అన్వేషించండి

E20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లకు ముప్పే! కార్‌ కంపెనీల తనిఖీల్లో సంచలన విషయాలు

E20 పెట్రోల్‌లో క్లోరైడ్ & తేమ అధికంగా ఉన్నట్లు కార్ల తయారీ సంస్థల డేటాలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లో 13,000 ppm వరకు తేమ నమోదైనట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది.

E20 fuel contamination: E20 పెట్రోల్‌పై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ఇంధనంలో అధిక స్థాయిలో క్లోరైడ్ & తేమ ఉన్నట్లు కార్ల తయారీ సంస్థలు గతంలోనే ప్రభుత్వానికి తెలిపినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తేమశాతం అనుమతించిన పరిమితి కంటే అతి భారీగా ఉన్నట్లు తాజా వివరాల్లో బయటపడింది.

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌పై వాహనదారుల్లో ఆందోళనలు పెరుగుతున్న వేళ ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. E20లో క్లోరైడ్ స్థాయిలకు తప్పనిసరి పరిమితి విధించాలని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) గతంలో ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఆ లేఖలో పేర్కొన్న కొన్ని గణాంకాలకు మరింత ధ్రువీకరణ అవసరమని చెప్పి SIAM ఆ సమాచారాన్ని తర్వాత ఉపసంహరించుకుంది.

అయితే రాయిటర్స్ పరిశీలించిన అంతర్గత సమాచారంలో... మారుతి సుజుకి, టాటా మోటార్స్ & మహీంద్రా సంస్థలు E20 ఇంధనంలో కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. ఈ సంస్థలు 21 రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల నుంచి 250కి పైగా ఇంధన నమూనాలను సేకరించి పరీక్షించినట్లు సమాచారం.

ఈ పరీక్షల్లో 18 రాష్ట్రాల్లోని పలు నమూనాల్లో క్లోరైడ్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ అనుమతించిన పరిమితి 3 ppm. కానీ రాజస్థాన్‌లో 6 నుంచి 570 ppm వరకు, ఢిల్లీ-NCRలో 1.4 నుంచి 420 ppm వరకు, మహారాష్ట్రలో 10 నుంచి 357 ppm వరకు క్లోరైడ్ నమోదైనట్లు డేటా చూపించింది.

రాష్ట్రం
నమూనాల సంఖ్య
క్లోరైడ్ (ppm)
ఉత్తరప్రదేశ్
 
36
1.2-175
మహారాష్ట్ర
 
31
10-357
ఢిల్లీ/NCR
 
28
1.4-420
తమిళనాడు
 
27
1.3-24.0
కేరళ
 
24
1.0-2.2
పంజాబ్
 
20
1.9-110
కర్నాటక
 
15
1- 2.2
రాజస్థాన్
 
14
6.0-570
మధ్యప్రదేశ్
 
11
4.1-550

Source: Reuters

అధిక స్థాయిలో క్లోరైడ్ ఉంటే వాహనాల్లోని లోహ భాగాలు తుప్పు పట్టే ప్రమాదం ఉంటుంది. ఇంధనంలో తేమ ఎక్కువగా ఉంటే ఇంధనం నింపిన వెంటనే వాహనం పనిచేయకుండా పోయే అవకాశం ఉందని గతంలో SIAM పేర్కొంది.

ఇది కూడా చదవండి: Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?

ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక తేమ

తేమ విషయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని ఇంధన నమూనాల్లో తేమ 13,000 ppm వరకు నమోదైనట్లు రాయిటర్స్ తెలిపింది. ప్రభుత్వం అనుమతించిన పరిమితి 3,000 ppm మాత్రమే. అంటే అనుమతించిన స్థాయి కంటే ఇది 333 శాతం ఎక్కువ.

ఉత్తరప్రదేశ్‌లోనూ 12,500 ppm వరకు తేమ నమోదైనట్లు డేటా వెల్లడించింది. అయితే, ఇలా తేమ ఎక్కువగా ఉండడానికి అసలు కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. పెట్రోల్ బంకుల్లో భూగర్భ ఇంధన ట్యాంకులు & పైపుల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల తేమ పెరిగి ఉండొచ్చని SIAM గతంలో పేర్కొంది.

మరోవైపు, E20పై దేశవ్యాప్తంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చమురు సంస్థలు చెబుతున్నాయి. ఇటీవలే దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించామని, విస్తృత స్థాయిలో ఇంధన కలుషితం ఉన్నట్లు ఆధారాలు కనిపించలేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. ఇప్పటివరకు కేవలం నాలుగు కలుషిత కేసులు మాత్రమే గుర్తించినట్లు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.

ఇది కూడా చదవండి: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?

అయితే, కార్ల తయారీ సంస్థల అంతర్గత సమాచారం బయటకు రావడంతో E20పై చర్చ మరోసారి వేడెక్కింది. SIAM మాత్రం ఈ డేటా పరిమిత నమూనాల ఆధారంగా సేకరించిందని, తుది నిర్ణయాలకు ఇది సరిపోదని స్పష్టం చేసింది. పూర్తి శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది.

E20 ఇంధనంపై చమురు కంపెనీలు & వాహన తయారీ సంస్థల నుంచి భిన్నమైన వాదనలు వస్తున్న నేపథ్యంలో.. అసలు ఇంధన నాణ్యతపై స్పష్టత ఎప్పుడు వస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ
5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ
350cc బైక్‌ Triumph Tracker 400 రియల్‌ మైలేజ్‌ గురించి తెలుసా? లీటర్ పెట్రోల్‌తో ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే?
Triumph Tracker 400 నిజమైన మైలేజ్ ఎంత? సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై అసలు లెక్క ఇదే!
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan double stand: వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?
వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Embed widget