అన్వేషించండి

6 ఏళ్ల తర్వాత వచ్చిన కొత్త Mahindra Thar OG .. ఫీచర్లు, ధర, EMI లెక్కలు చూసి కొనేయండి

Mahindra Thar Cars | మహీంద్రా కొత్త 3 డోర్ థార్‌ను కొనాలని భావిస్తున్నారా.. అయితే దాని ధర, డౌన్ పేమెంట్ సహా ఈఎంఐ పూర్తి లెక్కలు ఇక్కడ అందిస్తున్నాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మహీంద్రా కొత్త 3-డోర్ థార్ OG ఆధునిక డిజైన్‌తో విడుదల.
  • దీనికి రూ. 10.32 లక్షల ప్రారంభ ధర; అధునాతన ఫీచర్లు.
  • ఇంజిన్లలో మార్పులేదు; ఫైనాన్స్, ఈఎంఐ వివరాలు అందుబాటులో.

మహీంద్రా థార్‌ను ఇష్టపడే వారికి ముఖ్యమైన అప్డేట్.. 2026 సెప్టెంబర్ 22న కంపెనీ 3-డోర్ థార్ కొత్త అప్‌డేటెడ్ మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈసారి కొత్త థార్‌ను గతంలో కంటే మరింత మోడ్రన్‌గా తీసుకొచ్చారు. దీని డిజైన్‌లో పెద్ద థార్ రోక్స్ (Thar Roxx) షేడ్స్ కనిపిస్తున్నాయి. దీనికి మహీంద్రా థార్ ఓజీ (Mahindra Thar OG) అని పేరు పెట్టారు. కొత్త థార్‌కి సంబంధించిన ఫైనాన్స్, ఈఎంఐ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

థార్ రాక్స్ తరహాలోనే ఫ్రంట్ డిజైన్

కొత్త మహీంద్రా థార్‌లో పెద్ద మార్పు దాని ముందు భాగంలో కనిపిస్తుంది. ఇందులో థార్ రాక్స్ ఆధారిత డిజైన్‌తో కూడిన కొత్త గ్రిల్‌ను ఇచ్చారు. ఈ SUVలో కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, C-షేప్ LED DRLలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న మోడల్‌లోని లైటింగ్‌తో పోలిస్తే ఈ కొత్త సెటప్ థార్‌కు మోడ్రన్ లుక్ ఇస్తుంది. ఫ్రంట్ బంపర్, టర్న్ ఇండికేటర్లలో కూడా మార్పులున్నాయి. 

మహీంద్రా థార్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఆఫ్-రోడ్ SUVలలో ఒకటి. కంపెనీ దీని 3-డోర్ మోడల్‌ను కొత్త అప్‌డేట్‌లతో  తీసుకొచ్చింది. కొత్త థార్ ఓజీ (Thar OG) హైదరాబాద్‌లో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.32 లక్షలుగా నిర్ణయించారు. ఆన్ రోడ్ ధర దాదాపు 12.9 లక్షలు ఉంది. హైదరాబాద్‌లో దీని టాప్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 18.99 లక్షల వరకు ఉంటుంది. అయితే పూర్తి డబ్బులు లేకపోతే డౌన్ పేమెంట్ చేసి, ఫైనాన్స్ ద్వారా మిగతా నగదు చెల్లించవచ్చు.

 బేస్ మోడల్ ఈఎంఐ ధరల వివరాలు ఇవే

మహీంద్రా థార్ ఓజీ బేస్ మోడల్ డౌన్ పేమెంట్ 2.5 లక్షలు చెల్లిస్తే.. మిగతా 10.4 లక్షలు బ్యాంక్, ఫైనాన్స్ సంస్థల లోన్ తీసుకోవాలి. దాంతో 9.5 శాతం వడ్డీతో 4 నుంచి 6 ఏళ్ల వరకు లోన్ తీసుకుంటే నెలవారీ వడ్డీల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.   

4 సంవత్సరాల కాలపరిమితి (48 నెలలు) నెలవారీ EMI రూ. 26,116 చెల్లించాలి. అయితే మీరు చెల్లించే వడ్డీ మొత్తం 2,13,546 అవుతుంది. ఒకవేళ మీరు 5 సంవత్సరాలకు (60 నెలలు) లోన్ తీసుకుంటే 21,833 ఈఎంఐ చెల్లించాలి. వడ్డీ 2,69,972తో కలిపి 13,09,972 చెల్లించుకుంటారు. 6 సంవత్సరాలు (72 నెలలు) నెలవారీ EMI రూపంలో 18,992 కట్టాలి. చెల్లించే వడ్డీ 3,27,388 కాగా, మొత్తంగా 13.67 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.

కేబిన్‌లోనూ కొత్త ఫీచర్లు

కొత్త థార్ ఓజీ లోపలి భాగంలో మరికొన్ని మార్పులు చేశారు. కంపెనీ ఇందులో కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఇచ్చింది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కొనసాగించారు. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఇచ్చారు. 

ఇంజిన్‌లో అంతగా మార్పుల్లేవు 

కొత్త థార్ మెకానికల్ భాగంలో పెద్ద మార్పులు చేయలేదు. కంపెనీ ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను కంటిన్యూ చేసింది.  ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఇస్తోంది. పలు ఇంజిన్లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇచ్చింది. 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లతో 4WD ఆప్షన్ అందించింది. డిజైన్, ఫీచర్లలో మార్పులు వచ్చినప్పటికీ థార్ ఆఫ్-రోడ్ ఫోకస్ మాత్రం మారలేదు. 

 

Frequently Asked Questions

కొత్త మహీంద్రా థార్ మోడల్ ఎప్పుడు లాంచ్ అయ్యింది మరియు దాని పేరు ఏమిటి?

3-డోర్ మహీంద్రా థార్ కొత్త అప్‌డేటెడ్ మోడల్ 2026 సెప్టెంబర్ 22న భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. దీనికి మహీంద్రా థార్ ఓజీ (Mahindra Thar OG) అని పేరు పెట్టారు.

కొత్త మహీంద్రా థార్ ఓజీలో ప్రధాన డిజైన్ మార్పులు ఏమిటి?

దీని ముందు భాగంలో థార్ రాక్స్ ఆధారిత కొత్త గ్రిల్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, C-షేప్ LED DRLలు ఉన్నాయి. ఫ్రంట్ బంపర్, టర్న్ ఇండికేటర్లలో కూడా మార్పులు చేశారు.

కొత్త మహీంద్రా థార్ ఓజీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఎంత?

హైదరాబాద్‌లో కొత్త మహీంద్రా థార్ ఓజీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.32 లక్షలు. దీని ఆన్ రోడ్ ధర దాదాపు 12.9 లక్షలు.

కొత్త థార్ క్యాబిన్‌లో ఎలాంటి కొత్త ఫీచర్లు అందించబడ్డాయి?

కొత్త థార్ లోపలి భాగంలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కొనసాగుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget