీ నుంచి ఎన్నికైన వ్యక్తే. టీడీపీ నుంచి శ్రీకాకుళం నుంచి ఎన్నికైన రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటే, గుంటూరు నుంచి ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్‌ గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. నరసాపురం నుంచి బీజేపీ గుర్తుపై గెలిచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమల, ఉక్కు శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. 

పురంధేశ్వరిని పోటీ నుంచి తప్పించిన అధిష్ఠానం

ఇప్పుడు ఏపీకి ఇంకో పదవి ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా సీనియర్‌, రాజమండ్రి నుంచి విజయం సాధించిన పురంధేశ్వరి పోటీకి వస్తారు. ఇవ్వాల్సిన మంత్రి పదవి ఈసారి కూటమి పార్టీల్లో ఒకరికి ఇవ్వాల్సిన మోదీ, అమిత్‌షా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలా చేస్తే బీజేపీ కేడర్‌ను నిరాశ పరచినట్టు అవుతుంది. అందుకే జాతీయ కార్యవర్గంలోకి పురంధేశ్వరిని తీసుకున్నారు. ఇప్పుడు ఆమెను మంత్రిపదవి రేసు నుంచి తప్పించారు. దీంతో సమీకరణాలు లెక్కించడం బీజేపీకి, కూటమి పార్టీలకు ఈజీ అవుతుంది. అందుకే ఇది తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఒక్కసారిగా డీలా పడిపోయారు. 

తెలంగాణలో నేతల హ్యాపీకి కారణం!

తెలంగాణలో బీజేపీ నేతలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటున్నారు. ఒక వేళ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించి ఉంటే కచ్చితంగా తమ మంత్రిపదవి ఆశలపై నీళ్లు చల్లినట్టేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎవర్నీ ఎంపిక చేయకపోవడం వారంతా తమ లాబీయింగ్‌ను మరింత తీవ్రం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. అందుకే పార్టీ పదవులతో ఇక్కడి నేతలను డైవర్ట్ చేయలేమని గ్రహించి, వారి మంత్రి పదవుల ఆప్షన్‌ను లైవ్‌లో ఉంచింది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా వారిని తీసుకుంటారనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఇద్దరికి మంత్రిపదవులు ఉన్నాయి. కిషన్ రెడ్డి గనుల శాఖను చూస్తున్నారు. మరో నేత బండి సంజయ్‌ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. వీరితోపాటు ఇంకో మంత్రిపదవి తెలంగాణలు దక్కవచ్చని వార్తలు వస్తున్నాయి. అందుకే వారిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదనే విశ్లేషణ వినిపిస్తోంది. 

విష్ణువర్దన్ రెడ్డి పలుకుబడి!

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ యువ నేత విష్ణువర్దన్ రెడ్డి మాత్రం కాస్త హ్యాపీగా ఉన్నారు. ఆయన కరుడుగట్టిన బీజేపీ లీడరే అయినప్పటికీ ఆయన మనసు వైసీపీలో ఉంటుందని కూటమి నేతలు సెటైర్లు వేస్తుంటారు. అందుకే ఆయన్ని రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులకు కానీ, ఎన్నికల్లో పోటీకి కానీ టీడీపీ, జనసేన అంగీకరించలేదు. నేరుగా ఆయనకు కేంద్రంలో ప్రత్యేక పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. మధ్యేమార్గంగా ఆయన్ని డైరెక్ట్‌గా నబీన్ టీంలోకి తీసుకున్నారు. దీంతో అధిష్ఠానం వద్ద ఆయన పలుకుబడి బాగానే ఉందని ప్రచారం మొదలైంది. ఇది ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు.

Frequently Asked Questions

బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరికి చోటు దక్కింది?

బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది. తెలంగాణ నుంచి ఎవరికీ లభించలేదు, రామ్ మాధవ్ ఢిల్లీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

జాతీయ కార్యవర్గ మార్పులపై తెలంగాణ నేతలు ఎందుకు సంతోషంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నేతలు ఎందుకు నిరాశ చెందుతున్నారు?

త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు దక్కుతుందని తెలంగాణ నేతలు సంతోషిస్తుండగా, మంత్రి పదవి రేసు నుండి తప్పించినందున ఆంధ్రప్రదేశ్ నేతలు నిరాశ చెందుతున్నారు.

పురంధేశ్వరిని జాతీయ కార్యవర్గంలోకి ఎందుకు తీసుకున్నారు?

ఆమెను మంత్రిపదవి రేసు నుండి తప్పించి, కూటమిలోని మరో పార్టీకి అవకాశం కల్పించేందుకు అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది సమీకరణాలను సులభతరం చేస్తుంది.

బీజేపీ జాతీయ కార్యవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డికి చోటు ఎలా లభించింది?

ఆయనకు అధిష్ఠానం వద్ద పలుకుబడి బాగా ఉండటంతో నబీన్ టీంలో నేరుగా చోటు కల్పించారు. ఇది ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP New National Executive: నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
MLC Nagababu Cabinet Rank: కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget