అన్వేషించండి

నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?

నిస్సాన్ గ్రావైట్ CNG నిజ జీవిత మైలేజీ పరీక్షలో మంచి మైలేజీ ఇచ్చింది. ఫుల్‌ CNG ట్యాంక్‌తో 150-160km దూరం సులభంగా ప్రయాణించవచ్చు.

Nissan Gravite CNG Real Mileage: నిస్సాన్ గ్రావైట్ CNG ఇచ్చే నిజమైన మైలేజీ ఎంతో తెలుసా? నగరంలో కంటే హైవేపైనే మంచి ఫలితం వచ్చింది. వాస్తవ రోడ్లపై నిర్వహించిన పరీక్షలో ఈ కారు ఆకట్టుకునే ఇంధన సామర్థ్యాన్ని నమోదు చేసింది. నగరంలో 15.9km/kg మైలేజీ ఇచ్చింది. హైవేపై ఏకంగా 25.1km/kg మైలేజీ సాధించింది. రెండు పరిస్థితులను కలిపి చూస్తే సగటు మైలేజీ 20.5km/kgగా నమోదైంది.

నిస్సాన్ గ్రావైట్‌ను 2026 ఫిబ్రవరిలో భారత మార్కెట్లో విడుదల చేశారు. మన దేశంలో అందుబాటులో ఉన్న చౌకైన మూడు వరుసల MPVల్లో ఇది కూడా ఒకటి. ఈ ఏడాది మే నుంచి గ్రావైట్‌కు డీలర్ స్థాయిలో CNG కిట్‌ను అందిస్తున్నారు. Motozen తయారు చేసిన ఈ కిట్‌కు ప్రభుత్వం & ICAT అనుమతులు ఉన్నాయి.

రూ.83,000 కే CNG కిట్
ఈ CNG కిట్ ప్రారంభ ధర రూ.83,000గా ఉంది. CNG విడిభాగాలపై మూడేళ్లు లేదా 1,00,000km వరకు థర్డ్‌ పార్టీ వారంటీని అందిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. స్పేర్ వీల్‌ను బూట్‌ ఫ్లోర్ కింద అమర్చారు.

గ్రావైట్ CNGలో 1.0 లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇదే ఇంజిన్‌ను రెనాల్ట్ ట్రైబర్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. పెట్రోల్‌తో నడిచినప్పుడు ఇంజిన్ 72hp శక్తిని & 96Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?

అయితే CNGతో నడిచినప్పుడు ఇంజిన్ ఎంత శక్తిని ఉత్పత్తి చేస్తుందో నిస్సాన్ ఇంకా వెల్లడించలేదు. CNG మైలేజీకి సంబంధించిన గణాంకాలను కూడా ఈ కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

రెండు ట్యాంకులు
గ్రావైట్‌లో రెండు CNG ట్యాంకులు ఉన్నాయి. వీటిని బూట్‌లో ఒకదానిపై ఒకటి నిలువుగా అమర్చారు. ఒక్కో ట్యాంక్ సామర్థ్యం 25 లీటర్లు. రోడ్‌ టెస్ట్‌లో.. ఖాళీ ట్యాంక్‌లో 7.7kg CNG నింపగలిగారు. అయితే ఈ పరిమాణం అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండదు. CNG పంప్ వద్ద ఒత్తిడి & బయట ఉష్ణోగ్రతను బట్టి నింపే పరిమాణంలో మార్పు ఉండొచ్చు.

20.5km/kg సగటు మైలేజీని పరిగణనలోకి తీసుకుంటే.. పూర్తి CNG ట్యాంక్‌తో వాస్తవ పరిస్థితుల్లో సుమారు 150 నుంచి 160km వరకు ప్రయాణించవచ్చు.

మైలేజీ పరీక్షను సాధారణ పద్ధతిలో కాకుండా ప్రత్యేకంగా నిర్వహించారు. CNG ట్యాంక్‌ను పూర్తిగా ఖాళీ చేసి 2kg CNG నింపారు. అనంతరం నగర రోడ్లపై గ్యాస్ పూర్తయ్యే వరకు కారును నడిపారు. ఇదే విధానాన్ని హైవే పరీక్షలోనూ అనుసరించారు. రెండు పరీక్షల్లోనూ గ్రావైట్‌ను పూర్తిగా CNG మోడ్‌లోనే నడిపారు.

ఇది కూడా చదవండి: Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!

పరీక్షకు ముందు, కంపెనీ సూచించిన స్థాయిలో టైర్లలో గాలి ఒత్తిడి ఉండేలా చూసుకున్నారు. నవీ ముంబై పరిసరాల్లో నిర్ణయించిన నగర & హైవే మార్గాల్లో కారును నడిపారు. పరీక్ష సమయంలో కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నారు. ఏసీని ఫ్యాన్ స్పీడ్ 2లో ఉంచారు. ఉష్ణోగ్రతను అత్యల్ప స్థాయిలో సెట్ చేశారు.

ఆడియో సిస్టమ్, సూచికలు, వైపర్లు వంటి ఇతర ఎలక్ట్రికల్ పరికరాలను సాధారణ వినియోగదారుల మాదిరిగానే ఉపయోగించారు. మధ్యమధ్యలో డ్రైవర్లను మార్చడం ద్వారా డ్రైవింగ్ విధానంలో వచ్చే తేడాలను కూడా తగ్గించారు.

ఈ లెక్కల ప్రకారం చూస్తే.. తక్కువ ధరలో మూడు వరుసల MPVతో పాటు CNG ఆప్షన్‌ కూడా కోరుకునేవాళ్లకు గ్రావైట్ ఆసక్తికరమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైవేపై 25.1km/kg మైలేజీ నమోదు చేయడం దీని ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
కేవలం రూ.83,000 కే CNG కిట్.. నిస్సాన్ గ్రావైట్ నిజమైన మైలేజీ ఎంతో తెలుసా?
EV Driving Range Tips: EV రేంజ్‌ పెంచే టిప్స్ ఇవే! పదే పదే ఛార్జింగ్ చేయాల్సిన పని లేదు! 
EV రేంజ్‌ పెంచే టిప్స్ ఇవే! పదే పదే ఛార్జింగ్ చేయాల్సిన పని లేదు! 
33 కి.మీ మైలేజ్ ఇచ్చే Alto K10 కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 3.70 లక్షలు.. దీని ఫీచర్లు చూశారా
33 కి.మీ మైలేజ్ ఇచ్చే Alto K10 కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 3.70 లక్షలు.. దీని ఫీచర్లు చూశారా
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget