అన్వేషించండి

Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి

Honda Amaze కొనాలనుకుంటున్నారా? వెనుక సీటు సౌకర్యం, బూట్ స్పేస్, ADAS వంటి ప్లస్‌లతో పాటు పనితీరు, ఇన్సులేషన్, ధర వంటి అన్ని విషయాలు తెలుసుకోండి.

Honda Amaze Price And Features Telugu: భారత కార్ల మార్కెట్‌లో, 4 మీటర్ల లోపు సెడాన్‌ల విభాగంలో మారుతి డిజైర్ ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే హోండా అమేజ్ కూడా ఈ కారుకు గట్టి పోటీ ఇస్తోంది. కారు లోపల తగినంత స్థలం, సౌకర్యవంతమైన వెనుక సీట్లు, ఆధునిక భద్రత ఫీచర్లతో ఇది ఆకట్టుకుంటోంది. అయితే, అమేజ్‌లో ప్లస్‌ పాయింట్లతో పాటు కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి.

హోండా కంపెనీ మన దేశంలో రెండో తరం & మూడో తరం అమేజ్ మోడళ్లను విక్రయిస్తోంది. అయితే, మూడో తరం మోడల్‌నే మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం. హోండా కార్లలో అత్యంత అందుబాటు ధరలో లభించే మోడల్ ఇదే. దీని ధర రూ.7.65 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. మరి ఈ కారును కొనడం సరైన నిర్ణయమేనా?

కొనడానికి కారణం నంబర్ 1: వెనుక సీట్లలో మంచి సౌకర్యం

హోండా అమేజ్ వెనుక సీట్లు ప్రయాణికులకు మంచి సౌకర్యాన్ని అందిస్తాయి. ముఖ్యంగా రెండు వైపుల సీట్లకు మంచి సపోర్ట్ ఉంటుంది. బ్యాక్‌రెస్ట్ కోణం కూడా సౌకర్యంగా ఉంటుంది.

వెనుక సీట్లలో లెగ్‌రూమ్ & నీరూమ్ కూడా ఉపయోగకరంగా ఉన్నాయి. ముందు సీట్ల వెనుక భాగంలో ప్రత్యేకంగా ఇచ్చిన స్థలం వల్ల ఈ స్పేస్‌ లభిస్తోంది. వెనుక కూర్చున్న ప్రయాణికుల కోసం ఏసీ వెంట్స్, కప్‌హోల్డర్లతో కూడిన సెంటర్ ఆర్మ్‌రెస్ట్ ఉన్నాయి. ముగ్గురు ప్రయాణికులకు ప్రత్యేక హెడ్‌రెస్ట్‌లు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం

బూట్ స్పేస్ కూడా అమేజ్‌కు మరో బలం. ఇందులో 416 లీటర్ల బూట్ సామర్థ్యం ఉంది. ఈ విభాగంలోని చాలా కార్లతో పోలిస్తే ఇది పెద్దది. మారుతి డిజైర్ & హ్యుందాయ్ ఆరా కంటే ఎక్కువ సామాను తీసుకెళ్లే అవకాశం ఉంది.

కొనడానికి కారణం నంబర్ 2: రోజువారీ వినియోగానికి సులభం

అమేజ్ క్యాబిన్‌ లేత రంగుల కలయికతో ఉంటుంది. పెద్ద గ్లాస్ ఏరియా & తక్కువ ఎత్తులో ఉండే డ్యాష్‌బోర్డ్ వల్ల లోపలి భాగం విశాలంగా కనిపిస్తుంది. ఫిట్ & ఫినిష్ కూడా ఈ కారు ప్లస్ పాయింట్లలో ఒకటి.

స్టీరింగ్ తేలికగా ఉంటుంది. క్లచ్ కూడా సులభంగా ఆపరేట్ చేయవచ్చు. టైట్‌ టర్నింగ్ రేడియస్ ఉండటం వల్ల నగర ట్రాఫిక్‌లో కారు నడపడం సులభం. మాన్యువల్ గేర్‌బాక్స్ కూడా ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది.

CVT వేరియంట్ ఎంచుకుంటే డ్రైవింగ్ మరింత సౌకర్యవంతంగా మారుతుంది. ఇందులో ప్యాడిల్ షిఫ్టర్లు ఉన్నాయి. ఇంజిన్ బ్రేకింగ్ అవసరమైనప్పుడు ఇవి ఉపయోగపడతాయి. ఏసీ నియంత్రణల కోసం ఫిజికల్‌ బటన్లు ఉండటం కూడా ఉపయోగకరం.

ఇది కూడా చదవండి: 27 కిలోమీటర్ల మైలేజీ ఇస్తూ తక్కువ ధరకే లభించే కారు గురించి తెలుసా? అందుకే జనం ఎగబడుతున్నారా?

కొనడానికి కారణం నంబర్ 3: ADAS సేఫ్టీ ఫీచర్లు

ఈ విభాగంలో అమేజ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే ఫీచర్ ADAS. టాప్ స్పెక్ ZX వేరియంట్‌లో హోండా సెన్సింగ్ ADAS వ్యవస్థ అందుబాటులో ఉంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్ & ఆటోమేటిక్ హై బీమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అదనంగా LaneWatch కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పై కెమెరా దృశ్యాన్ని చూపిస్తుంది.

ఎందుకు వద్దు?

కారణం నంబర్ 1: క్యాబిన్ ఇన్సులేషన్ అంతంతమాత్రమే

అమేజ్‌లో.. ఇంజిన్ శబ్దంతో పాటు రోడ్డు శబ్దం కూడా క్యాబిన్‌ లోపలికి ఎక్కువగా వస్తుంది. బయట పరిసరాల శబ్దాలు కూడా క్యాబిన్‌లో వినిపిస్తాయి. దీంతో ప్రయాణ సమయంలో ప్రశాంతమైన అనుభూతి కొంత తగ్గుతుంది.

కారణం నంబర్ 2: పనితీరు ఆశించిన స్థాయిలో లేదు

అమేజ్‌లో 1.2 లీటర్, ఫోర్‌-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది ఎక్కువ ఆర్‌పీఎంలో మెరుగ్గా పనిచేస్తుంది. అయితే తక్కువ వేగంలో ఇంజిన్ స్పందన అంత బలంగా ఉండదు. ముఖ్యంగా 2,000 ఆర్‌పీఎం కంటే తక్కువ వద్ద పవర్ తక్కువగా అనిపిస్తుంది.

ట్రాఫిక్‌లో తరచుగా గేర్లు మార్చాల్సి రావచ్చు. స్పీడ్ బ్రేకర్లను దాటిన తర్వాత వేగం పెంచేటప్పుడు కూడా డౌన్‌షిఫ్ట్ అవసరం అవుతుంది. CVT వేరియంట్ ఈ సమస్యను కొంతవరకు తగ్గిస్తుంది. అయితే వేగంగా యాక్సిలరేట్ చేస్తే CVTలో ఉండే రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది.

సాఫ్ట్ సస్పెన్షన్ వల్ల, ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు కారు కింద భాగం పెద్ద స్పీడ్ బ్రేకర్లకు తగిలే ప్రమాదం ఉంటుంది. మలుపుల్లో బాడీ రోల్ కూడా తెలుస్తుంది.

కారణం నంబర్ 3: ప్రత్యర్థుల కంటే ధర ఎక్కువ

అమేజ్ టాప్ వేరియంట్ ధర ఈ విభాగంలో ఎక్కువగా ఉంది. టాప్ స్పెక్ మారుతి డిజైర్‌తో పోలిస్తే అమేజ్ సుమారు రూ.64,000 ఎక్కువ.

అయితే అమేజ్‌లో ADAS వంటి అధునాతన ఫీచర్లు ఉండటం ఈ అధిక ధరకు కొంత కారణం. అయినప్పటికీ ఈ ధరలో 360 డిగ్రీ కెమెరా & పవర్డ్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఉండాల్సింది. అమేజ్‌లో Type-C USB పోర్టులు కూడా లేవు. Type-A పోర్టులు & 12V సాకెట్లు మాత్రమే ఉన్నాయి.

మొత్తంగా చూస్తే.. మంచి వెనుక సీటు సౌకర్యం, పెద్ద బూట్, సులభమైన డ్రైవింగ్ & ADAS కావాలనుకునే వారికి హోండా అమేజ్ మంచి ఎంపిక. అయితే ఇంజిన్ పనితీరు, క్యాబిన్ నాయిస్ & అధిక ధర విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Shivam Dube New Car: క్రికెటర్ శివమ్ దూబే కొత్త కారు ఇదే.. 286 bhp పవర్, 679 కి.మీ రేంజ్, అదిరిపోయే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!
Mahindra XEV 9S ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కొన్న శివమ్‌ దూబే.. ఏంటి ఆ కారు స్పెషాలిటీ?
Hyundai Verna Safety Rating: హ్యుందాయ్ వెర్నాకు భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్.. పెద్దలతో పాటు పిల్లల భద్రతలోనూ 5 స్టార్లు
హ్యుందాయ్ వెర్నాకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిన పాపులర్‌ సెడాన్!
పుష్కరం పాటు సాగిన ప్రయాణం.. ఇక అమ్మకాలకు గుడ్‌బై చెప్పిన TVS Star City Plus
మార్కెట్ నుంచి TVS Star City Plus అవుట్.. ఈ బైక్‌ ఇక కనిపించదు బాస్‌!
Tata Cars: టాటా కార్లపై హోండా, హ్యుందాయ్ ఆసక్తి.. కొత్త భాగస్వామ్యం కోసం కీలక చర్చలు
కారు టాటాది.. కారు పైన బ్యాడ్జ్‌ మాత్రం హోండా, హ్యుందాయ్‌ది! టెక్నాలజీ షేరింగ్‌ గురూ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget