అన్వేషించండి

అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు

Ampere Magnus G Max కొత్త కనెక్టివిటీ ఫీచర్లతో అప్‌డేట్ అయింది. రూ.1.10 లక్షల ధరతో 5 అంగుళాల డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్, నావిగేషన్ వంటి ఫీచర్లు పొందింది.

Updated Ampere Magnus G Max Price, Range And Features Telugu: ఆంపియర్ తన మాగ్నస్ జి మ్యాక్స్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు భారీ కనెక్టివిటీ అప్‌డేట్‌ ఇచ్చింది. ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ ధర రూ.1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర). ఈ అప్‌డేట్‌లో భాగంగా స్కూటర్‌కు 30కి పైగా IoT ఫీచర్లను జోడించినట్లు కంపెనీ తెలిపింది.

కొత్త సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్

కంపెనీకి చెందిన కొత్త NxG.io సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌ను బేస్‌ చేసుకుని ఆంపియర్ మాగ్నస్ G మ్యాక్స్‌లో మార్పులు చేశారు, దీనివల్ల స్కూటర్‌లో కనెక్టెడ్ ఫీచర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఫీచర్లు అన్నింటినీ కొత్త 5 అంగుళాల డిస్‌ప్లే ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు.

క్రూయిజ్ కంట్రోల్ ప్రత్యేక ఆకర్షణ

నయా అప్‌డేట్‌లో క్రూయిజ్ కంట్రోల్ కీలక ఫీచర్‌గా నిలుస్తోంది. దీర్ఘ దూర ప్రయాణాల్లో నిరంతరం యాక్సిలరేటర్‌ను ఆపరేట్ చేయాల్సిన అవసరం తగ్గిపోతుంది, రైడింగ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా కొత్తగా వచ్చింది. ఎత్తైన ప్రదేశాల్లో స్కూటర్‌ను ఆపినప్పుడు వెనక్కి జారిపోకుండా ఈ ఫీచర్ సహాయపడుతుంది. ముఖ్యంగా, జారుడు ప్రాంతాల్లో ట్రాఫిక్‌లో ఆగినప్పుడు రైడర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

5 అంగుళాల డిస్‌ప్లే

కొత్త మాగ్నస్ G Maxలో 5 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్ సదుపాయం ఉంది. దీనిని ఉపయోగించుకుని ప్రయాణ మార్గాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

ఇప్పుడు, స్కూటర్‌ను పార్క్ చేసిన తర్వాత ఎక్కడ ఉంచామో గుర్తించడం కూడా సులభంగా మారింది. ఫోన్‌లోని యాప్ ద్వారా స్కూటర్‌ను గుర్తించవచ్చు. అవసరమైతే స్కూటర్‌ను పింగ్ చేసి దాని స్థానాన్ని తెలుసుకోవచ్చు.

30కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు

కొత్త కనెక్టెడ్ వ్యవస్థలో రియల్ టైమ్ ఛార్జింగ్ స్టేటస్, లైవ్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దొంగతనం లేదా స్కూటర్‌ను టోయింగ్ చేసినప్పుడు అలర్ట్‌లు కూడా వస్తాయి.

రిమోట్ డయాగ్నస్టిక్స్, సర్వీస్ బుకింగ్, ఛార్జింగ్ హిస్టరీ & బ్యాటరీ హెల్త్ వివరాలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్‌ను గాలిలోనే అప్‌డేట్ చేసే OTA సదుపాయం కూడా ఉంది.

ఈ కనెక్టెడ్ ఫీచర్లన్నింటినీ Ampere Connect యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

బ్యాటరీ & మోటార్‌లో మార్పు లేదు

కనెక్టివిటీ విషయంలో భారీ అప్‌డేట్ వచ్చినప్పటికీ స్కూటర్‌లోని ప్రధాన మెకానికల్ వ్యవస్థలో ఎలాంటి మార్పు లేదు. మాగ్నస్ G Maxలో 3kWh LFP బ్యాటరీని ఉపయోగించారు.

దీనికి 2.4kW పీక్ పవర్‌ను ఉత్పత్తి చేసే హబ్ మౌంటెడ్ మోటార్ ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఇది 142 కిలోమీటర్ల IDC రేంజ్‌ను అందిస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 65 కిలోమీటర్లు.

బ్యాటరీకి 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ ఉంది. బ్యాటరీ జీవితకాలం 2,00,000 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

కొత్త రంగులోనూ లభ్యత

మాగ్నస్ G Maxను డ్యూయల్ టోన్ కలర్స్‌లో అందిస్తున్నారు. ఇప్పటికే ఉన్న మాన్సూన్ బ్లూ & మ్యాచ్ గ్రీన్ రంగులతో పాటు కొత్తగా సిన్నమన్ కాపర్ రంగును కూడా తీసుకొచ్చారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

టియాగో, కామెట్‌లకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైన Hyundai.. భారత్‌లో చౌక ధరకు EV
టియాగో, కామెట్‌లకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైన Hyundai.. భారత్‌లో చౌక ధరకు EV
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
Kia Sorento: భారత్ మార్కెట్‌లో కియా సోరెంటో SUV ఎంట్రీ.. లగ్జరీ కారు సూపర్ ఫీచర్లు
భారత్ మార్కెట్‌లో కియా సోరెంటో SUV ఎంట్రీ.. లగ్జరీ కారు సూపర్ ఫీచర్లు
Advertisement

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan DSC 2025: ఖాతాలు బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు- డీఎస్సీపై వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
ఖాతాలు బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు- డీఎస్సీపై వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Nepal Floods: నేపాల్ వరద సహాయక చర్యల్లో అద్భుతం.. 11 రోజుల తర్వాత శిథిలాల నుంచి బతికి బయటపడ్డ మహిళ
నేపాల్ వరద సహాయక చర్యల్లో అద్భుతం.. 11 రోజుల తర్వాత బతికి బయటపడ్డ మహిళ
 Asia Cup 2026- IND VS PAK Result Update: టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. పాక్ ను చిత్తు చేసింది హ‌ర్మ‌న్ ప్రీత్ సేన‌.. స‌త్తా చాటిన శ్రీ చ‌ర‌ణి, ప్రేమ‌
టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. పాక్ ను చిత్తు చేసింది హ‌ర్మ‌న్ ప్రీత్ సేన‌.. స‌త్తా చాటిన శ్రీ చ‌ర‌ణి, ప్రేమ‌
టియాగో, కామెట్‌లకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైన Hyundai.. భారత్‌లో చౌక ధరకు EV
టియాగో, కామెట్‌లకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైన Hyundai.. భారత్‌లో చౌక ధరకు EV
Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రోడ్లపై ధర్నాలు వద్దు.. సమస్యలు తీర్చడానికి 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Embed widget