దీర్ఘకాలం లోన్ తీసుకోవడం వల్ల EMI తగ్గుతుంది. అయితే మొత్తం చెల్లించాల్సిన వడ్డీ మొత్తం పెరుగుతుంది కాబట్టి, EMI మాత్రమే కాకుండా మొత్తం లోన్ పూర్తయ్యే వరకు బ్యాంకుకు ఎంత చెల్లించాలో తెలుసుకోవాలి.
17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
Hyundai Creta Finance Plan: హ్యుందాయ్ క్రెటా కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సర్ సహా పలు ఫీచర్లు ఇచ్చారు. లోన్ ద్వారా కారు సొంతం చేసుకోండి.

- 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, దీర్ఘకాల లోన్ వడ్డీ గమనించాలి.
మీరు మంచి లుక్, స్ట్రాంగ్ ఇంజిన్, ఎక్కువ స్పేస్‌తో వచ్చే ఒక మిడ్-సైజ్ SUV కోసం చూస్తున్నారా.. అయితే మీకు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) సరిగ్గా సరిపోతుంది. ఈ కారును కొనడానికి మీ వద్ద పూర్తి బడ్జెట్ లేకపోయినా ఏ ఇబ్బంది లేదు. కారు ధర మొత్తాన్ని ఒకేసారి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ కారును తక్కువ డౌన్ పేమెంట్, మంత్లీ EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం కార్ ఫైనాన్స్ ప్లాన్ తెలుసుకుని ఆ తరువాత కొంటే ఏ టెన్షన్ ఉండదు. డౌన్ పేమెంట్, ప్రతి నెల EMI లెక్క ఎలా ఉంటుంది? వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
కారు ఆన్-రోడ్ ధర ఎంత?
కారు ధర విషయానికి వస్తే Hyundai Creta బేస్ వేరియంట్ హైదరాబాద్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.10.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎక్స్-షోరూమ్ ధరతో పాటు RTO, ఇన్సూరెన్స్, FASTag, ఇతర ఛార్జీలు కలిపితే హైదరాబాద్‌లో దీని ఆన్-రోడ్ ధర సుమారు 13 లక్షల 70 వేల రూపాయల వరకు చేరుతుంది. మీరు 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్ చేస్తే మిగిలిన మొత్తాన్ని కార్ లోన్ ద్వారా చెల్లించే అవకాశం ఉంది.
ఒకవేళ మీకు సుమారు 10.54 లక్షలు కార్ లోన్ లభిస్తే, వడ్డీ రేటు ఏడాదికి 9 శాతం ఉంటే, 7 ఏళ్ల లోన్‌పై ప్రతి నెల సుమారు EMI 17000 అవుతుంది. అంటే 2 లక్షల రూపాయల ప్రారంభ డౌన్ పేమెంట్ తర్వాత కస్టమర్ దాదాపు 7 ఏళ్ల పాటు ప్రతి నెల ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక ఉదాహరణ. EMI, బ్యాంక్ వడ్డీ రేటు, లోన్ మొత్తం, డౌన్ పేమెంట్, లోన్ కాలవ్యవధి ఆధారంగా మారతుంది.
7 ఏళ్ల కార్ లోన్ లాభమా లేదా నష్టమా?
దీర్ఘకాలం కోసం లోన్ తీసుకోవడంలతో ప్రతి నెల చెల్లించాల్సిన EMIని తక్కువగా ఉంటుంది. నెలవారీ రూ. 17 వేల EMI ఆప్షన్ వస్తుంది. కానీ మరోవైపు దీర్ఘకాలంలో వడ్డీ మొత్తం పెరగవచ్చు. అందుకే కారు కొనేటప్పుడు కేవలం నెలవారీ EMI మాత్రమే కాదు, కారు లోన్ పూర్తయ్యే వరకు బ్యాంకుకు ఎంత మొత్తం చెల్లించాల్సి వస్తుందో తెలుసుకోవాలి.
Also Read: ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
Hyundai Creta సేఫ్టీ ఫీచర్లు
Hyundai Creta బేస్ వేరియంట్‌లో అనేక ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు ఇచ్చారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ABSతో EBD, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రియర్ పార్కింగ్ సెన్సర్ ఉన్నాయి. కారులో LED DRLs, ఆకర్షణీయమైన ఫ్రంట్ డిజైన్ కూడా లభిస్తుంది.
ఫ్యామిలీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇందులో మంచి కేబిన్ స్పేస్, సౌకర్యవంతమైన సీట్లు ఉన్నాయి. అందుకే Cretaను రోజువారీ ఆఫీస్ జర్నీ, సిటీ డ్రైవింగ్,ఫ్యామిలీ ట్రిప్స్ వంటి విభిన్న అవసరాలకు మంచి SUVగా భావిస్తారు.
ప్రస్తుత Cretaలో కంపెనీ పలు ప్రీమియం ఫీచర్లు ఇస్తోంది. వీటిలో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్, 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పానోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కారు పవర్‌ట్రెయిన్, పనితీరు
పనితీరు విషయానికి వస్తే హ్యుందాయ్ క్రెటా బేస్ మోడల్‌లో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఈ ఇంజిన్ సుమారు 115 PS పవర్, 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌తో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుంది. ఈ సెటప్ రోజువారీ డ్రైవింగ్‌తో పాటు హైవేపై కూడా సరిపోతుంది.
Also Read: 27 కిలోమీటర్ల మైలేజీ ఇస్తూ తక్కువ ధరకే లభించే కారు గురించి తెలుసా? అందుకే జనం ఎగబడుతున్నారా?
ఈ విషయాలు గమనించాలి
మీరు 2 లక్షలు డౌన్ పేమెంట్‌తో హ్యుందాయ్ క్రెటా కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీ నెలవారీ జీతం, ఖర్చులను దృష్టిలో ఉంచుకుని EMI ప్లాన్ చేసుకోవాలి. 17000 రూపాయల EMI ఉదాహరణకు 9 శాతం వడ్డీ, 7 ఏళ్ల లోన్‌పై ఆధారపడి ఉంది. కనుక ఇతర బ్యాంకులో వడ్డీ రేటులో EMI మారుతుంది. ఇన్సూరెన్స్, RTO, ఇతర ఆన్ రోడ్ ఖర్చులను కూడా చెక్ చేసుకోవాలి.
Frequently Asked Questions
7 ఏళ్ల కార్ లోన్ తీసుకోవడం లాభమా, నష్టమా?
ట్రెండింగ్ వార్తలు






















