రూ.8.14 లక్షలకే Hyundai Exter Knight Edition.. బ్లాక్ లుక్‌తో మెరిసిపోతున్న కొత్త అవతార్
హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ రూ.8.14 లక్షల నుంచి ప్రారంభం. బ్లాక్ డిజైన్, ఆల్ బ్లాక్ క్యాబిన్, 83hp పెట్రోల్ & 69hp CNG ఇంజిన్‌తో నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.

Hyundai Exter Knight Edition: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా, 2026 ఎక్స్‌టర్‌లో కొత్తగా 'నైట్ ఎడిషన్'ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక ఎడిషన్ ప్రారంభ ధర రూ.8.14 లక్షలు. ఇవి ఎక్స్-షోరూమ్ ధర. సాధారణ వేరియంట్లతో పోలిస్తే నైట్ ఎడిషన్ కోసం కేవలం రూ.15,000 అదనంగా చెల్లిస్తే సరిపోతుంది.
2026 హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్‌ను HX 6 ట్రిమ్‌లోని అన్ని పెట్రోల్ & CNG వేరియంట్లలో అందిస్తున్నారు. HX 10 ట్రిమ్‌లో పెట్రోల్-AMT వేరియంట్‌లో కూడా ఈ ఎడిషన్‌ను సొంతం చేసుకోవచ్చు.
బ్లాక్ లుక్ ప్రధాన ఆకర్షణ
ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్‌లో ప్రధానంగా బ్లాక్ & డార్క్ గ్రే డిజైన్ ఎలిమెంట్స్‌ను జోడించారు. ముందు, వెనుక భాగాల్లోని హ్యుందాయ్ లోగోలు, ఎక్స్‌టర్ పేరును బ్లాక్ కలర్‌లో ఇచ్చారు. బంపర్లపై డార్క్ గ్రే గార్నిష్ ఉంటుంది. 15 అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు కూడా బ్లాక్ లేదా డార్క్ గ్రే ఫినిష్ ఇచ్చారు.
ముందు చక్రాలకు రెడ్ బ్రేక్ కాలిపర్లు ఇచ్చారు. ఇవి బ్లాక్ థీమ్‌కు మంచి కాంట్రాస్ట్‌ను అందిస్తాయి. వెనుక భాగంలో టెయిల్‌గేట్‌పై ప్రత్యేకమైన ‘Knight’ బ్యాడ్జ్ ఉంటుంది.
ఐదు రంగుల్లో లభ్యత
ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్‌ను ఐదు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. టైటానియం బ్లాక్, అట్లాస్ వైట్, స్టార్రీ నైట్, టైటాన్ గ్రే & గోల్డెన్ బ్రాంజ్ రంగులు అందుబాటులో ఉన్నాయి. అయితే సాధారణ ఎక్స్‌టర్‌లో లభించే రేంజర్ ఖాకీ కలర్‌ను నైట్ ఎడిషన్‌లో ఇవ్వలేదు.
ఆల్ బ్లాక్ క్యాబిన్
క్యాబిన్‌లోనూ నైట్ ఎడిషన్ ప్రత్యేకత కనిపిస్తుంది. సాధారణ ఎక్స్‌టర్‌లో నేవీ & గ్రే ఇంటీరియర్ థీమ్ ఉంటుంది. నైట్ ఎడిషన్‌లో మాత్రం పూర్తిగా బ్లాక్ క్యాబిన్‌ను అందించారు. బ్రాస్ రంగు యాక్సెంట్లు కూడా ఉన్నాయి.
సీట్లకు బ్లాక్ ఫ్యాబ్రిక్ అప్‌హోల్స్టరీ ఇచ్చారు. ఫుట్‌వెల్ లైటింగ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణ మోడళ్లలో బ్లూ లైటింగ్ ఉండగా, నైట్ ఎడిషన్‌లో అంబర్ రంగు లైటింగ్ ఉంటుంది.
ఫీచర్లలో పెద్దగా మార్పులు లేవు
నైట్ ఎడిషన్‌లో.. స్టాండర్డ్ వేరియంట్‌లో ఉన్న ఫీచర్లనే కొనసాగించారు. HX 6లో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, పవర్డ్ ORVMలు, వెనుక AC వెంట్లతో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా & సెన్సర్లు ఉన్నాయి.
HX 10లో వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, రియర్ వైపర్ & వాషర్ వంటి అదనపు ఫీచర్లు లభిస్తాయి.
ధరలు
HX 6 పెట్రోల్ MT ధర రూ.8.14 లక్షలు. HX 6 పెట్రోల్ AMT ధర రూ.8.74 లక్షలు. HX 6 CNG MT ధర రూ.9.10 లక్షలు. HX 10 పెట్రోల్ AMT ధర రూ.9.61 లక్షలు.
నైట్ ఎడిషన్‌కు సంబంధించిన అన్ని వేరియంట్ల ధరలు సాధారణ మోడల్ కంటే రూ.15,000 మాత్రమే ఎక్కువ.
ఇంజిన్‌లో మార్పు లేదు
నైట్ ఎడిషన్‌లో ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 83hp శక్తిని & 114Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ & 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి.
CNG వెర్షన్ 69hp శక్తిని & 95Nm టార్క్‌ను అందిస్తుంది. CNG మోడల్‌లో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది.
ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ తొలిసారి 2024 జూలైలో మార్కెట్లోకి వచ్చింది. 2026 మార్చిలో లాంచ్ అయిన ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌టర్ ఆధారంగా ఇప్పుడు ఈ ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చారు. స్పోర్టీ బ్లాక్ లుక్ కోరుకునేవాళ్లకు ఇది ప్రత్యేక ఆప్షన్ అవుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















