అన్వేషించండి

యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?

కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన 2026 Bajaj Pulsar N160 ఇప్పుడు ఐదు వేరియంట్లలో లభిస్తోంది. ధర, ఇంజిన్‌, బ్రేకులు, ABS, ట్రాక్షన్‌ కంట్రోల్‌ వంటి తేడాలు తెలుసుకోండి.

2026 Bajaj Pulsar N160 Price And Features Telugu: బజాజ్‌ పల్సర్‌ N160లో కొత్త మార్పులు వచ్చాయి. కొత్త 4V ఇంజిన్‌తో N160 S & N160 SS వేరియంట్లను కంపెనీ తీసుకొచ్చింది. దీంతో ఈ మోడల్‌ ఇప్పుడు మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే అన్ని వేరియంట్లు ఒకేలా ఉండవు. ఇంజిన్‌, బ్రేకింగ్‌, ABS, ట్రాక్షన్‌ కంట్రోల్‌, డిస్‌ప్లే వంటి అంశాల్లో తేడాలు ఉన్నాయి. అందుకే, మీ బడ్జెట్‌కు & అవసరాలకు ఏ వేరియంట్‌ సరిపోతుందో తెలుసుకోవడం ముఖ్యం.

ప్రస్తుతం N160లో రెండు రకాల ఇంజిన్లు ఉన్నాయి. పాత 2V ఇంజిన్‌ 164.9cc సామర్థ్యంతో ఉంటుంది. ఇది 16hp పవర్‌ & 14.65Nm టార్క్‌ అందిస్తుంది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది.

కొత్త 4V ఇంజిన్‌ 164.5cc సామర్థ్యంతో ఉంటుంది. ఇది ఆయిల్‌ కూలింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 18.5hp పవర్‌ & 14.4Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ N160 S & N160 SS వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.

ఐదు వేరియంట్లలోనూ కొన్ని ఫీచర్లు కామన్‌గా ఉన్నాయి. ఫ్రేమ్‌, అసిస్ట్‌ & స్లిప్పర్‌ క్లచ్‌, Bluetooth కనెక్టివిటీ, పూర్తి LED లైటింగ్‌ & USB-C పోర్ట్‌ స్టాండర్డ్‌గా వస్తాయి.

ఇది కూడా చదవండి: ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc

Pulsar N160 2V వేరియంట్లు

2V ఇంజిన్‌తో వచ్చే N160 మూడు వేరియంట్లలో ఉంటుంది. వీటిలో USD ఫోర్క్‌ కామన్‌గా ఉంటుంది. ప్రధానంగా బ్రేకింగ్‌ సిస్టమ్‌ & సీటింగ్‌ విషయంలోనే తేడాలు ఉంటాయి.

బేస్‌ వేరియంట్‌ సింగిల్‌ డిస్క్‌ బ్రేక్‌ & సింగిల్‌ సీటుతో వస్తుంది. దీని ధర రూ.1.22 లక్షలు. తర్వాతి వేరియంట్‌లో ట్విన్‌ డిస్క్‌ బ్రేకులు & సింగిల్‌ సీటు ఉంటాయి. దీని ధర రూ.1.25 లక్షలు.

మూడో వేరియంట్‌లో ట్విన్‌ డిస్క్‌ బ్రేకులు & స్ప్లిట్‌ సీటు లభిస్తాయి. దీని ధర రూ.1.31 లక్షలు.

మిడ్‌ వేరియంట్‌లో, బేస్‌ మోడల్‌తో పోలిస్తే, వెనుక డిస్క్‌ బ్రేక్‌ & రియర్‌ లిఫ్‌-ఆఫ్‌ ప్రొటెక్షన్‌ వంటి అదనపు సదుపాయాలు ఉంటాయి.

టాప్‌ 2V వేరియంట్‌లో మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. డ్యూయల్‌-ఛానల్‌ ABS, ట్రాక్షన్‌ కంట్రోల్‌, 300mm ఫ్రంట్‌ డిస్క్‌, అదనంగా 10mm రియర్‌ మోనోషాక్‌ ట్రావెల్‌ & హెడ్‌ల్యాంప్‌లో LED DRLs ఉన్నాయి. మిగిలిన రెండు వేరియంట్లలో 280mm ఫ్రంట్‌ డిస్క్‌ ఉంటుంది.

ఇది కూడా చదవండి: మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!

Pulsar N160 S

కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన N160 S బేస్‌ వేరియంట్‌ ఇది. దీని ధర రూ.1.33 లక్షలు. ఇందులో 37mm USD ఫ్రంట్‌ ఫోర్క్‌, రైడ్‌-బై-వైర్‌ థ్రాటిల్‌, క్రాల్‌ టెక్‌, అధునాతన రైడ్‌ మోడ్‌లు & కొత్త 5 అంగుళాల LCD ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉన్నాయి. 

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పాత 2V ఇంజిన్‌ టాప్‌ వేరియంట్‌తో పోలిస్తే N160 Sలో కొన్ని ఫీచర్లు తగ్గాయి. ట్రాక్షన్‌ కంట్రోల్‌ లేదు. LED DRLs కూడా లేవు. ఫ్రంట్‌ డిస్క్‌ 280mmకు పరిమితమైంది. అంతేకాదు, సింగిల్‌-ఛానల్‌ ABS మాత్రమే ఉంటుంది. అంటే రూ.2,000 అదనంగా చెల్లించినా కొన్ని ఫీచర్లు కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ఈ వేరియంట్‌ను ఎంచుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

Pulsar N160 SS

కొత్త 4V ఇంజిన్‌లో టాప్‌ వేరియంట్‌ N160 SS. దీని ధర రూ.1.42 లక్షలు. N160 Sతో పోలిస్తే రూ.9,000 ఎక్కువ. అయితే అదనపు ధరకు తగిన ఫీచర్లు కూడా వస్తాయి. 

ఇందులో ట్రాక్షన్‌ కంట్రోల్‌, 300mm ఫ్రంట్‌ డిస్క్‌, డ్యూయల్‌-ఛానల్‌ ABS & LED DRLs తిరిగి వస్తాయి. S వేరియంట్‌లోని 5 అంగుళాల LCDకు బదులుగా TFT డిస్‌ప్లే ఉంటుంది. Wi-Fi సపోర్ట్‌ కూడా ఉంది.

Wi-Fi మాడ్యూల్‌ ద్వారా Google Mapsను డిస్‌ప్లేలో మిర్రర్‌ చేసుకోవచ్చు. బజాజ్‌ చెప్పిన ప్రకారం ఇది ఈ విభాగంలో తొలిసారి లభిస్తున్న ఫీచర్‌. N160 SSలో ప్రత్యేకంగా రియర్‌ రేడియల్‌ టైర్‌ కూడా ఉంటుంది.

ఏ వేరియంట్‌ కొనాలి?

మీకు బడ్జెట్‌ ప్రధాన అంశమైతే బేస్‌ N160 సరిపోతుంది. తక్కువ ధరలోనే 2V ఇంజిన్‌ & అవసరమైన ఫీచర్లు లభిస్తాయి. అయితే ఎక్కువ ఫీచర్లు, మెరుగైన భద్రత & కొత్త 4V ఇంజిన్‌ కావాలంటే N160 SSపై దృష్టి పెట్టడం మంచిది.

N160 S కంటే SS రేటు రూ.9,000 ఎక్కువ. కానీ ట్రాక్షన్‌ కంట్రోల్‌, డ్యూయల్‌-ఛానల్‌ ABS, 300mm డిస్క్‌, LED DRLs, TFT డిస్‌ప్లే, Wi-Fi & Google Maps మిర్రరింగ్‌ వంటి అదనపు ఫీచర్లు లభిస్తాయి. అందువల్ల కొత్త 4V ఇంజిన్‌ రేంజ్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకునేవాళ్లకు N160 SS బెస్ట్‌ ఆప్షన్‌ కాగలదు.

*అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్‌ ధరలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
బజాజ్ చేతక్ EVని ఇంటికి తెచ్చుకోవడానికి లోన్‌ ఫెసిలిటీ.. కనీస డౌన్‌పేమెంట్‌, EMI పూర్తి వివరాలు
Bajaj Chetak C2501 ఎలక్ట్రిక్ స్కూటర్‌.. నెలకు కేవలం రూ.1500 EMIతో మీ సొంతం!
చలికాలంలో కారు తీసుకుని బయటకు వెళ్తున్నారా? ఈ 5 యాక్సెసరీస్ ఉంటే టెన్షన్ ఉండదు!
ఈ చలికాలంలో కారు డ్రైవింగ్ సేఫ్‌గా సాగాలంటే.. ఈ 5 యాక్సెసరీస్ తప్పనిసరి!
గూగుల్‌ మ్యాప్స్‌ మిర్రరింగ్‌ ఉన్న 8 బైక్‌లు.. పూర్తిగా కొత్త ప్రదేశంలోనూ ఈజీగా దారి తెలుసుకోవచ్చు!
బైక్‌ స్కీన్‌పైనే గూగుల్‌ మ్యాప్‌ కనిపిస్తుంది.. ధర కేవలం రూ.1 లక్షల నుంచి స్టార్ట్‌!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
Embed widget