అన్వేషించండి

Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి

డబ్బులకు ఆశపడి ఎమ్మెల్యే టికెట్ వేరే వారికి కేటాయించి తన 48 ఏళ్ల రాజకీయ జీవితాన్ని దెబ్బ తీశారని కాంగ్రెస్ అధిష్టానంపై పార్టీ సీనియర్ నేత జి చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కాంగ్రెస్ టికెట్ల పంపిణీపై చిన్నారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
  • డబ్బు కోసం తన టికెట్‌ను పక్కన పెట్టారని చిన్నారెడ్డి ఆరోపించారు.
  • పార్టీ తప్పులు సరిదిద్దకుంటే జీవన్‌రెడ్డిలా పోరాడతానని హెచ్చరించారు.
  • వనపర్తి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కొత్త టికెట్ హోల్డర్‌పై ఆరోపించారు.

Chinna Reddy Latest News | వనపర్తి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి పార్టీలోని ప్రస్తుత పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ కాంగ్రెస్ జెండా పట్టని వారికి, పదేళ్ల పాటు బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) ప్రభుత్వంలో ఉండి అన్ని రకాల ప్రయోజనాలు పొంది తిరిగి వచ్చిన వారికి పార్టీలో పెద్దపీట వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇదా కాంగ్రెస్ పార్టీ? ఇదా రాజకీయం? అని ప్రశ్నిస్తూ, గన్‌పూర్ వంటి నియోజకవర్గాల్లో కూడా ఇవే తప్పులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

సహనం కోల్పోతే మరో జీవన్ రెడ్డిలా మారతా.. 

కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను భరిస్తూ ఊరుకుంటున్నానిని, ఒకవేళ తాను సహనం కోల్పోతే మరో టి. జీవన్ రెడ్డి కావాల్సి వస్తుందని ఆయన  హెచ్చరించారు. తప్పు చేస్తున్న వారిని పార్టీ వదిలిపెట్టే వరకు పోరాటం చేస్తానన్నారు. పార్టీని నమ్ముకున్న తనలాంటి వారిని కాదని, డబ్బులకు ఆశపడి తన టికెట్‌ను పక్కన పెట్టారని చిన్నారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టికెట్ పొందిన వ్యక్తి (మేఘారెడ్డి) నుంచి డబ్బులకు ఆశపడి తనను పక్కన పెట్టడం ఏంటని ప్రశ్నించారు. 

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని, ఆయనే ముఖ్యమంత్రి అవుతారని తాను నిర్భయంగా చెప్పానని చిన్నారెడ్డి గుర్తు చేశారు. ఆ విషయాన్ని అంత నిర్భయంగా చెప్పిన తనకు ఇంకా భయమెందుకు ఉంటుందన్నారు. అయినప్పటికీ, డబ్బులకు ఆశపడి మరో వ్యక్తికి టికెట్ కేటాయించి, కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం తన 48 ఏళ్ల రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో దెబ్బతీశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

వనపర్తి నియోజకవర్గం నాశనం అయిపోతోందని ఆవేదన

తన వ్యక్తిగత నష్టం పక్కన పెడితే, ఈ నిర్ణయం వల్ల వనపర్తి నియోజకవర్గం పూర్తిగా నాశనమైందని ఆయన పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే, ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా నియమితులయ్యేవాడినని, తద్వారా వనపర్తి నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి జరిగేదని చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీలో తప్పులు చేస్తున్న వారిని బయటకు పంపే వరకు తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసినా పర్వాలేదు కానీ, పార్టీ నైతిక విలువలను కాపాడాలన్నదే తన ఉద్దేశమని చిన్నారెడ్డి పేర్కొన్నారు. 

Also Read: Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

ఎమ్మెల్యేనే అభివృద్ధిని అడ్డుకుంటున్నారా!

నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయని మంత్రులను కలిసి అడిగితే, మీ ఎమ్మెల్యే పనులకు అడ్డుపడుతున్నాడని వినిపిస్తోంది. కాంట్రాక్టులు తన మనుషులకు రాలేదని, పనులు ఆపుతున్నాడని, కాంట్రాక్టులు రద్దు చేయాలని చెప్పాడని మంత్రుల ద్వారా తెలిసిందని చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మేఘారెడ్డి తన అనుచరులను కూడా ఇబ్బంది పెడుతున్నాడని, పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవన్ రెడ్డి లాగా తాను కూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుందని సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.

Frequently Asked Questions

చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంపిణీపై ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు?

గతంలో కాంగ్రెస్ జెండా పట్టని వారికి, బీఆర్ఎస్ నుండి వచ్చిన వారికి పార్టీ పెద్దపీట వేయడంపై చిన్నారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డబ్బులకు ఆశపడి తనలాంటి వారిని కాదని, అనర్హులకు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు.

చిన్నారెడ్డి తన టికెట్‌ను ఎందుకు పక్కన పెట్టారని ఆరోపించారు?

డబ్బులకు ఆశపడి తన టికెట్‌ను పక్కన పెట్టి, మేఘారెడ్డికి కేటాయించారని చిన్నారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీనివల్ల తన 48 ఏళ్ల రాజకీయ జీవితం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీలో తప్పులు చేసే వారిపై చిన్నారెడ్డి ఎలాంటి వైఖరి తీసుకుంటానని హెచ్చరించారు?

తప్పు చేస్తున్న వారిని పార్టీ వదిలిపెట్టే వరకు పోరాటం చేస్తానని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. సహనం కోల్పోతే తానూ టీ. జీవన్ రెడ్డిలా తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు.

వనపర్తి నియోజకవర్గం అభివృద్ధిపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందని చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు?

ఈ నిర్ణయం వల్ల వనపర్తి నియోజకవర్గం పూర్తిగా నాశనమైందని చిన్నారెడ్డి పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే, మంత్రిగా నియమితులై నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి జరిగేదని అభిప్రాయపడ్డారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Embed widget