అన్వేషించండి

డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే

KTM డ్యూక్‌ & RC బైక్‌ల ధరలు పెరిగాయి. 160 Duke నుంచి RC 390 వరకు 7 మోడళ్లపై వేల రూపాయాల్లో రేట్లు పెంచింది.

KTM Duke and RC prices hiked: కేటీఎం బైక్‌ కొనాలని చూస్తున్న వారికి షాక్‌ ఇచ్చే వార్త ఇది. కంపెనీ తన డ్యూక్‌ & RC సిరీస్‌లోని పలు బైక్‌ల ధరలను పెంచింది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 7 మోడళ్లపై ధరలు పెరిగాయి. కనీసం రూ.5,000 నుంచి గరిష్ఠంగా రూ.15,000 వరకు ధర పెరిగింది. కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.

ఇటీవలే, KTM 390 Duke సిరీస్‌ ధరలను పెంచింది. 390 Adventure సిరీస్‌ రేట్లు కూడా పెరిగాయి. ఇప్పుడు, భారత్‌లో తయారవుతున్న ఇతర తక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లపై కూడా ఈ కంపెనీ ప్రైస్‌ హైక్‌ ప్రకటించింది. ఇందులో 160 Duke, 200 Duke, 250 Duke, RC 160, RC 200 & RC 390 మోడళ్లు ఉన్నాయి. 160 Dukeలో రెండు వేరియంట్లు ఉండటంతో మొత్తం 7 మోడళ్లపై ఈ ప్రభావం పడింది.

అత్యధిక ధరల పెంపు ఉన్న మోడల్‌ RC 160. దీని రేటు ఏకంగా రూ.15,000 పెరిగింది. గతంలో రూ.1.85 లక్షలుగా ఉన్న ఈ బైక్‌ ఇప్పుడు రూ.2 లక్షలకు చేరింది. KTM సిరీస్‌లో ఇదే అతి పెద్ద ప్రైస్‌ హైక్‌.

డ్యూక్‌ సిరీస్‌లో 160 Duke ధర కూడా గణనీయంగా పెరిగింది. స్టాండర్డ్‌ 160 Dukeపై రూ.10,000 పెంచారు. దీంతో దీని రేటు రూ.1.74 లక్షల నుంచి రూ.1.84 లక్షలకు చేరింది. 160 Duke TFT వేరియంట్‌పై రూ.5,000 పెరిగింది. దీని ధర రూ.1.86 లక్షల నుంచి రూ.1.91 లక్షలకు చేరింది.

ఇది కూడా చదవండి: కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ

200 Duke కొనాలనుకునే వారికి కూడా ధరాఘాతం తప్పలేదు. ఈ బైక్‌ ప్రైస్‌ రూ.6,000 పెరిగింది. దీంతో, రూ.2 లక్షలుగా ఉన్న పాత ధర ఇప్పుడు రూ.2.06 లక్షలకు చేరింది. 250 Duke ధర కూడా రూ.6,000 పెరిగింది. గతంలో రూ.2.21 లక్షలుగా ఉన్న ఈ బైక్‌ ఇప్పుడు రూ.2.27 లక్షలు చెల్లిస్తేగానీ చేతికి రాదు.

RC సిరీస్‌లోని RC 390 ధరను రూ.10,000 పెంచారు. దీంతో రూ.3.23 లక్షలుగా ఉన్న ధర రూ.3.33 లక్షలకు చేరింది. అంటే RC 390 కొనుగోలుదారులు ఇకపై అదనంగా రూ.10,000 చెల్లించాలి.

అయితే RC 200 కొనుగోలుదారులకు మాత్రం కాస్త ఊరట ఇచ్చారు. ఈ మోడల్‌ రేటును మార్చలేదు, గతంలో ఉన్న రూ.2.32 లక్షల ధరనే కొనసాగించారు.

ఇది కూడా చదవండి: కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!

KTM బైక్‌ల "కొత్త ధరలను" ఒకసారి చూస్తే.. 160 Duke ధర రూ.1.84 లక్షలు. 160 Duke TFT ధర రూ.1.91 లక్షలు. 200 Duke ధర రూ.2.06 లక్షలు. 250 Duke ధర రూ.2.27 లక్షలు. RC 160 ధర రూ.2 లక్షలు. RC 200 ధర రూ.2.32 లక్షలు. RC 390 ధర రూ.3.33 లక్షలుగా ఉంది.

ఈ ధరలన్నీ ఎక్స్‌-షోరూమ్‌ ప్రైస్‌లు. అంటే రోడ్డు పన్ను, బీమా, రిజిస్ట్రేషన్‌ వంటి ఖర్చులు ఇందులో ఉండవు. ఆన్‌రోడ్‌ ధర ప్రాంతాన్ని బట్టి మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇప్పుడు KTM బైక్‌ కొనాలని ప్లాన్‌ చేస్తున్నవాళ్లు కొత్త ధరలను దృష్టిలో పెట్టుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget