అన్వేషించండి

సింగిల్‌ ఛార్జ్‌తో 145 కి.మీ. హ్యాపీగా తిరిగిరావచ్చు.. కొత్త BGauss OoWah MAX Plus‌లో స్పెషల్ ఫీచర్లు!

BGauss కొత్త OoWah MAX Plus ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.1.23 లక్షలకు విడుదల చేసింది. 3kWh LFP బ్యాటరీ, 145 కి.మీ. క్లెయిమ్డ్ రేంజ్, 60 kmph టాప్ స్పీడ్ ఉన్నాయి.

BGauss OoWah MAX Plu Price, Range And Features Telugu: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవాళ్లకు BGauss గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కంపెనీ, కొత్త OoWah MAX Plus స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.23 లక్షలు. ఇప్పటికే ఉన్న OoWah EX కంటే ఇది పైస్థాయిలో ఉంటుంది.

పట్టణాలు &నగర ప్రాంతాల్లో డైలీ జర్నీని సులభంగా మార్చే లక్ష్యంగా ఈ స్కూటర్‌ను రూపొందించినట్లు BGauss తెలిపింది. ముఖ్యంగా తొలిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవాళ్లను, యువతను దృష్టిలో పెట్టుకుని దీన్ని డిజైన్‌ చేసినట్లు వెల్లడించింది.

పెద్ద బ్యాటరీ
OoWah MAX Plusలో ప్రధాన మార్పు బ్యాటరీ. ప్రస్తుతం ఉన్న OoWah EXలో ఉన్న బ్యాటరీ కంటే 0.7kWh ఎక్కువ సామర్థ్యంతో 3kWh LFP బ్యాటరీని ఇందులో అందించారు. ఈ బ్యాటరీని స్కూటర్‌ నుంచి విడదీసి ఇంటిలోకి తీసుకెళ్లి ఛార్జ్ చేసుకోవచ్చు. 

రేంజ్‌
ARAI ధ్రువీకరించిన క్లెయిమ్డ్ రేంజ్ 145 కి.మీ.

స్కూటర్‌లో PMSM హబ్ మోటార్‌ను కొనసాగించారు. దీని పీక్‌ పవర్‌ 2.4kW కాగా, కంటిన్యుయస్‌ పవర్‌ 1.5kW. బ్యాటరీ సామర్థ్యం పెరిగినా గరిష్ట వేగంలో మార్పు లేదు. గంటకు 60 కి.మీ. టాప్ స్పీడ్‌ను ఇది అందిస్తుంది.

బ్యాటరీ & మోటార్ రెండింటికీ IP67 రేటింగ్ ఉంది. బ్యాటరీ CAN టెక్నాలజీతో పనిచేస్తుంది. దీని ద్వారా బ్యాటరీ & వాహనం మధ్య నిరంతరం సమాచార మార్పిడి జరుగుతుందని కంపెనీ చెబుతోంది.

ఇది కూడా చదవండి: E20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లకు ముప్పే! కార్‌ కంపెనీల తనిఖీల్లో సంచలన విషయాలు

750W ఛార్జర్ ఉచితం
OoWah MAX Plusతో 750W ఛార్జర్‌ను అదనపు ధర లేకుండా అందిస్తున్నారు. ఈ ఛార్జర్‌తో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3 గంటల 30 నిమిషాలు పడుతుంది. పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటల 55 నిమిషాలు పడుతుంది.

1,350W ఛార్జర్‌తో 100 శాతం ఛార్జింగ్‌ను 2 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని కంపెనీ స్పెసిఫికేషన్ షీట్‌లో పేర్కొంది. ఈ ఛార్జర్ ధర & అందుబాటుపై స్పష్టత లేదు.

OoWah EXతో పోలిస్తే ఈ కొత్త స్కూటర్‌లోని కొలతల్లోనూ పెద్దగా మార్పులు లేవు. సీటు ఎత్తు 765mm & గ్రౌండ్ క్లియరెన్స్ 160mm. అయితే పెద్ద బ్యాటరీ కారణంగా కర్బ్ వెయిట్‌ 104 కిలోలకు పెరిగింది, OoWah EX బరువు 97 కిలోలు. సీటు కింద 21 లీటర్ల స్టోరేజ్ స్థలం ఉంది.

కొత్త ఫీచర్లు
రివర్స్ అసిస్ట్, డిస్టెన్స్ టు ఎంప్టీ వంటి కొత్త ఫీచర్లను ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో చేర్చారు. OoWah MAX Plusలో అన్ని లైట్లు LED. డ్రమ్ బ్రేకులు, CBS వంటి ఫీచర్లు ఉన్నాయి. లింప్ హోమ్ మోడ్ & USB ఛార్జింగ్ సదుపాయం కూడా అందించారు.

వాహనం & ఛార్జర్‌పై 3 సంవత్సరాలు లేదా 36,000 కి.మీ. వారంటీ ఇస్తున్నారు. బ్యాటరీపై 3 సంవత్సరాలు లేదా 50,000 కి.మీ. వారంటీ ఉంది. ఈ వారంటీని 5 సంవత్సరాలు లేదా 75,000 కి.మీ. వరకు పొడిగించుకునే అవకాశం ఉంది.

ధర & కలర్ ఆప్షన్లు
BGauss OoWah MAX Plus ధర రూ.1.23 లక్షలు. ఇది ఎక్స్-షోరూమ్ ధర. 

ఇది కూడా చదవండి: R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు

రంగులు
ఎమరాల్డ్ షాడో, జామున్ పంచ్, ట్యాంగీ టోమా & జెస్టీ రెడ్ రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది.

OoWah EX కూడా ఇప్పుడు మార్కెట్లో అమ్ముడవుతోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.94,990. EX మోడల్‌ కూడా ఇదే నాలుగు రంగుల్లో లభిస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Embed widget