అన్వేషించండి

Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో

Maruti Wagon R CNG వెర్షన్‌ ఇచ్చే నిజమైన మైలేజ్‌ తెలుసుకునేందుకు రియల్ వరల్డ్ మైలేజ్ టెస్ట్‌ నిర్వహించారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Maruti Wagon R CNG Real Mileage: ప్రతిరోజూ తక్కువ ఖర్చుతో ప్రయాణించానుకునే వాళ్లకు CNG కార్లు ఒక తెలివైన ఆప్షన్‌. ఈ విభాగంలో చాలా సంవత్సరాలుగా ప్రజాదరణ పొందిన కార్లలో Maruti Wagon R కూడా ఒకటి.

Wagon R CNG రెండు వేరియంట్లలో లభిస్తుంది. LXi CNG ధర రూ.5.94 లక్షలు. VXi CNG ధర రూ.6.47 లక్షలు. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. పెట్రోల్ వేరియంట్లతో పోలిస్తే CNG మోడల్‌ కొనాలంటే సుమారు రూ.95,000 వరకు అదనంగా చెల్లించాలి.

అసలు రోడ్లపై ఎంత మైలేజ్?
ఆటో ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌లు Wagon R CNG ను రియల్ వరల్డ్ పరిస్థితుల్లో పరీక్షించారు. ఈ పరీక్షలో ఈ కారు సిటీలో 23.39km/kg మైలేజ్ వచ్చింది. హైవేపై 33.09km/kg ఇచ్చింది. సిటీ & హైవే ఫలితాలను కలిపితే సగటు మైలేజ్ లీటరుకు 28.24kmగా లెక్క తేలింది.

Wagon R CNG హైవే మైలేజ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. కంపెనీ ప్రకటించిన 33.47km/kg మైలేజ్‌కు ఇది అతి దగ్గరగా ఉంది. అంటే, ఈ కారును సరిగ్గా డ్రైవ్‌ చేస్తే మంచి మైలేజ్‌ అందుకునే అవకాశం ఉంది.

Wagon R CNGలో ఏ ఇంజిన్ ఉంది?
ఈ కారులో 1.0 లీటర్, మూడు సిలిండర్ల ఇంజిన్ ఉంటుంది. పెట్రోల్ మోడ్‌లో ఇది 67.7hp శక్తి & 91.1Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. CNG మోడ్‌లో 56.6hp శక్తి & 82.1Nm టార్క్ అందిస్తుంది.

ఇది కూడా చదవండి: రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి

CNG వేరియంట్‌లో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్‌తో పాటు బూట్‌లో 60 లీటర్ల CNG సిలిండర్‌ను ఏర్పాటు చేశారు.

CNG సిలిండర్, ఇతర పరికరాల కారణంగా పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే ఈ కారు సుమారు 95 నుంచి 100 కిలోల వరకు ఎక్కువ బరువు ఉంటుంది.

ఫుల్ ట్యాంక్‌తో ఎంత దూరం వెళ్లొచ్చు?
ఖాళీ ట్యాంక్‌లోకి CNG నింపినప్పుడు 7.4 కిలోల గ్యాస్ పట్టింది. అయితే, అనుకూల పరిస్థితుల్లో దాదాపు 8 కిలోల వరకు CNG పట్టే అవకాశం ఉంది. వాతావరణ ఉష్ణోగ్రత & పంప్ ఒత్తిడి వంటి అంశాలపై ఆధారపడి ఈ నంబర్‌ మారవచ్చు.

రియల్ వరల్డ్ పరీక్షలో వచ్చిన 28.24km/kg సగటు మైలేజ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఫుల్ CNG ట్యాంక్‌తో సుమారు 210 నుంచి 220 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు.

ఇది కూడా చదవండి: గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు

మైలేజ్‌ను ఎలా పరీక్షించారు?
CNG ట్యాంకులను ప్రతిసారి ఒకే స్థాయిలో నింపడం కష్టం. వాతావరణ ఉష్ణోగ్రత, పంప్ ఒత్తిడి వంటి అంశాల ప్రభావం ఉంటుంది. అందుకే సాధారణంగా చేసే ట్యాంక్-టు-ట్యాంక్ పద్ధతిని ఈ పరీక్షలో ఉపయోగించలేదు.

ముందుగా CNG ట్యాంక్‌ను పూర్తిగా ఖాళీ చేశారు. తర్వాత 2 కిలోల CNG నింపారు. సిటీ పరిస్థితుల్లో గ్యాస్ పూర్తిగా అయిపోయే వరకు కారును నడిపారు. ఇదే విధానాన్ని హైవే పరీక్షలోనూ అనుసరించారు. రెండు పరీక్షల్లోనూ కారు పూర్తిగా CNG మోడ్‌లోనే నడిచింది.

పరీక్షకు ముందు కంపెనీ సూచించిన స్థాయిలో టైర్లలో గాలి ఒత్తిడిని ఉంచారు. నవీ ముంబై చుట్టుపక్కల ముందుగానే నిర్ణయించుకున్న సిటీ & హైవే మార్గాల్లో కారును నడిపారు. సగటు వేగాన్ని కూడా నిర్దిష్ట స్థాయిలో ఉంచారు.

ప్రతి కారులో డ్రైవర్‌తో కలిపి ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నారు. ఎయిర్ కండిషనర్‌ను ఫ్యాన్ స్పీడ్ 2లో ఉంచి, ఉష్ణోగ్రతను అత్యల్ప స్థాయిలో సెట్ చేశారు. ఆడియో సిస్టమ్, ఇండికేటర్లు, వైపర్లు వంటి ఇతర విద్యుత్ పరికరాలను సాధారణ వినియోగదారుల మాదిరిగానే ఉపయోగించారు.

డ్రైవర్ మార్పులు కూడా చేశారు. దీనివల్ల ఒకే డ్రైవర్ డ్రైవింగ్ విధానం వల్ల మైలేజ్‌లో వచ్చే తేడాలను తగ్గించారు. మొత్తంగా చూస్తే Wagon R CNG రియల్ వరల్డ్ మైలేజ్ ఆకట్టుకునేలా ఉంది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో
Maruti Wagon R CNG నిజంగా ఎంత మైలేజ్ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో వచ్చిన ఫలితం ఇదే!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Hero Xpulse 210 రియల్‌ రివ్యూ - 5,600km తిరిగిన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget