అన్వేషించండి

R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు

Yamaha R2 ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ.10,000తో బుక్ చేసుకోవచ్చు. 200-220cc ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ ధర రూ.2-2.20 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

Yamaha R2 Price And Features Telugu: యమహా నుంచి త్వరలో ఓ కొత్త సర్‌ప్రైజ్ రాబోతోంది. యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న R2 సూపర్‌స్పోర్ట్ బైక్ ప్రీ బుకింగ్స్‌ను ఈ కంపెనీ ప్రారంభించింది. కేవలం రూ.10,000 చెల్లించి ఈ బైక్‌ను ముందుగా బుక్ చేసుకోవచ్చు. Yamaha R2 ని ఆగస్టు 27న అధికారికంగా విడుదల చేయనున్నారు.

ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం గమనించాలి. ప్రీ బుకింగ్ కోసం చెల్లించే రూ.10,000 పూర్తిగా రీఫండబుల్. రీఫండ్‌ను సెప్టెంబర్ 5 తర్వాత మాత్రమే ప్రాసెస్ చేస్తారు. విడుదలకు ముందే బైక్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లకు యమహా ప్రాధాన్యత ఇస్తుంది.

రూ.2 లక్షల నుంచి..

Yamaha R2 ధరపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ బైక్ ధర సుమారు రూ.2 లక్షల నుంచి రూ.2.20 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం R15 శ్రేణిలో ధరలు రూ.1.57 లక్షల నుంచి రూ.1.98 లక్షల వరకు ఉన్నాయి. దీంతో R2ను R15 కంటే పై స్థాయిలో ఉంచనున్నారు.

R15 స్థానాన్ని R2 భర్తీ చేయదు. అయితే యమహా R15 లైనప్‌లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం టాప్ వేరియంట్‌గా ఉన్న R15 Mను నిలిపివేసి, దాని స్థానంలో R2ను తీసుకురావచ్చని తెలుస్తోంది. మూడో తరం R15 ఆధారంగా ఉన్న R15 S కూడా భవిష్యత్తులో నిలిచిపోయే అవకాశం ఉంది.

200-220cc ఇంజిన్‌తో వచ్చే అవకాశం

Yamaha R2లో ఏ ఇంజిన్‌ను ఉపయోగిస్తారనే విషయంపై పూర్తి సమాచారం ఇంకా వెల్లడికాలేదు. అయితే ఈ బైక్‌లో 200cc నుంచి 220cc మధ్య సామర్థ్యం ఉన్న సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉండొచ్చని అంచనా.

R15లోని 155cc ఇంజిన్ తరహాలోనే R2 ఇంజిన్ కూడా హై-రేవింగ్‌ వద్ద మంచి పెర్ఫార్మెన్స్‌ అందించేలా తీర్చిదిద్దే అవకాశం ఉంది. పవర్ వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ప్రత్యర్థి బైక్‌లకు సమానంగా లేదా వాటి కంటే మెరుగైన పనితీరు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

KTM RC 200, Hero Karizma XMRకు పోటీ

Yamaha R2 మార్కెట్లో KTM RC 200 & Hero Karizma XMR వంటి బైక్‌లకు పోటీ ఇవ్వనుంది. ఈ రెండు బైక్‌లు సుమారు 25hp శక్తిని అందిస్తాయి. దీంతో R2 కూడా దాదాపు ఇదే స్థాయిలో పవర్‌ను అందించొచ్చు!.

బరువు విషయంలోనూ R2కు ప్రయోజనం ఉండొచ్చు. ప్రస్తుతం KTM RC 200 బరువు 160 కిలోలు. Hero Karizma XMR బరువు 163.5 కిలోలు. Yamaha R15 V4 బరువు కేవలం 141 కిలోలు. R2 కూడా తక్కువ బరువుతో వస్తే మెరుగైన చురుకుదనం & పవర్ టు వెయిట్ నిష్పత్తిని అందించే అవకాశం ఉంది.

భారత్‌లోనే తయారీ

Yamaha R2ను పూర్తిగా భారత్‌లో తయారు చేయనున్నారు, ఇక్కడి నుంచే అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తారు. దీంతో భారత్ యమహా R2 ఉత్పత్తిలో కీలక కేంద్రంగా మారనుంది.

R15 సిరీస్‌లోని స్పోర్టీ రైడింగ్ అనుభూతిని మరింత శక్తిమంతమైన ఇంజిన్‌తో అందించడమే R2 ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ధర, ఇంజిన్ సామర్థ్యం, పవర్, ఫీచర్లు వంటి పూర్తి వివరాలు ఆగస్టు 27న, లాంచ్‌ సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget