అన్వేషించండి

కొత్త SUVల దెబ్బకు పడిపోతుందన్నారు.. కానీ ఈ కారు జోరు తగ్గలేదు, ఇప్పటికీ టాప్‌ ప్లేస్‌!

కొత్త SUVల పోటీ పెరిగినా ఒక కారు మాత్రం మిడ్‌సైజ్ SUV విభాగంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2026 తొలి ఆరు నెలల్లో ఆ కారు అమ్మకాలు, ప్రత్యర్థుల పనితీరు & విజయ రహస్యాలు ఇవే.

Best Selling Midsize SUV 2026: భారత్‌లో, మిడ్‌సైజ్ SUV మార్కెట్‌లో పోటీ మామూలుగా లేదు. కొత్త మోడళ్లు వరుసగా మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. అయినా.. ఒక కారు ఆధిపత్యం మాత్రం ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది, ఆ కారే Hyundai Creta. ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న మోడళ్లు Creta అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని చాలామంది భావించారు, కానీ అలా జరగలేదు.

Maruti Suzuki Victoris, Tata Sierra, Kia Seltos, Renault Duster వంటి కొత్త మోడళ్లు Cretaకు గట్టి పోటీ ఇస్తాయని అంచనాలు వచ్చాయి. వీటితో పాటు Skoda Kushaq & Volkswagen Taigun ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అయితే, 2026 తొలి ఆరు నెలల అమ్మకాల గణాంకాలు చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. కొత్త ప్రత్యర్థులు వచ్చినా Creta తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

నంబర్ వన్ స్థానంలో Creta
2026 తొలి ఆరు నెలల్లో (జనవరి-జూన్) Creta నెలకు సగటున 15,000కు పైగా యూనిట్ల సేల్స్‌తో, మొత్తం 91,391 యూనిట్లను అమ్మింది. అయితే 2025 తొలి ఆరు నెలలతో పోలిస్తే అమ్మకాలు 9.12 శాతం తగ్గాయి. 2025 H1లో 1,00,560 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది అమ్మకాలు తగ్గినప్పటికీ ప్రత్యర్థి మోడళ్ల కంటే Creta చాలా ముందుంది. కొత్త SUVలు Cretaను అగ్రస్థానం నుంచి దించలేకపోయాయి.

రెండో స్థానంలో Victoris
2026 H1లో Creta తర్వాత అత్యధికంగా అమ్ముడైన మిడ్‌సైజ్ SUVగా Maruti Suzuki Victoris నిలిచింది, 2026 తొలి ఆరు నెలల్లో మొత్తం 73,912 యూనిట్లను అమ్మింది. అయితే, Cretaతో పోలిస్తే Victoris 17,479 యూనిట్లు వెనుకబడింది. Victoris 2025 సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చింది. CNG & స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు దీని ప్రత్యేకత. ఇంధన ఖర్చును తగ్గించుకోవాలనుకునేవాళ్లకు ఇది ఆకర్షణీయమైన ఆప్షన్‌. Maruti బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కూడా Victorisకు కలిసొచ్చింది, రెండో స్థానం సాధించింది.

ఇది కూడా చదవండి: 5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?

Seltos అమ్మకాల్లో భారీ వృద్ధి
Kia Seltos, 62,805 యూనిట్ల సేల్స్‌తో మూడో స్థానంలో నిలిచింది. Cretaకు నేరుగా పోటీ ఇచ్చే మోడళ్లలో Seltos ఒకటి. ఇందులో దాదాపు Creta తరహా ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఆధునిక ప్లాట్‌ఫామ్, ఆకర్షణీయమైన ధర & మెరుగైన భద్రత కూడా ఉన్నాయి. రెండో తరం Seltos భారత్ NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. దీంతో ఈ SUVపై ఆసక్తి పెరిగింది. 2026 H1లో Seltos అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన ఏకంగా 70.28 శాతం పెరిగాయి.

Sierra, Duster కూడా పోటీలోనే..
Creta పోటీగా ఇప్పటివరకు వచ్చిన అత్యంత బలమైన ప్రత్యర్థుల్లో Tata Sierra ఒకటి. అయితే, 2026 తొలి ఆరు నెలల్లో Sierra అమ్మకాలు Creta అమ్మకాలలో సగం కంటే తక్కువగా (43,420) ఉన్నాయి. Sierraకు ప్రారంభంలో ఉత్పత్తి పరిమితులు ఎదురయ్యాయి. డిమాండ్‌కు అనుగుణంగా Tata ప్రతి నెలా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. ఫీచర్ల విషయంలో Sierra ముందున్నప్పటికీ, Cretaతో పోలిస్తే దాని ధర ఎక్కువగా ఉంది. ఫిట్ & ఫినిష్, అమ్మకాల తర్వాత సేవలపై ఉన్న అభిప్రాయాలు కూడా ప్రభావం చూపుతున్నాయి.

Renault కొత్త Dusterను మార్చిలో తీసుకొచ్చింది. ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభమయ్యాయి. అయితే తొలి ఆరు నెలల అమ్మకాలలో ‍‌(6,039) Duster పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఉత్పత్తిని దశలవారీగా పెంచుతున్న కారణంగా అమ్మకాలు తక్కువగా ఉండొచ్చని అంచనా. దూకుడైన డిజైన్, పోటీ ధర & మంచి ఫీచర్లు Dusterకు బలాలు. అయితే ఇందులో టర్బో పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఉండటం కొంతమంది కొనుగోలుదారులను దూరం చేస్తోంది. దీపావళి నాటికి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు

Skoda Kushaq ‍‌(6,460) & Volkswagen Taigun ఫేస్‌లిఫ్ట్‌ (4,006) కూడా మార్చి & ఏప్రిల్‌లో మార్కెట్లోకి వచ్చాయి. కొత్త ఫీచర్లు, మార్పులు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే వీటిలో టర్బో పెట్రోల్ ఇంజిన్లు మాత్రమే ఉన్నాయి. పరిమాణం పరంగా కూడా ఇవి సెగ్మెంట్‌లో కొంత చిన్నవే. అందుకే డ్రైవింగ్‌ను ఆస్వాదించాలనుకునే వారికి ఇవి ఎక్కువగా సరిపోతాయి.

Cretaను ఎందుకు ఆపలేకపోతున్నారు?
Creta విజయానికి ప్రధాన కారణం దాని బ్రాండ్ ఇమేజ్. భారతీయలు కారు కొనే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. రోడ్లపై ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో Cretaలు కనిపించడం కూడా ఆ మోడల్‌పై నమ్మకాన్ని పెంచుతోంది. 
అమ్మకాలు ఎక్కువగా ఉండటం వల్ల రీసేల్ విలువ కూడా మెరుగ్గా ఉంటుంది. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం.

విశ్వసనీయత మరో ప్రధాన కారణం. Cretaలో మంచి ఫీచర్లు, సౌకర్యవంతమైన ఇంటీరియర్, మెరుగైన నిర్మాణ నాణ్యత & రిఫైన్డ్ డ్రైవింగ్ అనుభవం ఉన్నాయి. వివిధ ఇంజిన్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.

మిడ్‌సైజ్ SUV విభాగంలో డీజిల్ ఇంజిన్ అందించే కొద్ది మోడళ్లలో Creta ఒకటి. నగర ప్రయాణాల కోసం NA పెట్రోల్ ఇంజిన్ ఉంది. స్పోర్టీ డ్రైవింగ్ కోరుకునేవారి కోసం Creta N Line కూడా ఉంది.

అంటే కుటుంబ అవసరాలు, రోజువారీ ప్రయాణాలు, ఇంధన సామర్థ్యం, సౌకర్యం లేదా స్పోర్టీ డ్రైవింగ్.. ఏ అవసరం ఉన్నా Cretaలో ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇదే దాని అసలు బలం. అందుకే కొత్త SUVలు ఎన్ని వచ్చినా మిడ్‌సైజ్ SUV మార్కెట్లో Creta ఆధిపత్యం ఇప్పటికీ కొనసాగుతోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఎస్‌యూవీ మార్కెట్‌లో Hyundai Creta సరికొత్త రికార్డు.. 15 లక్షల సేల్స్‌ మైల్‌స్టోన్‌ దాటేసింది!
2015 నుంచి ఇప్పటివరకు కూడా ఇదే మొనగాడి కారు.. ఏకంగా 15 లక్షల మంది కొన్నారు!
యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Embed widget