అన్వేషించండి

5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ

చైనాకు చెందిన Geely కంపెనీ తీసుకొచ్చిన కొత్త స్మార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా EV బ్యాటరీ కేవలం 4.5 నిమిషాల్లో 10 శాతం నుంచి 70 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ ఛార్జర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గీలీ 2.25 మెగావాట్ల స్మార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఆవిష్కరించింది.
  • EV బ్యాటరీ 10-70% ఛార్జ్ కేవలం 4.5 నిమిషాల్లో పూర్తవుతుంది.
  • AI తో బ్యాటరీ వేడెక్కకుండా రక్షణ, జీవితకాలం 20% పెంపు.
  • 2027 నాటికి చైనాలో లక్ష ఛార్జింగ్ గన్‌లు లక్ష్యంగా పెట్టుకుంది.

పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే చాలా మంది ఇప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్, ఛార్జింగ్ సమయం ఎక్కువ అని ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ సమస్య త్వరలోనే పరిష్కారం కానుంది. చైనా ఆటోమొబైల్ దిగ్గజం Geely ఒక అద్భుతమైన టెక్నాలజీని తీసుకొచ్చింది. ఇది గ్రాండ్ గ్లోబల్ ఆటో మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. Geely తన కొత్త 2.25 మెగావాట్ల స్మార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఆవిష్కరించింది.

ఈ సాంకేతికత అనుకూలంగా ఉండే ఏ ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీనైనా కేవలం 4 నిమిషాల 30 సెకన్లలో 10 శాతం నుంచి 70 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. 10 శాతం నుంచి 97% వరకు ఛార్జింగ్ కావడానికి కేవలం 8 నిమిషాల 40 సెకన్ల సమయం పడుతుంది. BYD, CATL వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఆల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ రేసులో పోటీ పడుతున్న సమయంలో ఈ వార్త బయటకు వచ్చింది. ఈ ఛార్జర్, ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. 

2.25 మెగావాట్ల ఆల్ట్రా-పావర్ ఫుల్ ఛార్జింగ్ నెట్‌వర్క్

Geely ఈ కొత్త ఛార్జింగ్ సెటప్ 2.25 మెగావాట్ల పీక్ ఛార్జింగ్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సామర్థ్యం ప్రస్తుతం అమెరికా లేదా యూరప్‌లో అందుబాటులో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల కంటే చాలా రెట్లు ఎక్కువ అని చెప్పదచ్చు. అక్కడ 10 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి దాదాపు 20 నుంచి 40 నిమిషాలు పడుతుంది.

గీలీ కంపెనీ ఈ ఆల్ట్రా-ఫాస్ట్ టెక్నాలజీని తన ప్రీమియం బ్రాండ్స్ Lynk & Co, Zeekr మోడళ్లపై పరీక్షించింది. ఇంత తక్కువ సమయంలో భారీ పరిమాణంలో విద్యుత్ బదిలీ చేయడం ద్వారా Geely ఛార్జింగ్ స్పీడ్‌లో వరల్డ్ రికార్డును నెలకొల్పింది.

మొత్తం సిస్టమ్‌ను కంట్రోల్ చేయనున్న AI

ఇంత వేగంతో బ్యాటరీలోకి విద్యుత్ ప్రవహించినప్పుడు ఓవర్‌ హీటింగ్, బ్యాటరీ పాడైపోవడం ప్రమాదంగా మారుతుంది. అయితే ఈ ప్రమాదాన్ని నివారించడానికి Geely రియల్-టైమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిస్టమ్‌ను సైతం వినియోగిస్తోంది. ఈ AI మోడల్ ఛార్జింగ్ సమయంలో బ్యాటరీ ఉష్ణోగ్రతను 30 సెకన్ల ముందే ఊహించి, పవర్ ఫ్లోను అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల మొత్తం ఛార్జింగ్ ప్రక్రియలో బ్యాటరీ సగటు ఉష్ణోగ్రత 55 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. తద్వారా మంటలు చెలరేగడం లేదా ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజీ కావడం జరగవచ్చు.

ఈ టెక్నాలజీతో పెరగనున్న బ్యాటరీ లైఫ్

ఆల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ లైఫ్ సైకిల్ తగ్గుతుందనే ఫిర్యాదులు వస్తుంటాయి. Geely ఈ సమస్యకు ఆల్ట్రా షార్ట్ బ్లేడ్ బ్యాటరీ, పల్స్ రిస్టోరేషన్ టెక్నాలజీ ద్వారా పరిష్కారం కనుగొంది. ఛార్జింగ్ స్టేషన్ నుంచి వచ్చే మైక్రో-పల్స్ కరెంట్లు ఫాస్ట్ ఛార్జింగ్ సమయంలో యానోడ్‌పై పేరుకుపోయే లిథియం అయాన్లను మళ్లీ యాక్టివ్ చేస్తాయి. ఈ అడ్వాన్స్‌డ్ కూలింగ్, పల్స్ మేనేజ్‌మెంట్ వల్ల బ్యాటరీ లైఫ్ సాధారణం కంటే 20 శాతం వరకు పెరుగుతుందని కంపెనీ పేర్కొంది.

వేగంగా విస్తరించనున్న ఛార్జింగ్ టెక్నాలజీ

టెక్నాలజీ తయారుచేస్తే సరిపోదని, దానిని వినియోగదారులకు చేరవేయడమే అసలైన సవాలు అని తెలిపారు. 2027 నాటికి చైనా వ్యాప్తంగా 1 లక్ష కంటే ఎక్కువ ఛార్జింగ్ గన్‌లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు Geely కంపెనీ తెలిపింది. టించింది. 2028 నాటికి 90,000 సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని చూస్తున్న BYD నెట్‌వర్క్‌కు నేరుగా పోటీ ఇస్తోంది. 

Frequently Asked Questions

Geely ఏ కొత్త ఛార్జింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది?

Geely 2.25 మెగావాట్ల స్మార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఆవిష్కరించింది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను చాలా వేగంగా ఛార్జ్ చేయగలదు.

Geely కొత్త టెక్నాలజీతో EV బ్యాటరీ ఎంత వేగంగా ఛార్జ్ అవుతుంది?

ఈ టెక్నాలజీతో, అనుకూలమైన EV బ్యాటరీ కేవలం 4 నిమిషాల 30 సెకన్లలో 10% నుండి 70% వరకు ఛార్జ్ అవుతుంది. 10% నుండి 97% వరకు ఛార్జ్ అవ్వడానికి 8 నిమిషాల 40 సెకన్లు పడుతుంది.

వేగవంతమైన ఛార్జింగ్‌లో బ్యాటరీ భద్రతకు Geely ఎలా హామీ ఇస్తుంది?

Geely రియల్-టైమ్ AI సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. ఇది బ్యాటరీ ఉష్ణోగ్రతను 30 సెకన్ల ముందుగానే అంచనా వేసి, పవర్ ఫ్లోను సర్దుబాటు చేస్తుంది, తద్వారా ఉష్ణోగ్రత 55°C కంటే తక్కువగా ఉంటుంది.

ఈ కొత్త టెక్నాలజీ బ్యాటరీ జీవితకాలాన్ని ఎలా పెంచుతుంది?

ఆల్ట్రా షార్ట్ బ్లేడ్ బ్యాటరీ, పల్స్ రిస్టోరేషన్ టెక్నాలజీ వల్ల బ్యాటరీ జీవితకాలం సాధారణం కంటే 20 శాతం వరకు పెరుగుతుంది. ఇది లిథియం అయాన్లను మళ్లీ యాక్టివ్ చేస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget