అన్వేషించండి

కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!

MG Hector 7వ వార్షికోత్సవం సందర్భంగా రూ.60,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ రివార్డులు & ఇతర ఆఫర్లు ఉన్నాయి.

MG Hector Car Discount August 2026: ఈ నెల (ఆగస్టు 2026)లో కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేశారా? అయితే, MG Hector కొనేవాళ్లకు కంపెనీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. హెక్టర్ మన మార్కెట్లోకి వచ్చి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా, MG ప్రత్యేక యానివర్సరీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా, ఈ నెలలో హెక్టర్ కొనేవారికి రూ.60,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది.

ఏడేళ్లు పూర్తి చేసుకున్న MG Hector

MG సంస్థ 2019లో Hector SUVతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్పట్లో ఈ కారు మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఆకర్షణీయమైన డిజైన్, విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన సీట్లు, అధునాతన ఫీచర్లు కొనుగోలుదారులను ఆకట్టుకున్నాయి.

అప్పట్లో, పెట్రోల్ & డీజిల్ ఇంజిన్లతో లాంచ్‌ అయిన Hectorకు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. 2022 మే నాటికి ఈ SUV విక్రయాలు 80,000 యూనిట్లను దాటాయి. అదే ఏడాది డిసెంబర్‌లో హెక్టర్ ఉత్పత్తి 1 లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకుంది.

ఇది కూడా చదవండి: ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?

ఈ నెలలో రూ.60,000 వరకు ప్రయోజనాలు

హెక్టర్ ఏడో వార్షికోత్సవం సందర్భంగా, ఆగస్టు 2026లో ఈ SUVపై రూ.60,000 వరకు ప్రయోజనాలను MG అందిస్తోంది. ఇందులో ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ ఆఫర్లు & యానివర్సరీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఆగస్టు 2026లో హెక్టర్‌ కొనుగోలు కోసం బుకింగ్ చేసుకునే కస్టమర్లందరూ ఈ ప్రయోజనాలను పొందేందుకు అర్హులు. అయితే ఒక్కో కస్టమర్‌కు లభించే ప్రయోజనాలు వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది. డీలర్‌షిప్ వద్ద పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఫైనాన్స్ కూడా..

MG Hector కొనుగోలుదారులకు ఫైనాన్స్ విషయంలోనూ ప్రత్యేక సౌకర్యాలను ఈ కంపెనీ అందిస్తోంది. కారు ఆన్‌రోడ్ ధరపై 100 శాతం వరకు ఫండింగ్ పొందే అవకాశం ఉంది. గరిష్ఠంగా 84 నెలల కాలవ్యవధితో రుణ సదుపాయం (ఫైనాన్స్) అందుబాటులో ఉంది.

అంతేకాదు, హెక్టర్‌కు సంబంధించిన యాక్సెసరీల కొనుగోలుకు కూడా 100 శాతం వరకు ఫండింగ్ సపోర్ట్ (ఫైనాన్స్) అందిస్తున్నట్లు MG తెలిపింది.

ఇది కూడా చదవండి: నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?

ధర ఎంత? ఇంజిన్ ఎలా ఉంటుంది?

ప్రస్తుతం MG Hector ధర రూ.11.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు.

ప్రస్తుతం, హెక్టర్.. 143hp శక్తిని ఉత్పత్తి చేసే 1.5 లీటర్, నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు.

హెక్టర్‌లో 5 సీటర్ & 7 సీటర్ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీ కుటుంబ అవసరాలకు అనుగుణంగా వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.

MG Hectorకు ఇది ముఖ్యమైన మైలురాయి. భారత మార్కెట్లో MG బ్రాండ్‌కు పరిచయం చేసిన తొలి మోడల్ ఇదే. ఇప్పుడు ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రకటించిన రూ.60,000 వరకు ప్రయోజనాలు కొత్త కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా, 100 శాతం వరకు ఫైనాన్స్ సదుపాయంతో ఈ నెలలో హెక్టర్ కొనుగోలు మరింత ఈజీగా మారింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Ducati Monster V2 vs Triumph Street Triple 765 RS - 111hp vs 130hp.. ధర, పవర్, టార్క్‌లో ఏది బెస్ట్?
ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ 765 RS vs డుకాటి మాన్‌స్టర్‌ V2 - రేటు రూ.1 లక్ష తక్కువైనా 'పవర్‌'లో అదరగొడుతోంది!
Advertisement

వీడియోలు

Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget