అన్వేషించండి

రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!

MG Hector Tomahawk EV ఆగస్టు 26న లాంచ్‌ కానుంది. 69.2kWh బ్యాటరీ, 530 కి.మీ. రేంజ్‌, 7 సీట్లతో వచ్చే ఈ ఎలక్ట్రిక్ SUV ధర రూ.18-25 లక్షలు ఉండొచ్చు.

MG Hector Tomahawk EV Price, Range And Features Telugu: ఎలక్ట్రిక్‌ SUVల మార్కెట్‌లోకి JSW MG నుంచి కొత్త & ఆసక్తికరమైన 7 సీటర్‌ ఎలక్ట్రిక్‌ SUV వస్తోంది. ఆ మోడల్‌.. Hector Tomahawk EV. ఆగస్టు 26న ఈ కొత్త SUVని లాంచ్‌ చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. లాంచ్‌కు ముందే ఈ కారు ఎలాంటి ముసుగు లేకుండా రోడ్లపై కనిపించింది. దీంతో, ఈ కారు తుది డిజైన్‌ ఎలా ఉంటుందన్నది లాంచ్‌కు ముందే దాదాపు స్పష్టంగా తెలిసిపోయింది.

Hector కంటే పై స్థాయి
Hector Tomahawkను, కంపెనీ తన ప్రస్తుత Hector కంటే పై ర్యాంక్‌లో లాంచ్‌ చేస్తుంది. ఈ మోడల్‌ మొదట పూర్తిగా ఎలక్ట్రిక్‌ రూపంలో మార్కెట్లోకి వస్తుంది. ఆ తర్వాత PHEV వెర్షన్‌ను కూడా వస్తుంది. ADAPT అనే కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందుతున్న తొలి JSW MG మోడల్‌ ఇదే కానుంది.

డిజైన్‌ ఎలా ఉంది?
కవరింగ్‌ లేకుండా కనిపించిన టెస్ట్‌ కారును చూస్తే, Hector Tomahawk డిజైన్‌ చాలా ప్రత్యేకంగా ఉంది. ముందు భాగంలో రెండు LED హెడ్‌ల్యాంప్స్‌, వాటిని కలుపుతూ LED DRLs ఉన్నాయి. వీటి మధ్యలో MG లోగో కనిపిస్తుంది. మధ్య భాగంలో రెండు వెండి రంగు పట్టీలతో నల్లటి ట్రిమ్‌ ఉంది.

ఇది ఎలక్ట్రిక్‌ కారు కావడంతో సంప్రదాయ గ్రిల్‌ స్థానంలో క్లోజ్డ్‌ డిజైన్‌ ఇచ్చారు. కింద భాగంలో దీర్ఘచతురస్రాకార ఎయిర్‌ ఇన్‌లెట్‌ ఉంది. ముందు బంపర్‌ డ్యూయల్‌ టోన్‌ డిజైన్‌లో కనిపిస్తుంది. ఇరువైపులా నిలువు ఎయిర్‌ కర్టెన్లు ఉన్నాయి.

సైడ్‌ ప్రొఫైల్‌ చాలా నీట్‌గా కనిపిస్తుంది. క్రోమ్‌ డోర్‌ హ్యాండిల్స్‌, క్రోమ్‌ విండో లైన్‌ ఉన్నాయి. వెనుక వైపు విండో లైన్‌ పైకి వంగినట్లు కనిపిస్తుంది. వీల్‌ ఆర్చ్‌లు & డోర్‌ సిల్స్‌ చుట్టూ బ్లాక్‌ క్లాడింగ్‌ ఇచ్చారు. పెద్ద డ్యూయల్‌ టోన్‌ అల్లాయ్‌ వీల్స్‌ కూడా ఆకట్టుకుంటాయి.

ఇది కూడా చదవండి: టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు

7 సీట్లతో విశాలమైన క్యాబిన్‌
Hector Tomahawkను ఇండోనేషియాలో విక్రయిస్తున్న Wuling Eksion ఆధారంగా రూపొందిస్తున్నారు. దీని పొడవు 4,745mm, వెడల్పు 1,850mm, ఎత్తు 1,755mm, వీల్‌బేస్‌ 2,810mmగా ఉండొచ్చని అంచనా. దీంతో క్యాబిన్‌లో మంచి స్పేస్‌ లభించే అవకాశం ఉంది.

ఇప్పటికే వెల్లడైన సమాచారం ప్రకారం, క్యాబిన్‌ బీజ్‌ కలర్‌లో ఉంటుంది. డ్యాష్‌బోర్డ్‌ వివరాలను కంపెనీ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. అయితే సింపుల్‌ డిజైన్‌, డ్రైవర్‌ డిస్‌ప్లే & ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, రెండు స్పోక్‌ల స్టీరింగ్‌ వీల్‌ ఉండొచ్చని తెలుస్తోంది.

ఫీచర్లకు కొదవ ఉండదు
Hector Tomahawkలో పవర్డ్‌ టెయిల్‌గేట్‌, లెదరెట్‌ సీట్లు, పవర్డ్‌ & వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు ఉండొచ్చని అంచనా. 12.8 అంగుళాల టచ్‌స్క్రీన్‌, 8.8 అంగుళాల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, 50W వైర్‌లెస్‌ ఛార్జర్‌ వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.

రెండు & మూడు వరుసలకు AC వెంట్స్‌తో ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ & ADAS భద్రతా వ్యవస్థలు కూడా అందించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి

530 కి.మీ. వరకు రేంజ్‌?
Hector Tomahawk EV పవర్‌ట్రెయిన్‌ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీనికి ఆధారంగా ఉన్న Wuling Eksionలో 69.2kWh LFP బ్యాటరీ ఉంది. ఇది CLTC ప్రమాణాల ప్రకారం 530 కి.మీ. వరకు రేంజ్‌ ఇస్తుంది. ఈ బ్యాటరీతో ముందు భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్‌ మోటార్‌ 201hp పవర్‌ & 310Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 160 కి.మీ. Hector Tomahawkలోనూ ఇలాంటి స్పెసిఫికేషన్లు ఉండొచ్చని అంచనా.

ధర ఎంత ఉండొచ్చు?
Hector Tomahawk EV ధర రూ.18-25 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్య ఉండొచ్చని అంచనా. మార్కెట్లోకి వచ్చిన తర్వాత Mahindra XEV 9S & Kia Carens Clavis EVలకు ఇది పోటీ ఇవ్వనుంది. బ్యాటరీ, మోటార్‌, రేంజ్‌ & ఫీచర్లపై పూర్తి వివరాలు ఆగస్టు 26న అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget