అన్వేషించండి

పెరిగింది రూ.15 వేలే.. కానీ కొత్త Ducati Monsterలో వచ్చిన మార్పులు ఇవీ!

Ducati కొత్త Monster V2లో 890cc V2 ఇంజిన్, కొత్త ఛాసిస్, తక్కువ బరువు, 5 అంగుళాల TFT వంటి మార్పులు చేసింది. ధర రూ.13.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

New Ducati Monster Price And Features Telugu: డుకాటీ, తన మాన్‌స్టర్‌లో భారీ మార్పులు చేసింది. కొత్త 890cc V2 ఇంజిన్‌తో వచ్చిన Monster V2.. పాత 937cc Monster కంటే చాలా భిన్నంగా ఉంది. ఇంజిన్ మార్పుతో పాటు ఛాసిస్, బరువు, డిజైన్, సీటు ఎత్తు & ఎలక్ట్రానిక్ ఫీచర్లలోనూ మార్పులు చేశారు.

ఇక్కడ పాత Monster అంటే 2024 మోడల్ 937cc వెర్షన్. కొత్త Monster అంటే 2026 మోడల్ 890cc Monster V2. ఈ రెండు మోడళ్ల మధ్య ప్రధాన తేడాలు ఏంటో చూద్దాం.

కొత్త 890cc ఇంజిన్

పాత Monsterలో 937cc V2 ఇంజిన్ ఉండేది. కొత్త Monster V2లో 890cc V2 ఇంజిన్‌ను తీసుకొచ్చారు. ఇదే ఇంజిన్ Multistrada V2, Panigale V2 & Streetfighter V2 మోడళ్లలోనూ ఉంది.

ఇంజిన్ సామర్థ్యం తగ్గినా పవర్ మాత్రం తగ్గలేదు. కొత్త మోడల్ 111hp పవర్‌ను 9,000rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్ కూడా 111hp పవర్ ఇస్తుంది. అయితే అది 9,250rpm వద్ద ఈ పవర్‌ను అందిస్తుంది.

టార్క్ విషయంలో మాత్రం స్వల్ప తగ్గుదల ఉంది. కొత్త Monster 91.1Nm టార్క్‌ను 7,250rpm వద్ద ఇస్తుంది. పాత Monster 93Nm టార్క్‌ను 6,500rpm వద్ద అందించేది.

ఇది కూడా చదవండి: సింగిల్‌ ఛార్జ్‌తో 145 కి.మీ. హ్యాపీగా తిరిగిరావచ్చు.. కొత్త BGauss OoWah MAX Plus‌లో స్పెషల్ ఫీచర్లు!

కొత్త ఛాసిస్

ఇంజిన్‌తో పాటు ఛాసిస్‌లోనూ పెద్ద మార్పు చేశారు. పాత మోడల్‌లో ఉన్న అల్యూమినియం ఛాసిస్ స్థానంలో కొత్త Monster V2లో మోనోకోక్ ఛాసిస్‌ను తీసుకొచ్చారు. దీని వల్ల బైక్ బరువు కూడా తగ్గింది.

కొత్త Monster V2 బరువు 175 కిలోలు. పాత మోడల్ బరువు 179 కిలోలు. అంటే కొత్త బైక్ 4 కిలోలు తేలికగా ఉంది. బరువు తగ్గడం వల్ల పవర్-టు-వెయిట్ నిష్పత్తి కూడా మెరుగుపడింది.

డిజైన్‌లో మార్పులు

కొత్త Monster V2లో అత్యంత స్పష్టంగా కనిపించే మార్పు ఇంధన ట్యాంక్ డిజైన్. పాత Monsterలో ఉన్న డిజైన్‌కు భిన్నంగా కొత్త మోడల్‌లో పెద్ద ట్యాంక్ ఆకారాన్ని గుర్తు చేసే ‘బైసన్-బ్యాక్’ డిజైన్‌ ఇచ్చారు.

అయితే ఇంధన ట్యాంక్ సామర్థ్యంలో మార్పు లేదు. రెండు మోడళ్లలోనూ 14 లీటర్ల ట్యాంక్ ఉంది.

సీటు ఎత్తును కూడా తగ్గించారు. కొత్త Monster V2 సీటు ఎత్తు 815mm. పాత మోడల్‌లో ఇది 820mm. కొత్త సీటు మరింత సన్నగా ఉండటంతో తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు కూడా కొత్త బైక్ కొంత సౌకర్యంగా ఉండొచ్చు.

కొత్త అల్లాయ్ వీల్స్‌తో పాటు హెడ్‌లైట్ డిజైన్‌లోనూ స్వల్ప మార్పులు ఉన్నాయి. టైర్ సైజులు మాత్రం మారలేదు. ముందు 120/70 R17, వెనుక 180/55 R17 టైర్లను కొనసాగించారు. అయితే కొత్త మోడల్‌లో Pirelli Rosso IV టైర్లు ఉన్నాయి. పాత మోడల్‌లో Rosso III టైర్లు ఉండేవి.

ఇది కూడా చదవండి: R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు

ఎలక్ట్రానిక్ ఫీచర్లు

రైడింగ్ ఎయిడ్స్ విషయంలో పెద్ద మార్పులు లేవు. కొత్త Monster V2లో Sport, Road & Wet రైడ్ మోడ్‌లు ఉన్నాయి. Low, Medium & High పవర్ మోడ్‌లు కూడా కొనసాగుతున్నాయి.

ట్రాక్షన్ కంట్రోల్ & వీలీ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే బై-డైరెక్షనల్‌ క్విక్‌షిఫ్టర్‌ను కొత్త మోడల్‌లో అప్‌డేట్ చేశారు.

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పరిమాణం కూడా పెరిగింది. పాత మోడల్‌లో 4.3 అంగుళాల TFT స్క్రీన్ ఉండగా.. కొత్త Monster V2లో 5 అంగుళాల TFT స్క్రీన్‌ను అందించారు.

రంగుల్లోనూ మార్పులు

కొత్త Monster V2లో రంగుల ఎంపికలో స్వల్ప మార్పులు ఉన్నాయి. పాత మోడల్‌లో ఉన్న Aviator Grey రంగును నిలిపివేశారు. Racing Red వీల్స్ స్థానంలో Iceberg White రంగును తీసుకొచ్చారు. అదనంగా Sport Livery అనే కొత్త రంగును అందిస్తున్నారు.

ధర ఎంత?

మార్పులు చాలా ఉన్నప్పటికీ కొత్త Ducati Monster V2 ధర భారీగా పెరగలేదు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.13.99 లక్షలు. పాత మోడల్‌తో పోలిస్తే ఇది కేవలం రూ.15,000 ఎక్కువ.

Ducati Red వేరియంట్ ధర రూ.13.99 లక్షలు. Iceberg White & Sport Livery రంగుల ధర రూ.14.23 లక్షలు.

Monster+ V2 కూడా అందుబాటులో ఉంది. ఇందులో హెడ్‌లైట్ కౌల్ & పిలియన్ సీట్ కవర్ అదనంగా లభిస్తాయి. దీని ధర Ducati Red రంగులో రూ.14.34 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. Iceberg White & Sport Livery రంగుల ధర రూ.14.45 లక్షలు.

మొత్తంగా చూస్తే.. కొత్త Ducati Monster V2లో కేవలం ఇంజిన్ మాత్రమే మారలేదు. ఛాసిస్, బరువు, డిజైన్, సీటు ఎత్తు, టైర్లు, TFT స్క్రీన్ & క్విక్‌షిఫ్టర్‌లోనూ మార్పులు చేశారు. ధర మాత్రం రూ.15,000 మాత్రమే పెరగడం ఈ కొత్త మోడల్‌లో ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pre-Owner Vehicle Transfer: యూజ్డ్ కార్ల ట్రాన్స్‌ఫర్‌ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో ఈజీ.. తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు, అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్‌ టాప్.. చివరి స్థానం ఏ రాష్ట్రానిదంటే?
Honda Bikes ADAS: బైకుల్లో కూడా అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు.. హోండా కొత్త Sensing Ride సిస్టమ్ ప్రత్యేకతలు ఇవే
హోండా బైక్‌లో ADAS టెక్నాలజీ.. ఏకంగా 10 రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Hyundai Bluelink Insurance: హ్యుందాయ్ బ్లూలింక్‌ కస్టమర్లకు బీమా బెనిఫిట్స్‌... డ్రైవింగ్ స్కోర్ ఆధారంగా అదనపు ప్రయోజనాలు
మీ డ్రైవింగ్ అలవాట్లతో కారు ఇన్సూరెన్స్ ఖర్చు తగ్గించుకోవచ్చు.. హ్యుందాయ్ కొత్త UBI ప్రోగ్రామ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Politics: ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
RTC Metro Combined Pass: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
Kandula Durgesh: మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
Bigg Boss Season 10 Today November 6th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీకి ఫుల్ సపోర్ట్.. కెప్టెన్‌గా ఎన్నిక! సంచాలక్‌గా నరేశ్ ఆ టీమ్‌కి అన్యాయం చేశాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీకి ఫుల్ సపోర్ట్.. కెప్టెన్‌గా ఎన్నిక! సంచాలక్‌గా నరేశ్ ఆ టీమ్‌కి అన్యాయం చేశాడా!
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Embed widget