నెలవారీ EMI మీ టేక్-హోమ్ శాలరీలో 15 నుండి 20 శాతానికి మించకూడదు. కనుక నెలవారీ కనీస జీతం రూ. 50,000 అయినా ఉండాలి.
1.3 లక్షలు డౌన్ పేమెంట్ చేసి Tata Aeris కారు కొనవచ్చు.. EMI ఎంత చెల్లించాలి
టాటా మోటార్స్ కొత్త టాటా ఏరిస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎంత జీతం ఉంటే ఈ సెడాన్ కారు సొంతం చేసుకోవచ్చో, నెలవారీ EMI ఎంత అవుతుందో తెలుసుకోండి.

- EMI చెల్లింపులకు నెలకు కనీసం రూ.50,000 జీతం ఉండాలని సూచించారు.
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన నూతన కాంపాక్ట్ సెడాన్ టాటా ఏరిస్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. రూ. 5.29 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చింది. ఈ కారు కంపెనీ పోర్ట్‌ఫోలియోలో టిగోర్ స్థానాన్ని భర్తీ చేస్తూ, మోడ్రన్ ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఏదైనా కొత్త కారు వచ్చిందంటే దాని ధర, కొనడానికి ఉన్న అవకాశాలపై చర్చ జరుగుతుంది.
చాలా మంది బడ్జెట్, ఫైనాన్స్, EMIల లెక్కలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. కొత్త కారు కొనేటప్పుడు అధిక ఆర్థిక భారం పడకుండా మేనేజ్ చేసుకోవాలి. టాటా ఏరిస్ బేస్ వేరియంట్‌ను పూర్తి ధర చెల్లించకుండానే, డౌన్ పేమెంట్ చేసి, నెలవారీ ఈఎంఐ రూపంలో కడుతూ సొంతం చేసుకోవచ్చు.
టాటా ఏరిస్ ధర ఎంత?
హైదరాబాద్‌లో టాటా ఏరిస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 5.29 లక్షలు కాగా, ఆన్ రోడ్ ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ధరతో పాటు ఆర్టీవో రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలను కలిపితే ఆన్ రోడ్ ధర అవుతుంది. హైదరాబాద్ సిటీలో టాటా ఏరిస్ ఆన్ రోడ్ ధర రూ. 6,42,052 చెల్లించాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాలు, నగరాలను బట్టి ఆన్-రోడ్ ధరలో వ్యత్యాసం ఉండవచ్చు.
Also Read: RE Himalayan 440 అసలు ఎంత స్పీడ్‌గా వెళ్తుంది? యాక్సిలరేషన్ & బ్రేకింగ్ టెస్ట్ ఫలితాలు
డౌన్ పేమెంట్, లోన్, EMI లెక్కలు
కారు కొనుగోలు చేసేటప్పుడు ఆన్-రోడ్ ధరలో కనీసం 20 శాతాన్ని డౌన్ పేమెంట్‌గా చెల్లించడం మంచిది. టాటా ఏరిస్ బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర 6.42 లక్షలు కాగా, 1.3 లక్షలు డౌన్ పేమెంట్‌గా చెల్లించాలి. ఆపై మిగతా 5.12 లక్షలు బ్యాంక్ నుంచి కార్ లోన్ తీసుకోవాలి. బ్యాంక్ ఏటా 9 శాతం వడ్డీ రేటుతో లోన్ మంజూరు చేస్తే ఈఎంఐ వివరాలు ఇలా ఉంటాయి.
9 శాతం వార్షిక వడ్డీ రేటుతో రూ. 5.12 లక్షల కారు లోన్ తీసుకుంటే 4 సంవత్సరాల కాలపరిమితికి (48 నెలలు) ప్రతినెలా సుమారు రూ. 12,746 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. మీ వడ్డీ 1,00,000 కాగా, అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 6,12,000 చెల్లిస్తారు.
5 సంవత్సరాలకు (60 నెలలు) ఎంచుకుంటే, నెలవారీ ఈఎంఐ రూ. 10,628 అవుతుంది. అయితే మొత్తం వడ్డీ భారం పెరిగి రూ. 1,25,680 అవుతుంది. అసలుతో కలిపి బ్యాంక్‌కు చెల్లించే మొత్తం రీపేమెంట్ మొత్తం రూ. 6,37,680 కి చెల్లిస్తారు.
6 సంవత్సరాలకు (72 నెలలు) ఎంచుకుంటే, నెలవారీ ఈఎంఐ రూ. 9,222 వరకు ఉంటుంది. కానీ మొత్తం వడ్డీ రూ. 1,51,984 కి పెరుగుతుంది. దీంతో మీరు బ్యాంక్‌కు తిరిగి చెల్లించాల్సిన మొత్తం రీపేమెంట్ ఏకంగా రూ. 6,63,984 అవుతుంది.
Also Read: యాక్సెంట్ నుంచి 2026 వెర్నా వరకు.. రెండు దశాబ్దాల్లో హ్యుందాయ్ సెడాన్ ప్రయాణం!
జీతం ఎంత ఉండాలి
కారు కొనేందుకు వెళ్లేముందు మీ ఆర్థిక స్థితి, నెలవారీ జీతం, ఆదాయాన్ని చెక్ చేసుకోండి. నెలవారీ EMI మీ మొత్తం టేక్-హోమ్ శాలరీ, ఆదాయంలో 15 నుంచి 20 శాతానికి మించకూడదు. ఇరవై శాతం అనుకుంటే మీ నెలవారీ ఈఎంఐ సుమారు 9500 నుంచి 12 వేల వరకు ఉంటుంది. కనుక నెలవారీ కనీస జీతం రూ. 50,000 అయినా ఉండాలి. దాన్ని మించితే ఈఎంఐ చెల్లించడం కష్టమవుతుంది. మెయింటనెన్స్ ఖర్చులు, ఇతర ఇంటి నెలవారీ ఖర్చులను సైతం ఆలోచించుకోవాలి. మీ సిబిల్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీ రేటుకే లోన్ పొందవచ్చు.
Frequently Asked Questions
టాటా ఏరిస్ EMI చెల్లించడానికి ఎంత నెలవారీ జీతం అవసరం?
ట్రెండింగ్ వార్తలు























