అన్వేషించండి

5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?

Hero Xpulse 210ను 5,600 కి.మీ. నడిపిన తర్వాత లాంగ్ టర్మ్ రివ్యూ. సస్పెన్షన్, ఆఫ్ రోడ్ సామర్థ్యం, బ్రేకులు, టైర్లు & సర్వీస్ అనుభవంపై పూర్తి వివరాలు.

Hero Xpulse 210 real world review: రోడ్లు బాగాలేని ప్రాంతాల్లోనూ సులభంగా దూసుకెళ్లాలి, రోజువారీ అవసరాలకు కూడా ఉపయోగపడాలి, వీకెండ్‌లో ఒక లాంగ్‌ ట్రిప్‌ కొట్టి రావాలి, అప్పుడప్పుడు ఆఫ్ రోడ్‌లోనూ థ్రిల్లింగ్‌ రైడ్‌ ఇవ్వాలి...  ఇలాంటి అవసరాలకు సరిపోయే బైక్ కోసం చూస్తున్న వారికి Hero Xpulse 210 ప్రత్యేకమైన ఎంపిక అవుతుంది. దీని ఎక్స్‌-షోరూమ్‌ రేటు రూ.1.65 లక్షల నుంచి రూ.1.74 లక్షల వరకు ఉంది.

ఒక ఎక్స్‌పర్ట్‌ రైడర్‌ ఇచ్చిన రియల్‌ వరల్డ్ రివ్యూను ఇప్పుడు చదవండి: 

Hero Xpulse 210 బైక్‌ను రెండు నెలలకు పైగా ఉపయోగించిన తర్వాత దాని ఓడోమీటర్ 5,600 కి.మీ. దాటింది. ఈ ప్రయాణంలో Xpulse 210పై మంచి అభిప్రాయం ఏర్పడింది. అయితే పూర్తిగా ఇబ్బందులు లేవని మాత్రం కాదు.

రోజువారీ ప్రయాణాలకు సౌకర్యం
21 అంగుళాల ముందు చక్రం, ఎక్కువ దూరం ప్రయాణానికి అనకూలమైన సస్పెన్షన్ & మంచి రైడింగ్ పొజిషన్ Xpulse 210కు ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. బైక్ మధ్య భాగం సన్నగా ఉండటంతో నగరంలో రద్దీ మధ్య కూడా సులభంగా నడపవచ్చు.

ముఖ్యంగా.. గుంతలు, గోతులు ఎక్కువగా ఉన్న రోడ్లపై దీని సస్పెన్షన్ అద్భుతంగా పనిచేస్తుంది. రోడ్డుపై ఎదురయ్యే చాలా గోతులను పెద్దగా వేగం తగ్గించకుండానే దాటేయవచ్చు. దీంతో, నగరంలో ఇబ్బంది పెట్టే కొన్ని రోడ్లపై కూడా ఇప్పుడు మీరు ఎంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!

ఎత్తుగా ఉండే LED హెడ్‌లైట్, ఆకర్షణీయమైన ఇంధన ట్యాంక్ & తక్కువ ఎత్తులో ఉన్న సీటు బైక్‌కు ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తాయి. 21 అంగుళాల ముందు చక్రం & ముందు భాగంలోని బీక్ డిజైన్ ఈ బండికి మరింత దూకుడైన రూపాన్ని అందిస్తాయి.

ఆఫ్ రోడ్‌లోనూ సత్తా
ఈ ధర పరిధిలో రోజువారీ ప్రయాణం, టూరింగ్ & నిజమైన ఆఫ్ రోడ్ సామర్థ్యాన్ని ఇంత సమతూకంగా అందించే బైక్‌లు చాలా తక్కువ. మరో రూ.30,000 నుంచి రూ.40,000 వరకు ఖర్చు చేస్తే TVS Apache RTX వంటి మరింత టూరింగ్ అడ్వెంచర్ బైక్‌లు వస్తాయి. అయితే Xpulse 210 మాత్రం తన డ్యూయల్ స్పోర్ట్ స్వభావం ప్రత్యేకంగా నిలుస్తుంది.

టైర్లు ఇబ్బంది పెట్టాయి
అయితే, ఈ బండికి ట్యూబ్‌లెస్ టైర్లు లేకపోవడం రోజువారీ వినియోగంలో పెద్ద లోపంగా అనిపించింది. ఆఫ్ రోడ్ ప్రయాణాలకు ట్యూబ్డ్‌ టైర్లు ఉపయోగకరమే. కానీ సాధారణ ప్రయాణాల్లో పంక్చర్ అయితే సమయం ఎక్కువగా పడుతుంది.

ఒకే రోజు ముందు & వెనుక టైర్లు రెండూ పంక్చర్ కావడంతో ఈ సమస్య తీవ్రంగా అనిపించింది. బైక్‌ను పంక్చర్ షాపులకు తీసుకెళ్లడం, చక్రాలు తొలగించడం, మళ్లీ అమర్చడం వంటి పనులకు మూడు గంటలకు పైగా సమయం పట్టింది.

బ్రేకులపై ఇంకా అసంతృప్తే
బ్రేకులు కూడా పూర్తిగా సంతృప్తినివ్వలేదు. బ్రేకింగ్ సమయంలో తగినంత పట్టు & ఫీల్ లేదనే సమస్య గతంలోనే కనిపించింది. సర్వీస్ సెంటర్‌లో బ్రేకులను బ్లీడ్ చేశారు. బ్రేక్ ప్యాడ్లను మార్చాల్సిన అవసరం లేదని చెప్పారు. అయినప్పటికీ మెరుగుదల స్వల్పంగానే కనిపించింది.

అదే సర్వీస్ సమయంలో, తన ఎడమ కాలికి ఎక్కువ వేడి తగులుతున్న విషయాన్ని కూడా రైడర్ ఆ షోరూమ్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనిపై సరైన వివరణ లభించలేదు.

ఇది కూడా చదవండి: లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు

సైడ్ స్టాండ్ విషయంలోనూ జాగ్రత్త అవసరం. బైక్ సైడ్ స్టాండ్‌పై ఎక్కువగా ఒకవైపు వాలినట్లు కనిపిస్తుంది. సస్పెన్షన్ మెత్తగా ఉండటంతో బైక్ నుంచి దిగిన తర్వాత అది కొద్దిగా కూర్చున్నట్లు మారుతుంది. దీంతో పార్కింగ్ సమయంలో కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది.

సర్వీస్ ఖర్చు మాత్రం సహేతుకం
Hero ప్రీమియా డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా అమ్మే బైక్ కావడంతో సర్వీస్ సెంటర్ అనుభవం & వాతావరణంలో ఇంకా మెరుగుదలకు అవకాశం ఉంది. అయితే సర్వీస్ ఖర్చు మాత్రం పెద్దగా భారంగా లేదు. మొత్తం సర్వీస్ ఖర్చు రూ.2,214. ఇందులో ఇంజిన్ ఆయిల్‌కు రూ.1,300, ఎయిర్ ఫిల్టర్‌కు రూ.145 & సర్వీస్ ఛార్జీగా రూ.649 చెల్లించారు.

మొత్తంగా చూస్తే కొన్ని లోపాలు ఉన్నప్పటికీ Xpulse 210 ఆకట్టుకునే బైక్‌గానే నిలుస్తుంది. రోజువారీ ప్రయాణాలు, టూరింగ్ & ఆఫ్ రోడ్ రైడింగ్‌ను ఒకే బైక్‌లో ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

AdBlue In Cars: డీజిల్ కారు ఓనర్లు, డ్రైవర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం.. AdBlue ఎప్పుడు నింపాలి? ధర ఎంత?
డీజిల్ కారులో AdBlue అంటే ఏమిటి? ఇది అయిపోతే ఇంజిన్ మళ్లీ స్టార్ట్ కాదా?
Highest Mileage CNG Cars: హైయెస్ట్‌ మైలేజీ ఇచ్చే టాప్ 10 CNG కార్లు ఇవే.. కిలో గ్యాస్‌తో ఏకంగా 36.47km! టాప్‌లో Maruti Dzire
దేశం మొత్తంలో అత్యధిక మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 CNG కార్లు.. కేవలం రూ.4.69 లక్షల నుంచి స్టార్ట్‌
లాంచ్‌కు ముందే షోరూమ్‌లో దర్శనమిచ్చిన Bajaj Pulsar 125 Neon.. పాత క్లాసిక్ లుక్‌తో అదరగొడుతున్న బైక్!
తక్కువ ధరలో కొత్త పల్సర్ 125 వస్తోందా? లాంచ్‌కు ముందే కనిపించిన Bajaj Pulsar 125 Neon
రాయల్ ఎన్‌ఫీల్డ్ 500కి పోటీగా Honda CB500.. మూడు వేరియంట్లు, 501cc ఇంజిన్‌, 28hp పవర్‌
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న Honda CB500 లాంచ్.. రూ.2.75 లక్షలకే కొత్త 501cc బైక్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
This Week Movies : శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
TVK MLA Arul Vignesh: మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం!
మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
Gaganayan Mission: గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు
Embed widget